TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ చేస్తున్నాడు.
విలేఖరి: మీ మేకలకు మీరు ఏం పెడతారు..?
రైతు : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు..
రై : గడ్డి..
వి : మరి తెల్లమేకకు..?
రై : గడ్డి..
వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు..?
రై : నల్లమేకనా.., తెల్లమేకనా..?
వి : నల్లమేకను..
రై : బయటి వసారాలో..!!
వి : మరి తెల్లమేకను..?
రై : దాన్ని కూడా బయటి వసారాలో..!!
వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు..?
రై : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు..
రై : నీటితో..
వి : మరి తెల్లమేకకు..?
రై : దానికి కూడా నీటితో..!!
వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా.., తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..?
రై : ఎందుకంటే నల్లమేక నాది.
వి: మరి తెల్లమేక..?
రై : అదికూడా నాదే..!!
విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.
రైతు నవ్వుతూ అన్నాడు..
ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా ప్రేక్షకులకి ఎలా వుంటుందో..?
సౌజన్యం: Ranga Rao Peyyeti గారు...
|