
హీరో సునీల్ ఇంటర్వ్యూ
సినిమాల మీద ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చాడు. కష్టపడి కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించాడు. తర్వాత హీరోగా మారి వరసగా సినిమాల్లో నటిస్తూ తన తడాఖా చూపించాడు. మధ్యలో మంచి కథ కోసం రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు కృష్ణాష్టమి సినిమాతో శుక్రవారం ప్రజల ముందుకు వస్తున్నాడు హీరో సునీల్ వర్మ. ఈ సందర్భంగా, తెలుగువన్ తో సునీల్ ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకున్న విషయాలు, విశేషాలు మీకోసం... " రొమాన్స్ సీన్స్ నాకు అనుకూలంగా మార్చుకున్నా..! " సినిమాలో నా పాత్ర ఒక ఎన్నారై. ఇండియా అంటే ప్రాణం. అందుకే ఇక్కడే ఉండిపోవడానికి వస్తాడు. ఓపిక చాలా ఎక్కువ. కానీ కొట్టాల్సి వస్తే మాత్రం ఎవరూ కొట్టనంత బలంగా కొడతాడు. ఈ సినిమాలో నేను రొమాన్స్ చేశానా అని అడుగుతున్నారు అందరూ. వాసువర్మ( డైరెక్టర్) ఈ పాత్రను అలాగే డిజైన్ చేశాడు. కథ ప్రకారం కొన్ని సీన్లు తప్పకపోయినా, నేను జాగ్రత్తగా ఆ సీన్లు నాకు అనుకూలంగా మార్చేసుకున్నానులెండి (నవ్వుతూ). " నా సినిమాల్లో ది బెస్ట్.. " కృష్ణాష్టమిలో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్ మెంట్ లో మీకు క్వాలిటీ కనిపిస్తుంది. నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో మర్యాద రామన్న అంత క్వాలిటీగా ఉన్న సినిమా కృష్ణాష్టమి. ఏదైనా పెద్ద హీరో సినిమాను ఊహించుకుని, ఆ హీరో ప్లేస్ లో నేనుంటే ఎలా ఉంటుందో, ఈ సినిమా అలా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ కంప్లీట్ హ్యాపీగా ఉన్నాం. " కష్టమే సుఖం, సుఖమే కష్టం " నాకు ఒక ఫిలాసఫీ ఉంది. కష్టమే సుఖం, సుఖమే కష్టం. ఎగ్జాంపుల్ కి, ఒకడు బాగా సుఖపడుతున్నాడనుకోండి. మంచిగా ఏసీ, టైం కి ఫుడ్డు లాగిస్తా సుఖంగా పడుకుని ఉంటే, కొన్నాళ్లకు చెకప్ లో బీపీలు, షుగర్లు వస్తాయి. అదే రోజంతా చెమడోచ్చి ఒళ్లు నెప్పులతో పడుకునే వాడికి, అప్పటికి అది కష్టమే అయినా, లాంగ్ లైఫ్ లో చిన్న జలుబు కూడా చేయదు. ఇదే నేను కూడా నమ్ముతాను. నేను కష్టపడి పైకొచ్చాను అంటారు గానీ, నాకు ఆ కష్టం చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు కూడా సిక్స్ ప్యాక్ నెపంతో, జిమ్ చేస్తూ కష్టపడుతున్నాను. " సిక్స్ ప్యాక్ ఎవరైనా చేసేయచ్చు " అందరూ సిక్స్ ప్యాక్ కష్టమా అని అడుగుతున్నారు. సిక్స్ ప్యాక్ చాలా ఈజీ. నేను చెప్తుంటే ఎవరికీ అర్ధం కావట్లేదండీ బాబూ. నేనే సిక్స్ ప్యాక్ చేశానంటే, ఎవరైనా సిక్స్ ప్యాక్ ట్రై చేసెయచ్చు (నవ్వుతూ). నా దృష్టిలో నవ్వించడం కంటే, సిక్స్ ప్యాక్ చేయడమే ఈజీ. సిక్స్ ప్యాక్ కావాలంటే రోజూ జిమ్ కెళ్లి ఒకే రకమైన ఎక్సర్ సైజులు చెయ్యాలి. కానీ నవ్వించాలంటే మాత్రం, ఒక్కోరోజు ఒక్కోలా ఉండాలి. రెగ్యులర్ గా ఒకేలా ఉన్నా బోర్ కొట్టేస్తాం. ఒక్కో ఇంటర్వ్యూ ఒక్కోలా ఉన్నట్టే, సినిమాల్లో కామెడీ విభిన్నంగా ఉంటేనే ప్రేక్షకులు నవ్వుతున్నారు. " హీరో అయ్యాక ఇంటరాగేషన్లే ఎక్కువగా ఉంటున్నాయి " ఇంటర్వ్యూల్లో నేను జనాన్ని ఇన్ స్పైర్ చేసేవి చెప్పాలనుకుంటా. కానీ నాకు ఆ అవకాశమే రావట్లేదు. కమెడియన్ గా ఉన్నప్పుడు నాకు ఇంటర్వ్యూలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పడు మాత్రం ఇంటరాగేషన్లు ఎక్కువైపోయాయండీ బాబూ(నవ్వుతూ)..తప్పు చేసినోడ్ని అడిగినట్టు అడుగుతున్నారు అందరూ..