అమ్మో అమ్మాయిలు 1

Listen Audio File :

“ఇల్లు అద్దెకివ్వబడును రోయ్!” అంటూ వ్యాకర్ణ గట్టిగా అరిచాడు.

“నిజమే! 'టూలెట్' అని బోర్డు కూడా తగిలించాను" భూతద్దాల కళ్లజోడులోంచి చూస్తూ తల తాటించి మరీ ఒప్పుకున్నాడు అబ్బులు.

“ఆలస్యం అరటిపండు విషం" అన్నారు పెద్దలు. లోపలి కెళదాం పరదా!

"వ్యాకర్ణ ఓ అడుగు ముందుకేసి అన్నాడు. “ఒరేయ్! అమృతం విషమంటారురా" అంటూ తప్పుదిద్దాడు అబ్బులు.

“చూడు నాయనా, అబ్బునాధం! నీవిక్కడ ఏది విషమో పరిశోధన చేస్తూ కూర్చుంటే అరటిపండు అమృతమూ- ఆఖరికి అద్దె యిల్లు కూడా విషమే అవుతాయి తొందరగా లోపలికి తగలడదాము పద" అంటూ విసుక్కున్నాడు వ్యాకర్ణ.

పద అంటే పద అని, నీవు ముందంటే నీవు ముందని వ్యాకర్ణ, అబ్బులు దైర్యంచేసి "టులెట్ బోర్డు" వున్న ఇంటి తలుపు తట్టారు. తలుపు తట్టేముందు కళ్ళజోడు సవరించుకుని జేబులో వున్న చిన్న దువ్వెనతో క్రాపు దువ్వుకున్నాడు అబ్బులు. ఓసారి కాలరు సవరించుకుని జేబులో చెయ్యి దూర్చుకుని నిటారుగా నిలబడ్డాడు వ్యాకర్ణ. అబ్బులు, వ్యాకర్ణ, ప్రాణమిత్రులు.

వాళ్ళు ప్రస్తుతం వున్న రూమ్ వెంటనే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వారం రోజులుబట్టి రాత్రింబవళ్ళు విసుగులేకుండా తిరిగిన వాళ్ళు తిరిగినట్లే వున్నారు, ఖాళీ రూమ్ కోసం. అది ఎండాకాలం. తిరిగి తిరిగి ప్రాణం పోతున్నది గాని ఖాళీ రూమ్ మాత్రం కనపడలేదు. ఈ ఇంటికున్న 'టూలెట్' బోర్డు చూడగానే ప్రాణం లేచొచ్చింది మిత్రులకిద్దరకు.

ఎందుకయినా మంచిదని మద్దెల మోగించినట్లు గాకవిన మిటినట్లు తలుపు తటాడు. ఆ ఇంట్లో వారివి పాముచెవులేమో, విళ్ళిలా తలుపు తట్టడం ఏమిటి అలా తలుపు తీయటం ఏమిటి ఏకకాలంలో జరిగాయి. ఇరువురు కూడపలుక్కున్నట్లు టక్కున "నమస్తే చెప్పారు. ఆ ఇంట్లోంచి వచ్చిన వ్యక్తి వీళ్ళ నమస్కారానికి తబ్బిబ్బయి రెండు గుటకలు మింగి ఆనందాశ్చర్యాలతో

"నాకేనా, మీరు నమస్కారం పెట్టింది!” అన్నాడు. ఓపక్క ముఖ నమస్కారం పెడుతుంటే 'నాకేనా? అనే ఈ యింటాయన మనస్తత్వం ఏమిటా అని మిత్రులిరువులు కూడా ఆనందాశ్చర్యాలు పడి

"నమస్కారం మీకేనండి బాబూ!” అన్నారు మరో నమస్కారం పారేసి. వచ్చిన యింటాయన పూచిక పుల్లలా వున్నాడు గాని కంచు కంఠంతో 'ఏమేవ్ ఓ సారిలా రా" అంటూ లోపలికి తొంగిచూసి కేకవేశాడు. లోపలినుంచి జవాబు లేదు. మరోసారి కేకేశాడు. జవాబు లేదుగాని, గాజుల శబ్దం అయింది. ఆపై సుడిగాలిలా యింటిగలాండ బైటికి దూసుకొచ్చింది.

వస్తూనే "ఏమొచ్చిందీ, ఏమిటా గావుకేకలు? నెమ్మదిగా పిలవలేరూ!” అంటూ గదమాయించింది.

“వీళ్ళు నాకు నమస్కారం పెట్టారేవ్!” అన్నాడు ఆయన నెమ్మదిగా.

“మీ ముఖానికి నమస్కారం పెట్టాల్సిందే ఏం చూసి ఎందుకు?” అంటూ గయ్యిమంది ఆవిడ.

ముఖముఖాలు చూసుకున్నారు మిత్రులు బెదురుతూ. “కావాలంటే వీళ్ళనడుగు. నా మాట ఏనాడూ నమ్మావు గాబట్టి యీనాడు నమ్మటానికి" అంటూ ఆయన వెళ్ళిపోయాడు.