Home » Health Science  » About Birth Control Pill


గర్భనిరోధక మాత్రలు మిమ్మల్ని ఎలా నాశనం చేస్తాయో తెలుసుకోండి!

ఈ సృష్టిలో ఒక ఆడపిల్ల గర్భం దాల్చడం, ఓ బిడ్డకు జన్మను ఇవ్వడం చాలా అద్భుతమైన విషయం. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో పెళ్లికి ముందు నచ్చిన వ్యక్తితో కలవడం, పెళ్లి తరువాత కూడా ఇంకా కెరీర్ ప్లానింగ్ పేరుతో ప్రెగ్నెన్సీ రాకూడదని ప్రయత్నాలు చేస్తుంటారు. దీని కోసం ఎక్కువ మంది ఆధారపడే మార్గం బర్త్ కంట్రోల్ పిల్స్ (birth controal pills) ఉపయోగించడం. 


అయితే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి కేవలం గర్భాన్ని రాకుండా చేస్తాయేమో కానీ అనేక సమస్యలను మాత్రం పక్కాగా వెంటబెట్టుకొస్తాయి.


అండోత్సర్గాన్ని నిరోధించడానికి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల మిశ్రమాన్ని కలిగి ఉన్న చాలా గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నెలవారీ మహిళల్లో వచ్చే నెలసరి సమయంలో అండాలు విడుదల అవుతాయి. వీటిని ఫలదీకరణం చెందించకుండా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ లో ఉన్న మిశ్రమాలు ఆపుతాయి. 


ఇవి ఎలా పని చేస్తాయంటే..


ఈ పిల్స్ గర్భాశయం చుట్టూ ఉన్న శ్లేష్మాన్ని చిక్కగా చేయడం ద్వారా  పనిచేస్తుంది, స్పెర్మ్ గర్భాశయంలోకి ప్రవేశించడం, విడుదలైన అండాలను చేరుకోవడం కష్టతరం చేస్తుంది.  పిల్‌ లోని హార్మోన్లు అప్పుడప్పుడు ఈ  గర్భాశయ లైనింగ్‌ను మార్చగలవు, గర్భాశయ గోడలను అంటిపెట్టుకుని ఉండే అండాలను విచ్చిన్నం అయ్యేలా చేస్తాయి.


గర్భధారణను నిరోధించడానికి మాత్రమే ఈ బర్త్ కొంట్రోల్ పిల్స్ ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటారు.  ఇతర  జనన నియంత్రణ మార్గాల కంటే ఇది బాగా సక్సెస్ మార్గమైనప్పటికీ దీని వల్ల కలిగే మార్పులు మాత్రం కేవలం గర్భం రాకుండా అపడంతో అయిపోవు. ఇలాంటి టాబ్లెట్స్ వాడిన తరువాత  నెలసరిలో ఎక్కువ ఋతుస్రావం, నెలసరి క్రమం తప్పడం, ఎండోమెట్రియోసిస్, అడెనోమియోసిస్, హిర్సూటిజం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు చాప కింద నీరులా చేరతాయి. మరొక విషయం ఏమిటంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అందరికీ ఒకే విషయమై పలితాన్ని ఇవ్వవు. ఒక్కొక్కరిలో ఒకో విధమైన ఎఫెక్ట్ ఉంటుంది. చాలామందిలో ఇవి వాడిన తరువాత గర్భధారణ సామర్థ్యము తగ్గిపోతుంది.   


అమ్మతనం అనేది ఓ ప్రాణికి జీవితాన్ని ఇవ్వడం. స్వార్థ ప్రయోజనాలకోసం ఎంతో మంది మహిళలు అనుసరిస్తున్న ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల మహిళలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా తరువాత అమ్మ అయ్యే అవకాశానికి వారే పెద్ద సమస్యను ఉత్పన్నం చేసుకుంటున్నారు. ఒకవేళ గర్భనిరోధక మార్గం అనుసరించాలని అనుకుంటే మగవారు కండోమ్ వాడటం ఆడ, మగ ఇద్దరికీ ఆరోగ్యకరమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆలోచించండి మరి..


                                   ◆నిశ్శబ్ద.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.