హీరో మీద ఉండే ఫోకస్ వల్ల కూడా అలా అడుగుతుంటారు. హీరో అయ్యాక ఏం చేసినా దాన్ని అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. "త్రివిక్రమ్ మాట విని బాగుపడ్డాను " జీవితం అనేది అనుభవాల సారం. తండ్రి ముప్ఫై ఏళ్ల పాటు తను పడిన కష్టాన్ని, అనుభవాన్ని కొడుక్కి చెబితే, కొడుకు జీవితం ఆ ముప్ఫై ఏళ్లను కలుపుకుని మొదలవుతుంది. తన అనుభవాన్ని నాకు అలాగే అందించాడు త్రివిక్రమ్. తన మాట వినే నేను బాగుపడ్డాను. కోట్లకు కోట్ల విలువైన కాన్ఫిడెన్స్ ను అందించిన త్రివిక్రమే నాకు గైడ్. తన లాంటి ఫ్రెండ్ ఉంటే ఎవరికైనా సరే సక్సెస్ గ్యారంటీ. " నమ్మకాన్ని నిలబెట్టేలా ' కృష్ణాష్టమి ' ఉంటుంది " మీరు హాల్ కు నన్ను నమ్మి వస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా కృష్ణాష్టమి ఉంటుంది. హాల్ కు వచ్చినందుకు డిజప్పాయింట్ అవరు. నా మీద నమ్మకంతో వచ్చి సినిమా చూడండి.
Feb 17, 2016
RGV ఇక ఆపేయమ్మ చూళ్ళేకపోతున్నాం
No Description
Nov 24, 2014
ప్రిన్స్ మహేష్ బాబు ఇంటర్వ్యూ
ఒక్కడు చిత్రం నుంచి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని, పోకిరితో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగి, ఇటీవల। దూకుడు, బిజినెస్ మ్యాన్ చిత్రాలతో తనకు తానే సాటి, తనకు తానే పోటీ అని నిరూపించుకున్న ప్రిన్స్ మహేష్ బాబుతో తెలుగువన్ ప్రత్యేకంగా జరిపిన ఇంటర్ వ్యూ మీకోసం....! తెలుగువన్ - మహేష్ గారూ వరసగా మీ రెండు చిత్రాలు "దూకుడు", "బిజినెస్ మ్యాన్" బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. ఈ ఆనందాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు...? మహేష్ బాబు - వెరి వెరి హ్యాపీ అండి...! నా సినిమాలకు అంత విజయం అందించిన ప్రేక్షకులకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. తెలుగువన్ - "దూకుడు" ఒక స్టైల్ పాత్రయితే "బిజినెస్ మ్యాన్" మరో స్టైల్ పాత్ర...బిజినెస్ మ్యాన్ లో మొత్తం మీరే కనపడతారు...! అందులోనూ పూరీ జగన్నాథ్ ఈ కథ చెప్పినప్పుడు "పోకిరి" కాంబినేషన్ తీసే కథలాగా మీకనిపించిందా...? మహేష్ బాబు- "ఖలేజా", "దూకుడు" చిత్రాలకు ముందు నా మీద మహేష్ కామెడీ బాగా చెయ్యలేడనే ఓ చిన్న అపవాదుండేది. ఆ సినిమాలతో అది పోయింది. తర్వాత వచ్చిన "బిజినెస్ మ్యాన్" సినిమాలో మొత్తం నేనే కనపడతాను. సినిమాలో 80 సీన్లుంటే 75 సీన్లలో నేనుంటాను. అందరికంటే నేనే ఈ సినిమాలో ఎక్కువ మాట్లాడతాను. ఒక సింగిల్ థ్రెడ్ లాగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. అసలు పూరీ గారు నాకీ కథ చెప్పినప్పుడే నా పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథ వినగానే పూరీ గారు, నేను ఏం ఫీలయ్యామో అది నిజమని ఈ రోజు ప్రేక్షకులు నిరూపించారు. తెలుగువన్ - "బిజినెస్ మ్యాన్" చిత్రంలో బూతులు ఎక్కువగా ఉన్నాయని ఒక అపవాదుంది. దానికి మీరేమంటారు...? మహేష్ బాబు - ఇప్పుడు టీ కొట్టేవాడు మాట్లాడే భాష ఒక స్టైల్లో ఉంటుంది. అలాగే మాఫియా డాన్ అవ్వాలనుకునే వాడి భాష అలాగే ఉంటుంది. వాడు సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడితే జనానికి నచ్చదు. మాఫియా డాన్ ఎలా మాట్లాడతాడో "బిజినెస్ మ్యాన్" చిత్రంలో నా పాత్ర అలాగే మాట్లాడుతుంది. సినిమాలో బూతులున్నాయా, భాష ఎలాగుంది అన్న విషయాలు పూరీ గారికొదిలేశాను. ఆయన్ని పూర్తిగా నమ్మాను. