Home » Health Science  » ఎపిసోడ్-83


    కిందకు రాకూడదన్న షరతు పెట్టడం వల్ల కిందకు చూడాలన్న కోరికను అణచుకుని పడుకుని కళ్ళు మూసుకుంది.
    
    మరో పది నిముషాలు గడిచాయో లేదో ద్వారం దగ్గర ఏదో కదిలినట్లనిపించి కళ్ళు విప్పి చూసింది.
    
    ఎదురుగా వంశీ.
    
    అది ఆశ్చర్యమో, ఆనందమో, కలో, వైష్ణవ మాయో తెలీనంత విభ్రమానికి లోను కావడంతో ఆమెకు నోరు పెగలలేదు.
    
    కాసేపటికి తేరుకుని ఎదురొచ్చి అతన్ని గాఢంగా హత్తుకుంది సుజన. అతను కనబడకపోయేసరికి ఆమె అంత వేదనకు గురయిందీ ఆ కౌగిలింతలోని గాఢత్వమే తెలియజేస్తోంది.
    
    ఏదో తెలియని ఉద్వేగం ఆమెని నిలవనివ్వక పోవడంతో అతని నుండి విడివడి "వంశీ" అంటూ పిలిచింది.
    
    "ఊఁ"
    
    "ఎక్కడికెళ్ళావ్? నువ్వు కనపడకపోయేసరికి ప్రపంచమే శూన్యంగా తోచింది. ఏదో చెప్పలేని బాధ గుండెల్ని పిండేసింది"
    
    "వచ్చేశాగా" అతను అనునయిస్తూ ఆమె కన్నీళ్ళను తుడిచాడు వంశీ.
    
    "ఎలా వచ్చావ్?"
    
    ఆమెకి ఇంకా నమ్మకం చిక్కలేదు. కలేమోనన్న భ్రమ ఇంకా వదలలేదు.
    
    "బ్రహ్మానంద మహారాజ్ వేషంలో"
    
    అప్పుడు ఆమె అతన్ని పైనుంచి పాదాల వరకూ చూసింది. తెల్లటి జుబ్బా, పైజామాలో అప్పుడే కడిగిన ముత్యంలా వున్నాడు.
    
    "ఈ ప్లాన్ కి నేను పెట్టుకున్న కోడ్ ఏమిటో తెలుసా? 'ప్రిమెచ్యూర్ శోభనం' అని. చిన్న పనిమీద మద్రాసు వెళ్ళాను. ఆ పని ఏమిటో మళ్ళీ చెబుతాను. అక్కడ శరవణన్ ను కలిశాను. మాటల మధ్యలో ఆయన మీనాన్న బ్రహ్మానంద మహారాజ్ ని పంపించమన్న విషయం తెలిసింది.
    
    మీ నాన్న ఆయన్ని ఇంతవరకూ చూడకపోవడం కలిసొచ్చింది. శాస్త్రాల జోలికి పోకుండానూ, ఛాలెంజ్ లో మనం నెగ్గేవిధంగానూ ఈ ప్లాన్ చేశాను. నేను బ్రహ్మానంద మహారాజ్ అవతారమెత్తాను"
    
    "అద్భుతం" అంటూ అతన్ని అప్రిషియేట్ చేయడానికి మరో మారు హగ్ చేసింది.
    
    అప్పుడు గుర్తుకొచ్చింది. ఆమెకు తన ఛాలెంజ్ గురించి అతను కనిపించాడన్న ఆనందంలో దాన్ని మరిచిపోయింది. ఇప్పుడిక ఆలస్యం అనవసరమనిపించి అతని పెదవులపై పెదాలతో అద్దింది.
    
    అన్ని రకాల పళ్ళ రసాలను రంగరించి తాగుతున్నట్లు వుంది అతనికి. అమృతం కోసమా అన్నట్లు ఆమె నాలుకతో చిలుకుతోంది.
    
    అప్పుడు ఆకాశం బుగ్గమీద నక్షత్రంలా వుంది చంద్రవంక. వీరి శోభనాన్ని చూడటానికి గాలి ఎక్కడో దొంగచాటుగా నక్కినట్లు చడి చప్పుడు లేకుండా వుంది. రెండు గదుల మధ్యన వున్న ఖాళీ స్థలంలోనే సృష్టి రహస్యాన్ని చేదించటానికి వాళ్ళిద్దరూ ఎంతో ఉవ్విళ్ళూరుతున్నారు.
    
    అతను ఆమె నుదుతున పెట్టుకున్న ముద్దు సింధూరమై మెరిసింది. కళ్ళమీద పెట్టుకున్న ముద్దు కాటుకే అయింది.
    
    ముక్కు మీద పెట్టుకున్న ముద్దు బంగారు ముక్కెరలా భాసించింది.
    
    కంఠం మీద పెట్టుకున్న ముద్దు ఆభరణంలా అమరింది. నడుం మీద పెట్టుకున్న ముద్దు రతనాల వడ్డాణంలా చుట్టుకుంది.
    
