Manamida padi karavakundaa

శకునాల పిచ్చి ఉన్న శంకర్రావు, రాఘవయ్య పంతులు ఇద్దరు కలిసి రోడ్డుమీద

నడుస్తున్నారు.

అంతలో వాళ్లకి ఒక కుక్క ఎదురొచ్చింది.

“ పంతులుగారూ...ఆ వచ్చే కుక్క మనకు కుడివైపు ఉండి వెళ్లడం మంచిదా...లేక

ఎడమవైపు నుండి వెళ్లడం మంచిదా ?” అని అడిగాడు శంకర్రావు.

“ మనమీద పడి కరవకుండా వెళ్లడం మంచిది " అని అన్నాడు రాఘవయ్య.

“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు శంకర్రావు.