మిథున రాశి - (2018-2019)

 

 

మిథున రాశి- మృగశిర 3,4 (కా, కి)

ఆర్థ్ర 1,2,3,4 (కు,ఖం, జ్ఞ, చ్ఛ), పునర్వసు 1,2,3 (కే,కో,హ)

ఆదాయము 14 వ్యయం 2  రాజపూజ్యం 4 అవమానం 3


    ఈ రాశి వారికి గురువు వత్సరాది 11-10-2018 వరకు 5వ స్థానంలో తదుపరి 29-03-2019 వరకు 6వ స్థానంలో తదుపరి 7వ స్థానంలో ఉండును. శని సంత్సరమంతా 7వ స్థానంలో ఉండును. రాహు, కేతువులు 7-03-2019 2,8 స్థానాల్లో తదుపరి వత్సరాంతం 1,7 స్థానాల్లో ఉందురు.

    గ్రహగమనము ఒకరి కొరకు ఆగదు. కాలము ఎవరి విషయంలోనూ పక్షపాతం చూపించదు. జీవిత సుఖ, దుఃఖ భ్రమణములో సమస్యలను అధిగమించే ప్రయత్నము ధైర్యముగా చేస్తూ, శాస్త్రపరమైన పరిహారములను శ్రద్ధగా ఆచరించినా అనేక సమస్యల నుండి బయటపడే అవకాశము గలదు. ఈ సంవత్సరము ఆదాయము ఉన్నా వ్యయము కూడా ప్రయోజనకరముగా చేస్తారు. ఉన్నత విద్యలకై తాము చేసే ప్రయత్నాలు ప్రయాసతో పూర్తి చేస్తారు. ఉద్యోగప్రాప్తి కూడా కలదు.అయితే ఆ ఉద్యోగము పూర్తిగా సంతృప్తినివ్వక సర్దుకుపోవడం సముచితమని గ్రహిస్తారు. విదేశీ ప్రయాణ అవకాశము అప్రయత్నముగా రావచ్చును. అది సంవత్సరాంతములో అవకాశాలు ఉన్నవి. లేదా తాము ఉన్న ప్రదేశమునైనా విడిచి ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర ప్రదేశాలలో నివసించే అవకాశము గలదు. స్థాన చలనం సంభవించవచ్చును. తాము ప్రయత్నిస్తున్న ఉన్నత విద్యా విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. తాము ఎంత కృషిచేసినా, తమ కృష్టికి భగవదనుగ్రహము వల్ల కొన్ని రహస్యాలను ఎదుటివారికి తెలుపుట వలన కొత్త సమస్యలకు బీజం వేసిన వారవుతారు. తాము విధి నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తూ జోక్యము చేసుకోకూడదని గ్రహించండి. నొప్పింపక తానొవ్వక అన్న విషయాన్ని గమనించండి. విద్యార్ధులు తామెంత కృషిచేసినా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామనే నిరాశని వదలివేయండి. ఊహలు, కాలయాపన సోమరితనము తమకు తెలియకుండానే మీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిని ఛేదించే ప్రయత్నం చేయండి. సఫలమవుతారు. తాము ఊహించిన ఫలితము కాస్త తగ్గినా విజయాన్ని వరించామన్న ఆనందము పొందుతారు. విద్యార్థులు ముఖ్యముగా శ్రీ హయగ్రీవస్తోత్రము, దక్షిణామూర్తిస్తోత్రము పారాయణము చేయండి. ఆశ్చర్యకరముగా మంచి ఫలితాలను పొందుతారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ఆలోచనలు చేస్తారు. తొందరగా అలసిపోయే శారీరక స్థితి ఏర్పడవచ్చును. 