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. వెరి వెరి థ్యాంక్స్ టు పూరీ గారు. తెలుగువన్ - మీరు ఇంతమంది హీరోయిన్లతో నటించారు కదా...! ఎవరూ మీకు ఐ లవ్ యూ చెప్పలేదా...? మహేష్ బాబు - నాకు పెళ్ళయిందండీ...నాకెలా చెపుతారు ఐ లవ్ యూ...? తెలుగువన్ -మీ రికార్డులు మీరే అధిగమిస్తున్నారు...మీకు మీరే పోటీగా నిలుస్తున్నారు...! ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో నంబర్ వన్ స్థానం మీదేనని భావిస్తున్నారా...? మహేష్ బాబు - నాకు నంబర్ల మీద నమ్మకం లేదండి. మన పని మనం సిన్సియర్ గా చేసుకుంటూ పోవటమే నాకు తెలిసింది. తెలుగువన్ - ఈ మధ్య మీ అభిమానులకు మరో యువ హీరో అభిమానులకూ మధ్య రికార్డుల గురించి గొడవ జరిగింది...దీని మీద మీ స్పందన ఏమిటి...? మహేష్ బాబు - ఫ్యాన్స్ ఈ రికార్డుల విషయంలో బాగా ఎగ్జయిటవుతారు...అలాగే పర్సనల్ గా కూడా తీసుకుంటారు... అది ఉండాలి...! లేకపోతే ఎప్పటి రికార్డులో ఇంకా అలా ఉండిపోతే ఎలా...? కొత్తదనం రావాలి...కొత్త కొత్త రికార్డులు క్రియేట్ అవ్వాలి...అప్పుడే సినీ పరిశ్రమ కళకళలాడుతూ ఉంటుంది...! తెలుగువన్ - మీకు మీ నాన్నగారు తర్వాత సీనియర్ యన్ టి ఆర్ అభిమాన హీరో అని చెప్పారు....ఆయన సినిమాలేమేం చూశారు...? మహేష్ బాబు - ఆయన సినిమాలు చూస్తూనే కదండీ మనమంతా పెరిగింది. ఆయన నటించిన "పాతాళ భైరవి" ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. తెలుగువన్ - మీ నాన్నగారు నటించిన "అల్లూరి సీతారామరాజు" సినిమా కానీ, లేదా మీకు నచ్చిన ఆయన సినిమాలేమైనా రీమేక్ చేసే ఆలోచన ఏమైనా ఉందా...? మహేష్ బాబు - నాన్నగారు నటించిన సినిమాలు రీమేక్ చేసే ఆలోచనలేమీ లేవండీ...! "అల్లూరి సీతారామరాజు" ఒక క్లాసిక్. దాన్ని నేను చేయలేను. అనవసరంగా వాటిని పాడు చేయటం నాకిష్టం లేదు...! తెలుగువన్ - మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఏందా...? మహేష్ బాబు - అలాంటిదేం లేదండీ...అసలు ఏదీ నేను ప్లాన్ చేసుకోను...! వచ్చిన సినిమాల్లో నచ్చినవి చేయటం తప్ప...ఫలానా పాత్రలో నటించాలని ప్లాన్ చేసుకోవటంలాంటివేం లేవు. తెలుగువన్ - ప్రస్తుతం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో వెంకటేష్ గారితో నటిస్తున్నారు...భవిష్యత్తులో ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాల్లో ఇంకా నటించే అవకాశం ఉందా...? మహేష్ బాబు - తప్పకుండా స్క్రిప్ట్ నచ్చి, నా పాత్ర నచ్చితే తప్పకుండా మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తాను...! తెలుగువన్ - మీరు పనిచేయాలనుకుంటున్న దర్శకులెవరైనా ఉన్నారా...? మహేష్ బాబు -మణిరత్నం, శంకర్ వంటి దర్శకులతో చేయాలనుంది. శంకర్ గారితో "3 ఇడియట్స్", మణిరత్నం గారితో ఒక హిస్టారికల్ మూవీ చేయాల్సింది. అనుకోకుండా అవి మిస్సయ్యాయి. భవిష్యత్తులో వాళ్ళతో సినిమాలు చేస్తాను. తెలుగువన్ - గౌతమ్ ని బాలనటుడిగా పరిచయం చేసే ఉద్దేశ్యం ఉందా...? మహేష్ బాబు - హి ఈజ్ జస్ట్ ఎ కిడ్ అండీ...వాణ్ణి చదుకోనివ్వండి...ఆ తర్వాత వాడికేమవ్వాలనిపిస్తే అదవుతాడు...వాణ్ణి ఫోర్స్ చేసి నటుణ్ణి చేయటం నాకిష్టం లేదు...! తెలుగువన్ - ఇంతసేపూ మీ విలువైన సమయాన్ని మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం కేటాయించి, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు. మహేష్ బాబు - మీ క్కూడా థ్యాంక్సండీ...! మీ ద్వారా ప్రవాసాంధ్రులందర్నీ ఇలా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది.
