క్యాప్సికం - బఠానీ కూర

 

 

 

కావలసినవి:
క్యాప్సికం - 5
బఠానీలు -  కప్పు
బెల్లం తురుము -1  స్పూన్
ధనియాలు - 2  స్పూన్లు
ఎండు మిరపకాయలు - 5
శనగపప్పు - 1 స్పూన్
కొబ్బరి తురుము - 3  స్పూన్లు
చింతపండు - కొద్దిగా
జీలకర్ర - 1/2  స్పూన్
ఆవాలు - 1 స్పూన్
కరివేపాకు - 2 రెబ్బలు
వేరుశనగపప్పు - 2  స్పూన్లు
పచ్చి మిరపకాయలు - 2
ఇంగువ -1 స్పూన్
ఉప్పు, నూనె, పసుపు, కారం - తగినంత

 

తయారు చేసే విధానం:
ముందుగా కప్పు నీరు పోసి బఠానీలను  నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఉడికించాలి. బౌల్‌లో 2  స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక ధనియాలు, ఇంగువ, 4 ఎండు మిరపకాయలు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత కొబ్బరి తురుము, చింతపండు, కరివేపాకు  కలిపి, పావుకప్పు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.  బౌల్‌లో టీ స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వేసి ఎండు మిరపకాయ వేసి తరువాత సగానికి చీలికలుగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేయాలి. మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ముక్కల్ని తీసి విడిగా పక్కన పెట్టుకోవాలి. బౌల్‌లోఉప్పు, బెల్లం, మసాలా పేస్ట్ వేసి,  నీరు పోసి తక్కువ మంటపై మగ్గనివ్వాలి. చింతపండు పచ్చివాసన పోయేదాకా మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి. వేరుశనగలు, క్యాప్సికం ముక్కలు వేసి సన్నని మంటపై చిక్కబడేదాకా ఉంచాలి. క్యాప్సికం-బఠానీ కూర రెడీ.