    ఉద్యోగస్థులు తాము ఎంత శ్రమించినా గుర్తింపు రావడం లేదనే నిర్వేదము, నిరాశ చెందకుండా ఇప్పటి మీ సహనము. మీ కృషి భవిష్యత్తుతో గొప్ప ఫలితాలను పొందటానికి సోపానమని గ్రహించండి. మీ సహనానికి పరీక్ష ఎదురుకావచ్చును. ఎంత ఓపికతో ఉన్నా, ఎంతటి పేరు ప్రతిష్ఠ సంపాదించినా ఫలితము పొందడంలో నిరాశ ఎదురు కావచ్చును. అనాలోచితముగా స్థానచలన నిర్ణయాన్ని స్వాగతించకండి. స్థానభ్రష్టా నశోభంతే అను విషయాన్ని గ్రహించండి. ఆవేశపూరితమైన సంభాషణలకు దూరంగా ఉండండి. తమ ఉద్యోగములో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రతి ఫైలును ఏ మాత్రము అజాగ్రత్తతో నిర్లక్ష్యము చేయరాదు. ఎవరో చేసిన పొరపాటుకు మీరు జవాబుదారీతనము, మీరు భాద్యత వహించాల్సిన పరిస్థితులు రావచ్చును. చట్ట పరమైన విషయాలలో ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో అనుక్షణము చురుకుగా ఉండే ప్రయత్నము చేయండి. పోలీస్‌స్టేషనులు, కోర్టు తగాదాలు, న్యాయపరమైన వివాదాలు మిమ్ములను ఇబ్బందిపరిచే అవకాశము గలవు. అయినా తమ చాకచక్యంతో గతంలో మీరు సాధించిన విజయాలు, మంచి పేరువలన పై సమస్యల నుండి ఉపశమనము పొందుతారు. మీ యాజమాన్యం, ప్రభుత్వం నిజానిజాలను తెలుసుకుంటుంది. మీకు ఊరట కలుగుతుంది. కాని కాస్త ఆలస్యంగా వారు గుర్తించే అవకాశము గలదు. ప్రమోషన్‌ రాలేదని నిరాశ చెందకండి. నిరుద్యోగులకు అతి ప్రయాసచే ఉద్యోగప్రాప్తి గలదు. కాని అది తమకు సంతృప్తినివ్వదు. తాము చదివిన చదువుకూ, ఉద్యోగానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండగలదు. సర్దుకుపోవడం సంతృప్తి పడడం అలవాటుచేసుకోవాలి. భవిష్యత్తులో మీరు పొందే ఒక మంచి ఫలితానికి ఇవి అన్నీ సోపానాలు కాగలవు.అత్యుత్సాహముతో తమకు సంబంధములేని విషయాలలో తలదూర్చకండి. తలనొప్పిని ఆహ్వానించకండి. ఆరంభించిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు గలవు. దీర్ఘకాలిక వ్యాధులు బి.పి.షుగర్‌ వంటివాటి పట్ల అశ్రద్ధ పనికిరాదు. అతి మంచితనము వలన మధ్యవర్తిగా మరియు సాక్షి సంతకాలు, బాధ్యతలు తాము భరించడం, మొదలయిన విషయాలలో జాగ్రత్తలు అవసరము. ఏ మాత్రము ఏమరపాటు పనికిరాదు. స్తోత్రములకు లొంగి తమకు తాము ఇబ్బందుల పాలు కాకూడదు. శ్రేయోభిలాషుల మాటలు వినుట ఎంతో శ్రేయోదామకము. తరువాత కొంత అనుకూలతగలదు.భయము, నిరాశ అవసరము లేదు. నిర్ణయాలు తీసుకునేముందు తమ మేలుకోరే వారి సలహా పాటించి నడుచుకొనుట శ్రేయోదాయకము, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. శుభకార్యాచరణ అవకాశములు గలవు. తాము పనిచేయు యాజమాన్యం దగ్గర మీ యొక్క పాత్ర అవసరము పెరుగుతుంది. కాని దానికి తగిన ప్రతిఫలము పొందటంలో కొంత నిరాశ మిగులును. స్థిర చరాస్ధులు కొనుగోలుచేసే అవకాశము గలదు. వాహనము నడుపునపుడు ఏ మాత్రం నిర్లక్ష్యము. అజాగ్రత్త, మితిమీరిన ఆత్మవిశ్వాసము పనికిరాదు. సంఘంలో గౌరవము, విలువ పెరుగుతుంది. తమ అవసరానికి మిమ్ములను పొగిడి తమ పనులు పూర్తి