TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 56
స్వప్న కంఠంనేని
తన ముందు వెళ్తున్న ఆడపిల్లల క్యూ ఒక ఇంటి ముందు ఆగిపోవడం గమనించింది హనిత.
ఆ ఇంట్లో ఉంటాడ వైభవ్?
క్యూ ని చెల్లాచెదురయ్యేట్లుగా తీసిపారేసి లోపలి నడిచింది.ఇంటి లోపలి పరిస్థితి గమనించాక తను వైభవ్ ని ఎంత అపార్ధం చేసుకుందో అర్ధమైంది హనితకు.
అక్కడ ఒక కుర్చీలో కూర్చుని వున్నాడు వైభవ్, కదలకుండా ఎటూ పారిపోకుండా అతడిని కుర్చీలో బిగించి కట్టారు. నోట్లో గుడ్డలు కుక్కి కూడా ఉన్నాయి.
క్యూలు కట్టుకుంటూ వచ్చిన అమ్మాయిలంతాపెరేడ్ చేస్తున్నట్లుగా కులుకుతూ వయ్యారాలు పోతూ" నన్ను చూడు నా అందం చూడు' అన్నట్లుగా అతడి ముందు ప్రదర్శనలు చేస్తున్నారు.
కుర్చీలో కట్టేయబడి వున్న వైభవ్ ఎమి చేయలేక ఏడుపు మొహంతో గింజుకుంటున్నాడు.
" హయ్ " అన్నట్లుగా హనిత వైభవ్ కి చేయి ఉపింది.
ఆమెను చూడగానే వైభవ్ మొహం ఆనందం తో వెలిగిపోతుంది. నన్ను కాపాడావు అన్నట్లుగా చుసాడామె వైపు.
జరుగుతున్న తతంగం చూస్తే హనితకు సరదా గా అనిపించింది.' మంచిగా అవ్తోంది నీకు' అన్నట్లు వెక్కిరించింది వెళ్ళి గోడపక్కన నిలుచుంది.
ఇంతలో ఒకమ్మాయి తన తల్లిదండ్రులతో పటు వచ్చి వైభవ్ ఎదురుగా నిలపడింది. ఆమె చేతిలో క్రికెట్ బ్యాట్,బాల్, టెన్నిస్ బాల్, చెస్ బోర్డ్ ఉన్నాయి.బాల్ ని తన తండ్రి చేతికి ఇచ్చింది.అతను బౌలింగ్ చేసాడు ఆమె బాల్ ని బ్యాట్ తో గట్టిగా కొట్టింది. బ్యాట్ విరిగింది.
ఆ అమ్మాయి తండ్రి వెర్రి నవ్వు నవ్వాడు.
ఆమె తల్లి చెప్పసాగింది.
" ఆటల్లో మేటి. తనకు తానే సాటి మా లతికా"
క్రికెట్ బ్యాట్ విరిగిపోవడంతో తండ్రికూతుళ్ళు టెన్నిస్ బ్యాట్స్ చేతుల్లోకి తీసుకున్నారు.
ఆ అమ్మాయి తనే సర్విసింగ్ చేసింది. అయితే రూమ్ చిన్నదవడంతో బాల్ రూఫ్ కి తగిలి తగిలి వెనక్కి వచ్చి ఆమె తలకు తగిలి బొప్పి కట్టింద ఆమె తల్లి తను తీసుకొచ్చిన గోనె సంచిని కిందకి గుమ్మరించింది. తర్వాత అన్నది.
" ఇవన్నీ మా అమ్మాయి ఎన్నో ఆటలపోటిల్లో పాల్గొని గెలుచుకున్న కప్పులు"
హనిత పక్కనున్నతను హనిత తో చెప్పాడు
" భీమారావు అన్నీ అబద్దాలు చెప్తాడు. అవన్నీ టౌన్ లో ఫ్యాన్సీ స్టోర్ లో కొన్నారు వాళు. వాళ్ళు కొనేటప్పుడు నేను చూసాను.
అక్కడున్న ఆడపిల్లలంతా హనితను అసూయగా చూడసాగారు. నిర్లక్ష్యంగా చేసుకున్న డ్రెస్ తో హాలివుడ్ హీరోయిన్ లా వున్నా ఆమె పోటీ అవుతుందేమో అని కోపంగా వుంది వాళ్ళకు.
తర్వాత వీణ అనే అమ్మాయి వచ్చి మేలికలి తిరిగిపోతూ వైభవ్ కాలు తొక్కింది. ఆ తర్వాత ఎగిరి అతని ఒళ్లో కూర్చుని గారాలు పోసాగింది. ఆమె తల్లి కాబోలు ఒక సూట్‌కేస్‌లో నగలు తీసుకువచ్చి " ఇవన్నీ మా అమ్మయివే " అంటూ డిస్ ప్లే చేస్తోంది
కంపరంగా మొహం పెట్టి వైభవ్ గింజుకొసాగాడు.
|