Feb 04, 2012
వై.వి.యస్.చౌదరి ఇంటర్వ్యూ
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు వై.వి.యస్.చౌదరి. ప్రస్తుతం తన సొంత బ్యానర్లో వేరే దర్శకులతో సినిమాలను నిర్మించటం ప్రారంభించి, తొలి ప్రయత్నంగా మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, గుణశేఖర్ దర్శకత్వంలో, "నిప్పు" అనే విభిన్న కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు వై.వి.యస్.చౌదరి. అటువంటి వై.వి.యస్.చౌదరి.తో "నిప్పు" సినిమా గురించి తెలుగువన్ డాట్ కామ్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్ వ్యూ మీ కోసం....! తెలుగువన్ డాట్ కామ్ - నమస్కారం వై.వి.యస్.చౌదరి గారూ వై.వి.యస్.చౌదరి - నమస్తే సోదరా...రండి రండి...! తెలుగువన్ డాట్ కామ్ - మీరు నిర్మిస్తున్న "నిప్పు" సినిమా గురించి మా తెలుగువన్ ప్రేక్షకులకు తెలియజేస్తారా...! వై.వి.యస్.చౌదరి - తప్పకుండా భయ్యా...అడగండి ఏం చెప్పమంటారు...? తెలుగువన్ డాట్ కామ్ - మీరు స్వయంగా దర్శకుడై ఉండి, గుణశేఖర్ గారి దర్శకత్వంలో "నిప్పు" సినిమా తీయటానికి గల కారణాలేంటి...? వై.వి.యస్.చౌదరి - మద్రాసులో నటి అనూరాధ గారింట్లో నేను రవితేజ పై రూమ్ లో ఉండేవారం క్రింద గదిలో గుణశేఖర్ గారుండేవారు. ఆయన ఎప్పుడూ వ్రాసుకుంటూ ఉండేవారు. ఆయన కథలు దినపత్రికల్లో, వారపత్రికల్లో పడుతుండేవి. అప్పటి నుండీ ఆయన నాకు మంచి మిత్రుడు. పైగా ఆయన ఒక ప్రూవ్డ్ టెక్నీషియన్. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా, రవితేజ హీరోగా, నేను దర్శక, నిర్మాతగా ముగ్గురం సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాం. నాకీ మధ్య వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ "నిప్పు" సినిమా తీయటానికి కారణం. నాకు రాని ఆలోచనలు వేరే దర్శకులకు రావచ్చు కదా..! అలా నాకు సత్సంబంధాలున్న దర్శకులకు ఏదైనా ఒక విభిన్నమైన ఆలోచన కథగా తోస్తే వారితో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా గుణశేఖర్ గారిని అప్రోచయ్యాను. ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అదే ఈ "నిప్పు" సినిమాగా రూపొందింది. ఇక హీరోగా రవితేజ ఆ కథకి సరిగ్గా సరిపోతాడని ఆయన్ని తీసుకున్నాం. తెలుగువన్ డాట్ కామ్ - ఏ నిర్మాతైనా లైమ్ లైట్ లో ఉన్న దర్శకుడితో సినిమాలు తీస్తారు. అలా చూస్తే గుణశేఖర్ గత చిత్రాలు సైనికుడు, అర్జున్, వరుడు సరిగ్గా ఆడలేదు...మరి గుణశేఖర్ తో సినిమా ఎందుకు చేస్తున్నారు. వై.వి.యస్.చౌదరి - భయ్యా ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అందరికీ హిట్లుంటాయి...అలాగే ఫ్లాపులూ ఉంటాయి...! ఏవో కొన్ని సినిమాలు ఫ్లాపయినంత మాత్రాన అతని డైరెక్టోరియల్ ఎబిలిటీస్ ని అనుమానించటం సరికాదు. అలా అనుకుంటే అతని దర్శకత్వంలో వచ్చిన సొగసు చూడతరమా, బాలరామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. వాటి గురించి కూడా ఆలోచించాలి కదా...! తెలుగువన్ డాట్ కామ్ - సినిమాకి అవసరమున్నా లేకున్నా భారీ సెట్లు వేయిస్తాడన్న అపప్రథ గుణశేఖర్ మీద ఉంది....మరి మీ "నిప్పు"సినిమాలో కూడా భారీ సెట్లు వేయించాడా గుణశేఖర్...? వై.వి.యస్.