ఏమయింది?

“మా స్టెనో గ్రాఫర్ సామాన్యురాలు కాదు, రాజకీయ నాయకులను మించిన తెలివితేటలు ఉన్నాయి ఆవిడకి!” అన్నాడు గోవింద్.

“ఏమయింది? ఎందుకలా అంటున్నావు?” అడిగాడు సురేంద్ర.

“ఆఖరికి షార్ట్ హాండ్ మిషన్ రిపేర్ అంటూ బిల్లు పెట్టి డబ్బులు దండుకుంది!” చెప్పాడు గోవింద్

అది విని అవాక్కయ్యాడు సురేంద్ర.