అవునా...

“మధూ, మన ప్రేమ సంగతి ఇంట్లో తెలిసిపోయింది.” చెప్పింది రాధ.

‘ఒప్పుకోలేదు’ అని చెప్తే ఊపిరి పీల్చుకోవచ్చనే ఆశతో, “అవునా... ఏమన్నారు?” ఆత్రుతగా అడిగాడు మధు.

“సర్లే, చేసుకోమ్మన్నారు!”

ఉసూరుమంటూ, ఏడవలేక నవ్వాడు మధు.