దసరా ఉత్సవాలు - బతుకమ్మ పాటలు - 1

(Telangana Batukamma Songs - 1)


దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా ప్రాంతీయులు బతుకమ్మ ఆట ఆడతారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ నవమి వరకు బతుకమ్మ ఆటలతో తెలంగాణా ప్రాంతాలు సందడిగా ఉంటాయి. కొందరు నవరాత్రులలో నిత్యం బతుకమ్మ ఆటపాటలతో వేడుక చేస్తారు. అలా కుదరనివారు ఆశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి రోజున బతుకమ్మ ఆట ఆడతారు. ఈరోజును బతుకమ్మ పండుగ లేదా సుద్దుల పండుగ అంటారు. ఇప్పుడు ''బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...'' - అంటూ సాగే ఈ పాటలు విని ఆనందించండి.


More Festivals