గోంగూర పులుసు

 

 

 

కావలసిన పదార్థాలు:
గోంగూర -రెండు కట్టలు
ఉల్లిపాయలు - మూడు 
పచ్చి మిర్చి- ఆరు
చింతపండు - తగినంత 
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
 కారం - ఒక స్పూన్
నూనె -రెండు స్పూన్లు 

 

తయారుచేసే విధానము:
ముందుగా  గోంగూర ఆకులని  కాడలు లేకుండా తుంపి ,  బాగా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, గోంగూర, పచ్చి మిర్చి చిన్న గా కట్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ గిన్నె లో  గోంగూర, ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి,తగినంత నీరు వేసి మూత పెట్టి ఉడికించాలి. తరువాత మూడు, నాలుగు  విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.పోపు గరిట లో కొద్దిగా నూనె వేసి వేడి  చేసి ఆవాలు, ఎండు మిర్చి వేసి కొద్దిగా వేయించాలి. తరువాత ఉడికించిన  గోంగూర లో  వేసి కలపాలి. ఆ తరువాత చింతపండు పులుసు, పసుపు,  కారం, ఉప్పు వేసి ఐదు నిముషాలు పాటు ఉడికించాలి. ఎంతో రుచిగా ఉండే గోంగూర పులుసు రెడి. ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుంది.

 

- శశికళ