చేసుకుంటారు. కళాకారులు అతిగా శ్రమించాలి. ఉన్న వాటిని సమర్ధవంతంగా నిర్వహించే పనిచేయండి. ప్రస్తుత కర్తవ్యమునకు న్యాయం చేయండి. ఊహలలో విహరించడం వల్ల వర్తమానము నష్టపోయే అవకాశము గలదు. స్త్రీ,పురుష సాంగత్యాల విషయంలో అపోహలు, అవమానములు ఏర్పడే అవకాశము గలదు. స్నేహాల విషయంలో కొంత ఆలోచించాలి. ప్రాణస్నేహితుల ప్రవర్తన కొంత బాధించును. మొండి పనులను ఏ విధంగానైనా పూర్తి చేయాలనే పట్టుదల అధికమవుతుంది. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. కర్తవ్య నిర్వహణ న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన ఆదాయము మేలని భావిస్తారు. కుటుంబంలో ఆత్మీయుల ఆరోగ్య విషయంలో కొంత ధనవ్యయం మానసిక అలజడి ఎదురుకావచ్చును. నూతన వ్యాపారం ఆరంభం చేసే అవకాశాలు గలవు. తోబుట్టువుల, కుటుంబపరంగా పరిపూర్ణ సహాయసహకారాలు అందుతాయి. నూతన గృహనిర్మాణము చేయడం లేదా నిర్మించిన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు గలవు. దూర ప్రాంతాలలో ఉద్యోగము చేయువారికి స్వస్థల ప్రాప్తి గలదు. సమాజంలో ఉన్నతవ్యక్తుల పరిచయాలు, రాజకీయ నాయకుల పరిచయాలు ఏర్పడుతాయి. దూర ప్రాంతాలలో కలిసి ఉండే అవకాశాలు గలవు. అదనపు బాధ్యతలు నిర్వహించవలసిన పరిస్థితి రావచ్చును. ధార్మిక, సేవా కార్యక్రమాలలో మీ వంతు పాత్ర మీరు నిర్వర్తిస్తారు. కోర్టు వ్యవహారాలు చికాకు కల్గించవచ్చును. అవివాహితులకు వివాహ ప్రాప్తి గలదు. సంతాన ప్రాప్తి కలదు. నరఘోష అధికంగా ఉన్నది. ఉన్నత విద్యార్జనకై తాము చేయు ప్రయత్నాలు సఫలం అవుతాయి. మనోబలం పెరుగుతుంది. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. వారి భవిష్యత్తుకు కావలసిన మార్గాలను అన్వేషిస్తారు. కొందరి విషయంలో మీకు ఇష్టం లేకపోయినా వారికి సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించ వలసి వస్తుంది. తల్లి తరపువారి ఆస్తి లభించే అవకాశం. తమ వారెవరో, పరాయి వారెవరో గుర్తిస్తారు. పరోక్ష శతృవులు అధికమవుతారు. అయినా ధైర్యం పెరుగుతుంది. పరాక్రమము అధికమవుతుంది. నేత్ర బాధ ఏర్పడే అవకాశం గలదు. అన్య స్థల నివాసము. జీవిత భాగస్వామి ప్రవర్తన మానసిక చింతకు గురికావచ్చును.  మీరు పొందుతున్న పరపతి, పేరు ప్రతిష్టలు ఎదుటివారు అసూయ చెందేలా ప్రవర్తిస్తారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కీర్తికాంక్ష పెరుగుతుంది. అహంకారి అనే ముద్రపడే అవకాశము గలదు. ఆరోగ్యమును అశ్రద్ధ చేయరాదు. ప్రత్యక్ష మిత్రులు పరోక్ష శత్రువులుగా మారే అవకాశం.  కొన్ని సందర్భాలలో తమ ప్రవర్తన భవిష్యత్తు ప్రయోజనాలకు విఘాతం కలిగించవచ్చును.  ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంతవరకు ఊరట లభించును. అయితే తమను ఆదరించి వారిని నిరాదరించే పనిచేస్తారు. నూతన పరిచయం పాత వారిని మరిచిపోయేలా చేస్తాయి. తమ భార్య పేరుతో నడిచే వ్యాపారం కలిసివస్తుంది. పుణ్య కార్యాలు చేస్తారు. ఇచ్చిన ధనం సకాలంలో చేతికందక పోవచ్చును.     

