శుభసందర్భం
రమణ ఆరోజు ఆఫీసుకొస్తూనే తమ సెక్షన్ మొత్తాన్ని పూలగుత్తులతో అలంకరించి కేక్ తెచ్చి టేబుల్ మీద వుంచి బాస్ దగ్గరికెళ్ళి
“సార్ ! ప్లీజ్, కొంచెం కేక్ కట్ చేస్తారా?” అన్నాడు.
“ఏమిటి విశేషం?” అడిగాడు ఆఫీసర్.
“తమరు జీతం పెంచి పదేళ్లయిన శుభసందర్భంలో పార్టీ ఇస్తునాను!”