Antera Bamardee 11

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

*******************************************************************

అంతేరా బామ్మర్దీ - 11

బసవరాజు అండ్ కంపెనీ ముందు సిటీ బస్సు ఆగింది.

ఆ కంపెనీకి అందుబాటులో స్టేజి వుంది గనుక అక్కడాగింది.

ఆ బస్సులోంచి రంగనాథం దిగేడు.అతను కోపంతో ఊగిపోతున్నాడు.

కోఠీలో బస్సెక్కేముందు ఆటోవాడితో పేచీ పడ్డాడు.తప్పుడు మీటర్లు పెట్టుకు తిరుగుతున్నావని ఆటో మనిషి మీద అరిచేడు.పన్నెండు రూపాయలు చూపించవలసిన మీటరు పదిహేడు చూపించడంతో అంతరార్థం ఏమిటని అడిగేడు.

తెలుగు అర్థంకాని ఆ ఆటోమనిషి ఉర్దూ భాషలో ఏదో చెప్పేడు! ఉర్దూ భాష తెలీని రంగనాథం, తెలుగు రాష్ట్ర రాజధానిలో ఉర్దూ వాడకాన్ని నిషేధించాలన్నాడు.ఈ విషయమై ఆందోళన చేయడానికి తాను సిద్ధంగా వున్నానని ప్రకటించి ఇరవై రూపాయల నోటు అతని చేతికిచ్చి సిటీ బస్సెక్కేడు! సిటీ బస్సులో కూడా ఇదే వాతావరణం! కండక్టరు ఉర్దూ ఉపయోగిస్తున్నాడు.

దిసీజ్ నాట్ కరాచీ అని రంగనాథం ఇంగ్లీషులో అరిచేడు. స్పీకిన్ తెలుగు అని ఇంగ్లీషులోనే కోప్పడ్డాడు. మిగతా పాసెంజర్లు రంగనాథాన్ని సముదాయించేరు.ఎవరి మాతృభాషలో వారు మాటాడటం తప్పు కాదని బుజ్జగించేరు.అందువల్ల రంగనాథం కోపంతోనే బసవరాజు అండ్ కంపెనీలో అడుగు పెట్టవలసి వచ్చింది.ఆఫీసు చాలా బిజిగా వుంది. ఆ ఆఫీసులోకి దూసుకువస్తున్న రంగనాథానికి పాణి అడ్డం పడ్డాడు.

“క్షమించాలి.మీకెవరు కావాలి ?”అని వినయంగా అడిగేడు.

అసలే కోపం మీదున్న రంగానాథానికి మరింత కోపం వచ్చింది.

“నాకెవరు కావాలో,నేనెందుకు వచ్చేనో తెలీయకుండానే...క్షమించమని ఎందుకన్నావ్ ?”అని పాణి ప్రశ్నించేడు.

“అది ఇక్కడి పద్దతి "అన్నాడు పాణి.

“ఇల్లాంటి మురికి పద్దతులు నాకు నచ్చావ్ "అన్నాడు రంగనాథం.

పాణి రాజీకొచ్చేడు.

“పోనీ ఇప్పుడు చెప్పండి.మీకెవరు కావాలి ?”

“బసివిగాడు " ఆ పేరు వినగానే పాణి బిత్తరపోయేడు.

“బసివిగాడు!హు ఈజ్ దట్ బ్లడీ బసివిగాడు ?”అని అడిగేడు పాణి.

“చంపుతా !”అన్నాడు రంగనాథం.

“ఎవర్ని ?”ఖంగారు పడుతూ అడిగాడు పాణి.

“నిన్ను!”

“ఎందుకు ?”

“మీ ప్రొప్రయిటర్ని పట్టుకుని, బ్లడీ బసివిగాడంటావా ?”

“క్షమించాలి!నా మొదడు చెడిపోయింది !”

“తెలుస్తూనే వుంది.తప్పుకో ?”

“క్షమించాలి!పనేమిటో చెప్పాలి.వారితో మీ పనేమిటో "అన్నాడు పాణి.

“పనేమిటి వంకాయ్.వాడు నాకు బెస్ట్ ఫ్రండు !”అన్నాడు రంగనాథం.

అప్పుడు ఆ మాటగానే, పాణి స్వగతంలో పడ్డాడు.

(ఇంకావుంది)

హాసం సౌజన్యంతో