    చివరికి సిగ్గుబిళ్ళ కివ్వాల్సిన ముద్దును ఆమె సుతారంగా అడ్డుకుంది.
    
    ఆమెను అలానే కిందకు వంచి అతను విల్లులా మీదకు ఒరిగాడు.
    
    నఖక్షతం కాస్త పంటిగాటు అయినట్లు చంద్రవంక మరింత ప్రకాశవంతమయింది.
    
    గాలి అగరొత్తుల పరిమళమే అయింది.
    
    శోభనం గదిలోకి పెళ్ళికూతురు తేవాల్సిన పాలు లేవన్న అతని చింతను ఆమె ఎంగిలి తీర్చింది.
    
    బత్తాయిలు లేవన్న బాధను ఆమె బుగ్గలు తీర్చాయి. ఆపిల్ పళ్ళు లేవన్న అసంతృప్తిని ఆమె ఎద తీర్చింది. నల్లద్రాక్ష లేవన్న ఫీలింగ్ ఆమె చనుమొనలు తీర్చాయి. ఖర్జూరం లేదన్న వెలితి ఆమె బొడ్డు తీర్చింది.
    
    ఎగ్జయిట్ మెంట్ తో తలలో రక్తం కెరటాలై లేస్తున్నట్లు ఆమె జుట్టు ముడి వీడింది.
    
    ఏదో కావాలన్న ఆరాటంలో ఎద పొంగడంతో జాకెట్ తన బంధనాలన్నింటినీ తెంచుకుంది.
    
    అంతవరకు కాపలాకాచిన బ్రా ఇక తనవల్ల కాదన్నట్లు ఊడింది. చీర సిగ్గుతో కుచ్చిళ్ళను అడ్డం పెట్టుకుని కిందకు జారిపోయింది. తను ఒక్కటి మాత్రం అడ్డం వుండి ఏం ప్రయోజనం అనుకుంది కాబోలు లంగా కూడా అడ్డం తప్పుకుంది.
    
    ఇవన్నీ అతను చేశాడో, ఆమె చేసిందో కూడా ఇద్దరికీ తెలీదు. వాళ్ళు దాన్ని గుర్తించలేని ఉద్రేకంలో ఒకరిలో ఒకరు కలిసిపోవాలనే కాంక్షతో వున్నారు.
    
    సుఖానికి మహాప్రస్థానం చేస్తున్న రెండు శరీరాలయిపోయారు. ఆమె ఇప్పుడు నగ్నంగా వుంది. మెలికలు తిరిగిన శరీరపు గీతల కింద మాత్రం వెన్నెల తన సంతకాలు చేస్తున్నట్లు నల్లటి చారలు కనిపిస్తున్నాయి.
    
    సుఖం లోతెంతో చూడటానికి అతను ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
    
    శరీరం కొత్త బరువుకి విచ్చుకుంటోంది.
    
    అంత థ్రిల్లింగ్ లోనూ ఆమెకి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అందుకే ముందుకు దూసుకుపోతున్న అతని కళ్ళలోకి చూస్తూ "స్టాట్యూ" అంది.
    
    అప్పుడు వూరకనే అలా బొమ్మలా నిలబడటమంటే స్వర్గంలోకి వెళ్ళబోతున్న వ్యక్తిని హఠాత్తుగా వెనకనుంచి కలర్ పట్టుకుని ఆపడం తప్ప మరేం కాదు. కానీ తమ మధ్య ఉన్న ఒప్పందం మేరకు స్టాట్యూ అంటూనే ఎలా వుంటే అలా ఆగిపోవాలి.
    
    అతను అలానే చిత్రపటంలా అయిపోయాడు.
    
    ఆమె అల్లరిగా నవ్వుతోంది. ఆరోజు గుడిలో అలా స్టాట్యూ చెప్పి ముద్దుపెట్టుకున్నారు కదా -అ మధుకే ఇప్పుడు టిట్ ఫర్ టాట్" అంది.
    
    అతను మాట్లాడకూడదు కాబట్టి మౌనంగా వుండిపోయాడు. 'డౌన్' చెప్పమని కళ్ళు అర్దిస్తున్నాయి.
    
    వెన్నెల్లో ఆమె నగ్నత్వం అతన్ని నిశ్శబ్దంగా కవ్విస్తోంది. తన స్టాట్యూ ఆటను బ్రేక్ చేసెయ్యాలన్న ఉద్రేకం మొదలయినా తమాయించుకున్నాడు.
    
    అతని అవస్థ అంతా ఎంజాయ్ చేసిన ఆమె ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక "డౌన్" అంది.
    
    అతను ఒక్కసారిగా బిగపట్టిన వూపిరిని వదిలాడు.
    