    సరాసరిగా ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్ననూ తమ ఆత్మ విశ్వాసము, తమ నైపుణ్యత, ఓపిక చాకచక్యము నిరూపించుకోగల అవకాశాలు విరివిగా గలవు.

    మీ జీవిత ఆశయము నెరవేరే పరిస్థితులు అంత చేరువలో ఉన్నాయని గ్రహించండి. మీ కలలు నెరవేరుతాయి. మిమ్ములను ద్వేషించిన వారు మీ స్నేహమునకై ఆరాటపడతారు. తాము చేసిన పొరపాట్లను తెలుసుకొని పశ్చాత్తాపపడి మీ దరికి చేరుతారు. మీదే పై చేయి అవుతుంది. అయితే మీతిమీరిన ఆత్మ విశ్వాసము అత్యుత్సాహము కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు గురి చేసే అవకాశము కలదు. ఆత్మ విశ్వాసము పెరుగుతుంది. పొగడ్తలకు లొంగకండి. గతంలో  జరిగిన సంఘటనలు భవిష్యత్తుకు ఒక పాఠంలాగా ఉపయోగించుకోండి. ఊహలలో విహరించకండి. తమవారు  ఎవరో, పరవారు ఎవరో తెలుసుకొనే ప్రయత్నము చేయండి. ధనమే చేతికందుతంఉది. ఆర్థికముగా ఒక స్థితికి వస్తారు. భవిష్యత్తుకై చక్కని పునాదులు వేస్తారు. ఆచరించుటకు ఇదే మంచి సమయము. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. శుభ కార్యాచరణ చేస్తారు. శత్రువులు, మిత్రులవుతారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. మితిమీరిన ఆత్మ విశ్వాసము తగ్గించుకోవాలి. అవివాహితులకు వివాహప్రాప్తి, కోరుకున్న వారితో సఖ్యత. విద్యార్థులకు ఆత్మ విశ్వాసము పెరుగుతుంది. చక్కని ఫలితాలు పొందుతారు. మీ భవిష్యత్తుకు కావలసిన సలహాలు లభిస్తాయి. అహంకారి అనే ముద్రపడే అవకాశము గలదు. కుటుంబ గౌరవము పేరు ప్రతిష్ఠలు కొరకు విశేష కృషి చేస్తారు. వృధాగా కాలం గడపడం మానండి. ప్రతి క్షణాన్ని  పురోభివృద్ధికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. స్త్రీ, పురుష స్నేహాలు ఏర్పడవచ్చును. ఆరోగ్య సమస్య కొంతవరకు బాగుపడుతుంది. కీళ్ళు, ఎముకలకు సంబంధించిన అవస్థలనుంచి కొంతవరకు ఉపశమనము పొందుతారు. స్థిత ప్రజ్ఞత ప్రదర్శించి చాలా సందర్భాలలో మీ అధిపత్యాన్ని చాటుకుంటారు. 

    మీ ప్రతిభా పాటవాలను మీ చుట్టూ ఉన్నవారు గుర్తిస్తారు. శారీరక సమస్యలు ఉన్నా మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపార లాభాలు ఒక మార్గమున మీకు లాభసాటిగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. వివాహ సంబంధాలు సఫలము అవుతాయి. ధనము చేతికంది ఖర్చులు కూడా దానికి తగినట్లుగానే ఉండవచ్చును. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటారు. అందుకొరకు ఆర్థిక సహాయము చేస్తారు. అయితే నరఘోష, అసూయ, ద్వేషాలు గత సంవత్సరము లాగానే భరించాల్సి వస్తుంది. సంతాన ప్రాప్తి గలదు. మీరు కొంతమందికి సహాయము చేస్తారు. భార్యా భర్తల మధ్యన సఖ్యత పెరుగుతుంది. అయితే ఇతర కారణాల వల్ల కొద్దిపాటి ఒక రకమైన విభేదము (తాత్కాలిక) ఏర్పడవచ్చును. ఉన్నత విద్యలకై మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు అనుకూల సమయము. రాజకీయ నాయకులకు కూడా అనుకూల సమయము. చాలా వివాదాలనుండి బయటపడతారు. పరోక్షంగా మీ శ్రేయోభిలాషులకు నిర్లక్ష్యము చేస్తారు. కొందరిని అవసరానికి ఉపయోగించుకొని వదలివేస్తారు. మీ జీవిత ఆగమము (ధన విషయములో) నెరవేర్చుకున్నామనే ఆనందం కలుగుతుంది. మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది. జీవితములో నిజమైన ప్రేమాభిమానాలు అంటే ఏమిటో నిరూపిస్తారు. ఆధ్యాత్మికగా ఒక చక్కని సహకారము లభిస్తుంది. కులాచార వర్తనము పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ అభివృద్ధికై ఒక స్థానచలనము కూడా ఏర్పడవచ్చును. సంతానము యొక్క ప్రవర్తన మీకు సంతృప్తిగా ఉంటుంది. గతముకన్నా మెరుగవుతుంది. వారి విద్యా, ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి. దాయాదుల ఆస్తి కొంత కలసి రావచ్చును. ప్రభుత్వ ఉద్యోగము లభించవచ్చును. అయితే శత్రు, ఋణ బాధలు పరోక్షముగా మిమ్ములను భాదించవచ్చును. శారీరక శ్రమ ఎక్కువగును. కొంతవరకు వ్యవహారపు చిక్కులు ఏర్పడ వచ్చును. 

    ఈ సంవత్సరం శని, కుజ,కేతు, గురు ధ్యానములు జపహోమాదులు నిర్వర్తించండి. నిత్యం హనుమాన్‌ చాలీసా, విష్ణు సహస్రనామ స్తోత్రం, దుర్గా స్తోత్రం, గణపతి అర్చన వారి వారి కుటుంబ ఆచారం ప్రకారం ధ్యానం చేసిన మేలు జరుగును. 


More Rasi Phalalu 2018 - 2019