చౌదరి - ఇదన్యాయం సోదరా....! కథ డిమాండ్ చేస్తేనే ఏ దర్శకుడైనా సెట్ కావాలనేది...అంతే కానీ అవసరమున్నా లేకున్నా ఎందుకు భారీ సెట్లు వేయించటం....? ఈ "నిప్పు" సినిమాలో అలాంటి భారీ సెట్లేం లేవు. కథకు వాటి అవసరం లేదు. తెలుగువన్ డాట్ కామ్ - "నిప్పు" సినిమా హైలైట్స్ ఏమిటి...? వై.వి.యస్.చౌదరి - మా "నిప్పు" సినిమాకి చాలా హైలైట్స్ ఉన్నాయి భయ్యా...! హీరో రవితేజ ఒకటయితే, గుణశేఖర్ దర్శకత్వం, నేను నిర్మాత కావటం, తమన్ సాయి సంగీతం, నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు ఒక ప్రత్యేక పాత్రలో నటించటం, అలాగే శ్రీరామ్, భావన కూడా ప్రత్యేక పాత్రల్లో నటించటం, ముఖ్యంగా కథ, కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. తెలుగువన్ డాట్ కామ్ - "నిప్పు" సినిమా సంక్రాంతికి రిలీజన్నారు. మళ్ళీ ఫిబ్రవరి 2 వ తేదీ అన్నారు.ఇప్పుడు ఫిబ్రవరి 17 వ తేదీ అంటున్నారు. ఇన్నిసార్లు సినిమా వాయిదా పడటానికి గల కారణాలేంటి...? వై.వి.యస్.చౌదరి - ఇక్కడ నేను, గుణశేఖర్ ఇద్దరం కూడా పక్కా పర్ ఫెక్షనిస్టులం. ముందుగా అనుకున్న సమయానికి తీసిన సినిమాకు అవసరమైన టెక్నికల్ హంగులు, అనుకున్న సమయానికి పూర్తిగా అందించలేకపోయాం. తర్వాత "జై తెలంగాణా" సినిమా విడుదలకు థియేటర్లు దొరకటం లేదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో వారంటూంటే దాని గురించి మళ్ళీ వాయిదా వేశాం. మనం ఎవరి వల్లా ఇబ్బంది పడకూడదు. అలాగే మనవల్ల కూడా ఎవరూ ఇబ్బంది పడకూడదు అనుకోవటం వల్లే ఈ జాప్యం జరిగింది. తెలుగువన్ డాట్ కామ్ - ఈ "నిప్పు" సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉండబోతోంది...? వై.వి.యస్.చౌదరి - చాలా విభిన్నంగా ఉండబోతోంది. రవితేజ స్టైల్లో ఉంటూనే ఆ పాత్రకు ఒక బాధ్యత కూడా ఈ సినిమాలో ఉంటుంది. తెలుగువన్ డాట్ కామ్ - ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఎలా ఉండబోతున్నాయి...? ఎన్ని ఉంటాయి...? వై.వి.యస్.చౌదరి - కణల్ కణ్ణన్ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఆరు యాక్షన్ సీన్లు షూట్ చేశారు గుణశేఖర్. ప్రేక్షకులు, రవితేజ అభిమానులు వాటిని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. తెలుగువన్ డాట్ కామ్ - మీకు, దర్శకుడు గుణశేఖర్ కీ, గొడవ జరగటం వల్ల హీరో రవితేజ మీ ఇద్దరికీ వార్నింగేదో ఉచ్చాడని ఒక టాక్ ఉంది...మీరేమంటారు...? వై.వి.యస్.చౌదరి - (నవ్వు) భయ్యా మా మధ్య గొడవలు జరిగాయి...ఎవరికీ....పనీ పాటా లేకుండా ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేస్తుంటారే వాళ్ళ ఊహల్లో...! అంతేకానీ నిజానికి ఏ గొడవా జరగలేదు సరికదా...చాలా హ్యాపీగా ఈ సినిమా చేయటం జరిగింది. తెలుగువన్ డాట్ కామ్ - చాలా సంతోషం చౌదరిగారూ...మీ విలువైన సమయాన్ని మా తెలుగువన్ డాట్ కామ్ ప్రేక్షకుల కోసం కేటాయించి, మీ "నిప్పు" సినిమా గురించి ఇన్ని విషయాలు తెలిపిన మీకు మా ధన్యవాదాలు...అలాగే మీ "నిప్పు"చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. వై.వి.యస్.చౌదరి - మీక్కూడా థ్యాంక్యూ భయ్యా...! థ్యాంక్యూ వేరీ మచ్...!
Feb 01, 2012
హీరో సుధీర్ బాబుతో తెలుగువన్ డాట్ కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ.
సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నమ్మాయి పద్మిని ప్రియదర్శిని భర్త, ప్రిన్స్ మహేష్ బాబుకి బావ అయిన "యస్.యమ్.యస్." శివ మనసులో శృతి చిత్రం హీరో సుధీర్ బాబుతో తెలుగువన్ డాట్ కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ. తెలుగువన్ డాట్ కామ్ - సుధీర్ గారు హీరోగా మీ తొలి చిత్రం "యస్.యమ్.యస్." శివ మనసులో శృతి విడుదలకు సిద్ధమవుతోంది. అందుకు గాను ముందుగా మీకు కంగ్రాట్స్. సుధీర్ బాబు - థ్యాంక్స్ అండీ...! తెలుగువన్ డాట్ కామ్ - మీరు సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నల్లుడుగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారా...? లేక మీ వ్యక్తిగత ఇమేజ్ తోనే సినీ రంగ ప్రవేశం జరిగిందా...? మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది...? సుధీర్ బాబు - మాది విజయవాడండీ...! అక్కడ రోడ్ల మీద జనం కన్నా ఎక్కువగా సినిమా పోస్టర్లే మీకు కనపడతాయ్. మా ఊర్లో ఏ ఇంజినీరింగో లేక మెడిసనో చదువుని ఉద్యోగం చేసుకునే వాడికి మర్యాద, గౌరవం ఉంటాయి. లేకపోతే వీడేదో తేడాగాడంటారు. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. సినీ రంగం మీద మక్కువ ఎక్కువ. అందుకని ఇంజినీరింగ్ పూర్తి చేసి, యమ్.బి.ఎ. అలాగే జి.యమ్.టి. కూడా పూర్తిచేశాక మాత్రమే సినీ రంగంలోకి వచ్చాను. ఇక మామయ్యగారి ఇమేజ్ కానీ, బావ మహేష్ బాబు ఇమేజ్ కానీ నాకు ప్రమోషన్ కి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ నాలో ప్రతిభ లేకపోతే ఈ రంగంలో నిలదొక్కుకోవటం అసాధ్యం. నన్ను నేను నమ్ముకునే ఈ రంగంలోకి వచ్చాను. తెలుగువన్ డాట్ కామ్ - "యస్.యమ్.యస్." శివ మనసులో శృతి చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఎలా వచ్చింది....? సుధీర్ బాబు - దర్శకుడు తాతినేని సత్య నాకు మంచి స్నేహితుడు. అలాగని నాన్ను ఏమీ పరీక్షించకుండానే నాకీ అవకాశమివ్వలేదు. ఒక ఆరు నెలల పాటు నటనలో, డ్యాన్సుల్లో, జిమ్నాస్టిక్స్ లో నాకు పూర్తి స్థాయిలో శిక్షణనిచ్చి ఆయన నా పెర్ ఫార్మెన్స్ చూసి సంతృప్తి చెందాకనే నాకీ అవకాశమిచ్చారు. ఇంకోవిషయం ఆయన నాకు కథ చెప్పినదానికంటే సినిమా బాగా తీశారు. ఎందుకంటే ఆయన వెరీ బ్యాడ్ నెరేటర్. తెలుగువన్ డాట్ కామ్ - ఆరునెలల శిక్షణకే మీరు మోకాళ్ళతో మూన్ వాక్, సమ్మర్ సాల్ట్ ల వంటి ప్రక్రియలన్నీ చాలా అలవోకగా ఎలా చేయగలిగారు....? సుధీర్ బాబు - ఇదే మాట మా బావ మహేష్ బాబు కూడా పదే పదే అడిగారండీ...! ఆయనకి నా పెర్ ఫార్మెన్స్ చూసి చాలా ఆశ్చర్యమేసింది. కానీ ఇది నిజం. తెలుగువన్ డాట్ కామ్ - సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీలో ఇప్పటికే మహేష్ బాబు ఉన్నారు. మళ్ళీ మీరు వస్తున్నారు. మహేష్ బాబు మీకు సపోర్టనుకుంటున్నారా...? సుధీర్ బాబు - మహేష్ ఇమేజ్ నాకు సపోర్ట్ ఇవ్వటం కన్నా డిజడ్వాంటేజ్ అవుతుందండీ....! ఎలాగంటే జనం నన్ను ఆయనతో పోల్చే ప్రమాదముంది. అది నాకు చాలా ఇబ్బందికరమైన విషయం. కాకపోతే మహేష్ బాబు బావగా నాకు అద్భుతమైన ప్రమోషన్ లభిస్తుంది అంతే. తెలుగువన్ డాట్ కామ్ - ఈ చిత్రంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతోంది....? సుధీర్ బాబు - కొరియర్ బోయ్ గా నేనీ చిత్రంలో నటించానండీ...! తెలుగువన్ డాట్ కామ్ - హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది....? సుధీర్ బాబు - అది సస్పెన్స్. కాకపోతే మా ఇద్దరి మధ్య గొడవలు మీకు టామ్ అండ్ జెర్రీలాగుంటాయి. మా ఇద్దరి మధ్య సీన్లన్నీ కూడా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో నిండి ఉంటాయి. తెలుగువన్ డాట్ కామ్ - ఈ చిత్రంలో మీ నటన గురించి మీరు తృప్తిగా ఉన్నారా...? సుధీర్ బాబు - కచ్చితంగా సంతృప్తిగా ఉన్నాను. తెలుగువన్ డాట్ కామ్ - ఈ తరం యువ హీరోల్లో చాలా బలమైన పోటీ నెలకొని ఉంది. దానికి మీరెలా తయారుగా ఉన్నారు....? సుధీర్ బాబు - నేనెవరికీ పోటీ కాదండీ...అలాగే నాకూ ఎవరూ పోటీ కాదండి. కాకపోతే నన్ను నేను అప్ డేట్ చేసుకుంటూ, నాలో లోపాలను సరిచేసుకుంటూ నటించటమే నేను చేయగలిగింది. ఇక ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకం పుష్కలంగా ఉంది. తెలుగువన్ డాట్ కామ్ - ఈ చిత్రం తర్వాత మీరు చేయబోయే సినిమా ఏది...? సుధీర్ బాబు - రెండు స్క్రిప్టులు రెడీగా ఉన్నాయండి...ఈ సినిమా రిలీజయ్యాక ఏ సినిమా చెయ్యాలో నిర్ణయిస్తాను....! తెలుగువన్ డాట్ కామ్ - ఆల్ ది బెస్ట్ సుధీర్ బాబు గారూ...మీ సినిమా సూపర్ హిట్టవ్వాలనీ, మీ కృషి ఫలించాలనీ, తెలుగువన్ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూంది...! సుధీర్ బాబు - థ్యాంక్యూ వెరీ మచ్ సర్...!