    మళ్ళీ మహాప్రస్థానం మొదలయింది - అయితే ఈసారి జంటగా. ఆత్మలకు సయితం అలసట వచ్చేంతగా వాళ్ళు సుఖాన్వేషణలో మునిగిపోయారు.
    
    కాలం స్తంభించిపోయింది.
    
    వాళ్ళిద్దరూ ఫస్ట్ నైట్ అనుభవాన్ని పొంది, ఆ సుఖంలోంచి తేరుకునేటప్పటికి పుణ్యకాలం కాస్త సమీపించింది.
    
    "నేను తిరిగి బ్రహ్మానంద మహారాజ్ అయిపోతాను. ఇక్కడే మద్రాస్ వెళ్ళిపోతానని చెప్పి, బస్సు ఎక్కేస్తాను. ఫర్లాంగ్ దూరం పోయాక బస్సు దిగి తిరిగి ఇంటికొచ్చేస్తాను. నేను మహరాజ్ ననే భ్రమలోనే మీ నాన్నను ఉంచి, ఇక శాస్త్రాలజోలికి పోకుండా చేస్తాను" అని కిందకు దిగి వచ్చేశాడు వంశీ.
    
    అప్పటికే వాళ్ళు కూడా గుంత తవ్వేశారు. ఇక కొయ్యపెట్టెను అందులో పెట్టి, మట్టి తోయాల్సిన పని మాత్రమే మిగిలి వుంది.
    
    సుజన అంతా సర్దుకుని తాపీగా కిందకు వచ్చింది.
    
    తలుపు తీసుకుని దొడ్లోకి వచ్చింది.
    
    "ఏమ్మా? ఇలా వచ్చావ్! స్వామికి తెలుసా నువ్వు ఇటొస్తున్నట్లు" కంగారుగా అడిగాడు సత్యనారాయణ.
    
    "ఆయనే నన్ను లేపి పంపించారు నాన్నా యాగం అయిపోయింది. ఇక నువ్వు బయటికి రావచ్చు అంటేనే వచ్చాను" అంది సుజన.
    
    "యాగం అయిపోయిందట. ఇది కూడా పూర్తి కావాలి. త్వరగా పూడ్చేద్దాం" అంటూ ఆయన మిగిలినవారిని తొందరచేశాడు.
    
    సుజన, ఉమ దగ్గరికి వెళ్ళి మెల్లగా "నేను సహాయం చేయనా?" అని అడిగింది చిన్నగా నవ్వుతూ.
    
    దానికే ఆమె ఆందోళన పడిపోయింది. "నువ్వు ఈ పనులన్నీ చేయకూడదని స్వామి చెప్పారుగా కన్నెపిల్లలు దీనికి పనికిరారట" అంది.
    
    "కానీ నేను కన్నెపిల్లను కానుగా"
    
    తన పక్కన బాంబు పేలినట్లు అదిరిపడింది ఉమ.
    
    "నువ్వు కన్నెపిల్లవి కావా!! అంతా వేళాకోళంగా వుందా? శోభనం జరగని నువ్వు కన్నెపిల్లవి కాక బిడ్డల తల్లివా?" అని వ్యంగ్యంగా మాటలను సాగదీసింది ఉమ.
    
    "రాత్రివరకు కన్నెపిల్లనే కానీ ఇప్పుడు మాత్రం కాదు"
    
    ఉమ మరోమారు అదిరిపడింది.
    
    ఏమీ అర్ధంకానట్లు చెల్లెలి వంక ప్లాట్ గా చూసింది.
    
    "స్వామి ఎవరనుకున్నావ్? వంశీనే"
    
    ఉమ తన చేతిలోని పలుగు పారేసి సుజనను బరబరా పక్కకి లాక్కొచ్చింది.
    
    వీళ్ళిద్దరి సంభాషణను చూచాయగా విన్న మిగిలిన ఇద్దరు అక్కయ్యలు కూడా అక్కడికి వచ్చారు.
    
    సుజన జరిగినదంతా చెప్పి - "మరి పందెంలో నేను గెలిచాను. మన మాట ప్రకారం పందెంలో గెలిచినవాళ్ళు ఏం చెబితే అది చేయాలి ఓడిపోయిన వాళ్ళు. మరిక నేను కోరుకోనా?" అని అక్కయ్యల రియాక్షన్ కోసం అడిగింది.
    
    "ఓడిపోయాక తప్పదు కదా! ఏం అడుగుతావో అడుగు - బంగారు నెక్లెసా? పట్టుచీరా? లేక మీ హనీమూన్ కి ప్లెయిన్ టికెట్టా?" అడిగింది ఉమ.
    
    "అవేమీ వద్దు - మీ ముగ్గురూ మీ ఫస్ట్ నైట్ ల గురించి చెప్పాలి" అంది సుజన.
    
    వింటున్న ముగ్గురూ అలా కొయ్యల్లా బిగదీసుకుపోయారు.
    


                                     _:   అయిపోయింది  :_


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.