కాకరకాయ ఉల్లికారం కూర

 

 

కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి దాన్ని వండే విధానంలో చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. కాకరకాయ వేపుడు, పులుసు, బెల్లం కూర ఇలా రకరకాలుగా కాకర కాయని చేసుకోవచ్చు. అన్నీ రుచిలో వేటికవే సాటి. అయితే ఉల్లికారం కూర రుచిలో అన్నిటికంటే ఒక మెట్టు పైన ఉంటుంది అని చెప్పొచ్చు. చేయటం కూడా సులువే.

 

కావలసినవి:

కాకరకాయ - 1 /4 kg 

ఉల్లిపాయలు - 3 

నూనె - 2 స్పూన్స్ 

కారం - 1 స్పూన్

ఉప్పు - తగినంత 

పసుపు - చిటికెడు

కరివేపాకు - 2 రెబ్బలు

 

 

తయారు చేయు విధానం:

ముందుగా కాకరకాయని బాగా కడిగి మధ్యకు రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఒకో ముక్కని గుత్తి కూరలకి తరిగినట్టు నాలుగు గాట్లతో గుత్తిగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి ఉప్పు రాసి బాణలిలో రెండు చెంచాల నూనె వేసి కాకరకాయలు వేసి మూతపెట్టాలి. ఉల్లిపాయని సన్నగా తరిగి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కాకరకాయ కాస్త మగ్గాకా మూత తీసి వేయాలి. బాగా వేగాకా ఉల్లిముద్ద, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు వేసి బాగా కలిపి ఒక 5 నిముషాలు ఉంచి దించితే రుచికరమైన కాకరకాయ ఉల్లికారం కూర రెడీ.

 

Tips :

ఉల్లిముద్ద ఎక్కువైతే కూర తీపి వస్తుంది. రుచిగా ఉండదు.

ఉల్లిముద్దలోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి, ధనియాలపొడి వేసి గ్రైండ్ చేసి కూరలో వేయచ్చు. కానీ కాకరకాయ రుచి తెలియాలి అనుకునే వాళ్లు ఉత్త ఉల్లి ముద్ద వేసి చేసుకోవాలి.

 

- రమ