Jan 28, 2012
ఆర్. పి. పట్నాయక్ ఇంటర్వ్యూ
No Description
Feb 02, 2011.jpg)
రామ్ గోపాల వర్మ
విలక్షణ శైలితో సినిమాలు తీస్తూ,తన సినిమాలంటేనే ప్రేక్షకుల్లో ఒక విధమైన ఆసక్తిని కలిగించే విధంగా పబ్లిసిటీని చేసే వివాదాస్పద, సంచలన దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ గురించి అందరికీ తెలిసిందే.తన తొలి చిత్రం"శివ" నుంచీ నిన్నటి "రక్తచరిత్ర" వరకూ అన్నీ సినిమాలూ సంచలనమే.అవి హిట్టయినా ఫ్లాపయినా సరే ప్రేక్షకుల మధ్య చర్చగా మాట్లాడుకునే టాపిక్ ని ఇస్తాయి.అది అతను ఎన్నుకునే కథ కావచ్చు...ఆ సినిమా తీసే విధానం కావచ్చు...ఆ సినిమా కోసమ అతను ఎన్నుకునే ప్రచార శైలి కావచ్చు..అన్నీ ఆసక్తిని కలిగించే విధంగా ఉంటాయి.అతని దర్శకత్వంలో వచ్చిన ప్రతి చిత్రం ఆ విషయాన్ని రుజువు చేస్తుంది.ప్రపంచం ఏమనుకుంటుంది అనే స్థాయి నుంచి అతనేనాడో దాటిపోయాడు.తానేమనుకుంటున్నాడో అది చేయటమనే స్థితికి వర్మ చేరుకున్నాడు.తాను తీసిన సినిమాల ఫలితాల గురించి గానీ, డబ్బు గురించి గాని వర్మ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.ఒక కర్మ యోగిలా వర్మ తనపని తాను చేసుకుంటూపోతాడు.అతన్ని కొందరు అహంభావి అనుకుంటారు.కొందరు అతనికి బాగా పొగరనుకుమటారు.మరి కొందరు మేధావి అనుకుంటారు.ఇంకొందరు పిచ్చోడనుకుంటారు.ఎవరేమనుకున్నా తానేంటో స్పష్టత కలిగిన వ్యక్తి రామ్ గోపాల వర్మతో తెలుగువన్ ముఖా ముఖి మీకోసం. తెలుగువన్ - వర్మ గారూ మీగురించి మీరేమనుకుంటారు....? వర్మ - ఏమీ అనుకోటానికి ఏం చేశామనీ...ఏం సాధించామని అనుకోమంటారు....? తెలుగువన్ - మీకు పబ్లిసిటీ పిచ్చని కొందరు అనుకుంటూంటారు.దీనికి మీ సమాధానం...? వర్మ - అప్పుడే పుట్టిన బిడ్డ తనకు పాలు కావాలని ఏడుస్తూంది.ఎందుకని...? మౌనంగా ఉంటే తన ఆకలి అమ్మకు తెలియదని.పబ్లిసిటీ అనేది మనిషి జీవితంలో అప్పటి నుంచే మొదలవుతుంది.పసి పాపే తన ఆకలి తెలపటానికి పబ్లిసిటీ ఇస్తూంటే...కోట్లతో సినిమా వ్యాపారం చేసే నేను నా సినిమా కోసం ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోవటం తప్పేం కాదుగా......? తెలుగువన్ - మీరు అయిదు రోజుల్లో ఒక కమర్షియల్ సినిమా చేస్తానంటున్నారు...అది కూడా పైసా ఖర్చులేకుండా...? అదెలా సాధ్యం...? వర్మ - ఎందుకు సాధ్యం కాదు...? హ్యాపీగా చెయ్యొచ్చు.అంతా ప్లానింగ్ లో ఉంది. తెలుగువన్ - ఈ చిత్రం పేరేంటి...? వర్మ - "దొంగల ముఠా" ఎలా ఉంది...? తెలుగువన్ - ఈ చిత్రం గురించి చెప్పండి...? వర్మ - ఈ సినిమాలో రవితేజ హీరో, ఛార్మి హీరోయిన్, మంచు లక్ష్మీ ప్రసన్న ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం,బ్రహ్మాజీ, సుబ్బరాజు, అజయ్ తదితరులు నటిస్తారు. తెలుగువన్ - సాంకేతిక నిపుణులెవరెవరు పనిచేస్తారు...? వర్మ - చాలా తక్కువమంది పనిచేస్తారు. తెలుగువన్ - ఈ చిత్రానికి ఎటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు....? వర్మ - లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తాం. తెలుగువన్ - ఒక వేళ అది వికటిస్తే...! వర్మ - నేను "శివ" సినిమాకి స్టడీ కామ్ వాడినప్పుడు కూడా చాలా మందికి ఇలాంటి అనుమానాలెన్నో వచ్చాయి.