TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 55
స్వప్న కంఠంనేని
సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన.
ఇద్దరు మనుష్యులు, బలంగా, ధృడంగా వున్నారు. సడెన్ గా వైభవ్ మీద పడి అతన్ని లాక్కెళ్ళారు. క్షణాల మీద జరిగింది ఇదంతా.
హనిత అయోమయంగా చూస్తుండిపోయింది.
వాళ్ళు జీప్ లో తమని వెంబడిస్తున్న వాళ్ళు కాదు
మరింకెవరై వుంటారు ?
వైభవ్ కి, తనకీ ఈ వూళ్ళో శత్రువులెవరున్నారు ?
ఇదివరకేప్పుడు కనీసం ఊరికైనా రాలేదు.
వైభవ్ ని చూసి ఇంకెవరో అని భ్రమపడ్డారేమో !
అయినా వైభవ్ ని చూసి ఏం చేయగలరు ?
అతను హిమాన్. గర్వంగా అనుకుంది హనిత.
ఊళ్ళోకి వెళ్తే అసలు విషయం తెలుస్తుందని ఊళ్ళోకి నడిచింది.
పట్నం పోకళ్ళు, సినిమా పద్దతులు అప్పుడప్పుడే సోకుతుండడంతో ఆ ఊరు పల్లె వాతావరణంలో వుండే చక్కదనాన్ని పోగొట్టుకుంది. ఇటు సిటికి వుండే చక్కదనం, నాజూకుతనము లేక
రెండిటికి చెడ్డట్లుగా వుంది.
హనిత ఊళ్ళో అడుగు పెట్టడంతో ఒక విషయం తెలుసుకుంది. ఊర్లో ఏదో హడావిడిగా వుంది. రంగు రంగుల చీరలు, దిగేసిన నగలతో ఆడపిల్లలు అటూ ఇటూ కదులుతున్నారు. పెళ్లి సంబరమో,
నోములు, వ్రతాలు లాంటి శుభకార్యామో జరుగుతుంది అనుకుంది
హనిత.
ఆడపిల్లలంతా పాపిట బిళ్ళలు, పట్టుచీరలు, వడ్డాణాలు, చంద్రహారాలు పెట్టుకుని పల్లెటూరి బడాయిల్ని మొహాల్లో నింపుకుని కులుకు మొహల్తో నడుస్తున్నారు.
" హలో! హలో గాళ్స్ " అని పిలిచింది హనిత.
ఎవరు పట్టించికోవడం లేదు. ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు.
" ఒకబ్బాయి తెల్లగా , బొద్దుగా, పొడవుగా, ఉంటాడు. అచ్చం ఆడపిల్లలాగా, మీకు కనిపించాడా ?
" ఆ అమ్మాయి హనిత మోహంలోకి పరీక్షగా చూసింది. తర్వాత చెప్పింది.
" ఆ రామ తానేదో అందగత్తెననుకుంటుంది. నేను చూడు లావుగా , పొట్టిగా, ఎంత అందంగా ఉన్నానో? లావుగా, పొట్టిగా ఉంటేనే ఆడపిల్లలు అందంగా వుంటారు కదూ! ఇదేమిటి నువ్విలా
వున్నావ్ ? సన్నగా, పొడవుగా యాఖ్ యాఖ్ అమ్మా"
ఆ పిల్ల మీద జాలేసింది హనితకు.
వైభవ్ గురించి అంతకుముందు అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడిగింది.
" అతనా అతను నన్ను చేసుకుంటాడు" అంటూపరుగు పందెంలో తనెక్కడ వెనకబడి పోతుందోనన్నట్లు ఆ అమ్మాయి ముందుకు పరుగు తీసింది.
ఖంగుతింది హనిత.
ఎవరి గురించి మాట్లాడుతుందో ఆ అమ్మాయి ?
కొంపతీసి వైభవ్ గురించి కాదు కదా?
ఈ అమ్మాయి లాభం లేదనుకుని మరో అమ్మాయిని అడిగింది హనిత.
" నా చెవి జూకాలు చూసావా ? పచ్చ్హలతో చేయించాడు మా నాన్న ఒక్కొక్క పచ్చ రెండువందల ఎనబై రెండు రూపాయలు తెల్సా? నేను చాలా అందంగా ఉంటా కదా అతను నన్నే
చేసుకుంటాడు." అనేసి వెళ్లిపోయిందా అమ్మాయి.
హనితకి జుట్టు పీక్కోవలనిపించింది
వీళ్ళంతా వైభవ్ కి లైనేయడం లేదు కదా ?
అతన్ని చూస్తేనే ఆడపిల్లలకు అలంటి బుద్దులు పుడతాయ్. ఎంత అందంగా ఉంటాడతను? బుద్దూ, పప్పు సుద్ద మురిపెంగా అనుకుంది హనిత.
ఆడపిల్లల్ని అడిగితే లాభం లేదనుకుని అక్కడేవున్నఒక ముసలావిడని అడిగింది.
" ఆ అబ్బాయా ? తిన్నగా ఈ ఆడపిల్లలేక్కడికి వెళ్తున్నారో అక్కడికి , వాళ్లతో పాటు వెళ్ళిపో, బహుశ అక్కడుండవచ్చు" చెప్పిందవిడా.
అమ్మాయిల క్యూని ఫాలో అవుతూ నడవసాగింది హనిత.
ఏదో జాతరకు వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు వాళ్ళు.
దారిలో హనితకు వైభవ్ మీద కోపం వచ్చింది కూడా.
అసలైన ఈ వైభవ్ ఏం చేసున్నాడు. తనని ఒక్కదాన్నే ఒదిలేసి వచ్చేసాడు. తనేమైందో అన్న ఆలోచనైన లేదు. ఇడియట్ వీళ్ళందరికీ సైట్ కొడుతూ హ్యాపీగా గడిపేయడం లేదు కదా.
ఇంకెంతసేపులే ?ఇప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు చెప్తుంది తన వైభవ్ సంగతి.
" బీ రెడీ వైభవ్ " ఆవేశంగా అనుకుంది హనిత.
|