మైదా పునుగులు

 

 

 

కావలసినవి:

*  మైదా - 1 కప్పు

* పెరుగు - 1/2 కప్పు

* నూనె - 1 చెంచా

* ఉప్పు - తగినంత

* నూనె - వేయించడానికి

 

తయారీ విధానం:

ముందుగా జల్లించి శుభ్రపరచిన మైదాని పెరుగుతో కొద్దిగా నూనె, ఉప్పు వేసి కాస్త జోరుగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఆ ముద్దని బాగా 20, 30 సార్లు బీట్ చేయాలి. అలా 5గంటలు నానబెట్టిన మైదా పునుగుల పిండిలో సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, జీలకర్ర, ఒక చెంచా వరిపిండి (వరిపిండి వేస్తే కరకరలాడతాయి)వేసి కలుపుకోవాలి. అలా అన్నీ కలిపి చేతితో సన్నని ముద్దలుగా చేసి మరిగిన నూనెలో వేస్తే బాగా పొంగుతూ..మృదువుగా ఉండే పునుగులు లేదా బోండాలు రెడీ....

...రమ