భయపడితే ఏమీ చేయలేం. నేను అప్పుడూ కొత్తదనాన్ని అడాప్ట్ చేసుకున్నాను.ఇప్పుడూ కొత్త టెక్నాలజీని వాడుకుంటాను. తెలుగువన్ - ఈ చిత్రం కథ ఏమిటి...? వర్మ - మీరే చూస్తారుగా...తినబోతూ రుచెందుకు అడగటం...? తెలుగువన్ - ఈ సినిమాకి పెద్ద దర్శకులు పూరీ జగన్నాథ్, కృష్ణ వంశీ, వినాయక్, హరిష్ శంకర్ వంటి వారంతా సహాయకులుగా పనిచేస్తారని విన్నాం..నిజమేనా....? వర్మ - మీకు ఎవరు చెప్పారు...? తెలుగువన్ - అలాగని సినీ జనం అనుకుంటున్నారు... వర్మ - పనీ పాట లేని వాళ్ళు లక్షనుకుంటారు.అవన్నీ నమ్మేస్తారా....? తెలుగువన్ - పోనీ మీరు చెప్పండి...అది నిజమేనా...? వర్మ - చెప్పే సమయం వచ్చినప్పుడు...ఎలా చెప్పాలో...ఎవరు చెప్పాలో...ఎక్కడ చెప్పాలో అలా చెపుతారు.తొందరెందుకు తెలుగువన్ - సరే భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాల గురించి చెపుతారా...? వర్మ - దొంగల ముఠా తర్వాత బెజవాడ రౌడీలు, దాని తర్వాత డిపార్ట్ మెంట్, ఆ తర్వాత "అమ్మ" నా ఫ్యూచర్ ప్రోజెక్టులు. తెలుగువన్ - వర్మ "అమ్మ" అనే సెంటిమెంట్ సినిమా తీయటమా ...? వర్మ - "అమ్మ" అనగానే సెంటిమెంట్ సినిమా అని మీకు మీరే తీర్మానించుకుంటే అది నా తప్పా...? అసలు అది సెంటిమెంట్ సినిమా అని నేను చెప్పానా...? తెలుగువన్ - మరి "అమ్మ" అనగానే ఎవరికైనా అదే ఊహ వస్తుంది. వర్మ - కానీ ఈ "అమ్మ" మీరంతా అనుకునే అమ్మ కాదు."రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్"లాగా ఇదొక యాక్షన్ బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. తెలుగువన్ - చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.ఈ చిత్రం కథ గురించి చెపుతారా...? వర్మ - ఇటీజ్ టూ ఎర్లీ టు టాక్ ఎబౌట్ దిస్ టాపిక్.ఒ.కె.బై. తెలుగువన్ - ఒ.కె. థాంక్యూ అండ్ బై...
Feb 02, 2011
తెలుగువన్ కి శృతిహాసన్
సకలకళావల్లభుడు,పలుమార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎన్నికై,లోకనాయకుడిగా ప్రసిద్ధిచెందిన అద్భుతనటుడు పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ గారాల పట్టి అయిన శృతిహాసన్ కూడా తండ్రికి తగ్గ తనయ.శృతి హాసన్ హీరోయిన్ గా తన తొలి చిత్రాన్ని బాలీవుడ్ లో"లక్"చిత్రంతో ప్రారంభించింది.తన ద్వితీయ చిత్రాన్ని మాత్రం తెలుగులో సిద్ధార్థ హీరోగా,కోవెలమూడి సూర్యప్రకాష్ దర్శకత్వంలో, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు,ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ సంయుక్తంగా నిర్మిస్తున్న"అనగనగా ఓ ధీరుడు"అనే ఫాంటసి చిత్రంలో నటిస్తూంది శృతి హాసన్.శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు.ఆమె మ్యూజిక్ కంపోజర్ కూడా.కమల్ హాసన్,వెంకటేష్ కలసి నటించిన"ఈనాడు"చిత్రానికి శృతి హాసన్ రీ-రికార్డింగ్ అందించింది.అటువంటి శృతి హాసన్ తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ఇచ్చిన
Jan 27, 2011
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com


