"మీ ఆయన సినిమా రంగానికొస్తే ఒక ఊపు ఊపేస్తారు. పర్మిషన్ ఇస్తావేంటి లేపుకెళ్ళిపోతాను" మల్ హోత్రా కంఠంలో వల్నరబిలిటీ తొంగి చూసింది.

 

    నాయకి గోముగా కసురుకుంది మల్ హోత్రాని.

 

    "డూ యూ లైక్ మూవీస్?" మల్ హోత్రా సామంత్ మీద నుంచి చూపుల్ని మరల్చుకోలేకపోతోంది.

 

    "ఎప్పుడన్నా..." గంభీరంగా అన్నాడు సామంత్.

 

    నాయకికి తన భర్తను చూపు మరల్చకుండా తనివితీరా చూసుకోవాలని వుంది. సామంత్ ఆమె కంతగా నచ్చాడు.

 

    "ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు?"

 

    "యూ మీన్ లీజర్ టైమ్... నో...ఐ ఈట్స్, ఐ డ్రీమ్స్ అండ్ ఐ స్లీప్స్ విత్ మై మెషిన్స్" మల్ హోత్రా సామంత్ కేసి విస్మయంగా చూసింది.

 

    "ఓ... ఐయామ్ సారీ... నేను మర్చిపోయాను. మీరో ఆటోమొబైల్ ఇంజనీర్ కదా? పిహెచ్.డి. కూడా చేసారాయె... నెక్ట్స్... యూ విల్ బి కమ్ ఏ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్... దట్ మీన్స్... లీ అయోకోకా, ఫోర్డ్ ఎట్సెట్రా... డబ్బు సంపాదించడం మీ మగవాళ్ళ ఆర్ట్" మల్ హోత్రా సరదాగా మాట్లాడుతూ అంది.

 

    సామంత్ నవ్వాడు.

 

    భర్త ఏం సమాధానం ఇస్తాడోనని నాయకి ఆత్రుతగా ఎదురు చూస్తుండగా-

 

    Money making is not restricted to males only. A number of women have also made fortunes by their ingenuity. Infact, you are better turned to the art of money - making. You have financial acumen.

 

    సునిశిత పరిశీలనా శక్తి ఊహశక్తి, అన్ షేకబుల్ డిటర్మినేషన్ మీకే ఎక్కువ. సో మెనీ స్టార్ లైట్స్ ఎరన్ట్ ఏ లాట్. ఎలిజిబెత్ టేలర్, గోల్డీహాన్, బ్రిజిత్ బార్డో, మార్లిన్ మాన్రో, కేథరిన్ హెమ్ బర్న్, హాన్ - ఎందరు సంపాదించలేదు మీ ప్రొఫెషన్ లోనే. రేఖ, శ్రీదేవి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ ఎనీబడీ కెన్ ఎరన్ట్" చాలా కేజువల్ గా అన్నాడు సామంత్.

 

    భర్తవేపు ఆరాధనగా చూసింది నాయకి.

 

    "వాళ్ళంతా ఎవరు? పేర్లేమిటి కిరస్తానీ పేర్లలా వున్నాయి? నా కళ్ళు తిరుగుతున్నాయి ఈడేమితి ఇంత నేర్పిస్తే ఎంతో మాట్లాడేస్తున్నాడు?" పిచ్చెక్కిపోతూ అన్నాడు కనకారావు.

 

    అర్జున్ రావుకి అనుమానం వచ్చింది.

 

    పీటర్ కి అయోమయంగా వుంది.

 

    సెక్రటరీ నోరెళ్ళబెట్టేశాడు.

 

    సామంత్ పరిస్థితి ఆ నలుగురికీ ఏం అర్థంకావడం లేదు. "ఓరి నాయనో... వీడి పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా వుంది. వీడిక మన మాట వినడు. వాడి మాటలు మనకర్థం కావు. ఇక మనం చెంగేసుకుని దిగువ తిరుపతి వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోవడమే" అన్నాడు కనకారావు ఏడుపు మొఖం పెడుతూ.

 

    అర్జునరావు కసురుకున్నాడు.

 

    కథ అడ్డంగాని తిరిగిందా?

 

    వీడుగాని జీవితాంతం నటించేందుకే సిద్ధపడి నాగమ్మ ఎస్టేట్ లో సెటిలయిపోతాడా? కాని గత జీవితాన్నేం చేస్తాడు? దాని తాలూకు సాక్ష్యాలనేం చేస్తాడు? సామంత్ నిజంగా ఏమీ లేనివాడు - ఏదీ రానివాడయినా తన కొరిగే ప్రయోజనమేం లేదు.

 

    ఏమీలేని, ఏది రానివాడని నాగమ్మకి తెలిస్తేనే తన పథకం నెరవేరుతుంది. వీడి వాలకమేమిటిలా హఠాత్తుగా మారిపోయింది?

 

    వీళ్ళిలా ఆలోచనల్లో వుండగా నాగమ్మ అటువేపు వచ్చింది.

 

    సామంత్ ని ఎవరికో పరిచయం చేసిందామె. "బ్యూటిఫుల్ సెలక్షన్... మేడ్ ఫర్ ఈచ్ అదర్... మీ నిర్ణయాలెప్పుడూ గాడి తప్పవు" అన్నాడా వ్యక్తి.

 

    నాగమ్మ కళ్ళలో కొండంత వెలుగు... ఆనందం... ఏ భావాలయితే నాగమ్మ కళ్ళలో కనిపించకూడదని అర్జునరావు పగబట్టి వున్నాడో అవే ఇప్పుడు ఆమె కళ్ళలో తరచూ కనిపిస్తూ అతన్ని హింసిస్తున్నాయి.

 

    పెళ్ళికి వచ్చిన వయస్సులో వున్న ఆడపిల్లలకు సామంత్ నుంచి దృష్టిని మరల్చుకోవడం సాధ్యం కావడం లేదు.

 

    ఆడపిల్లల తల్లిదండ్రులు నాగమ్మ పట్ల జెలసీగా ఫీలవుతున్నారు.

 

    పెళ్ళీడుకొచ్చిన యువతులు నాయకికేసి అసూయగా చూస్తున్నారు.

 

    యువకులు వెడ్ డ్రీమ్ ని ఎంజాయ్ చేసేందుకు నాయకి శృంగార రూపాన్ని తమ మస్తిష్కాల్లో ముద్రించుకుంటున్నారు.

 

    ఎటు చూసినా హడావిడి... కోలాహలం... కరెన్సీ నోట్ల ప్రభావం కంచి, ధర్మవరం పట్టుబట్టల రెపరెపలు, ఖరీదైన సూట్స్ మెత్తని కదలికలు... ఛార్లీ ఇంటిమేట్ ఘుమఘుమలు. అదో విచిత్రమయిన ప్రపంచం... విధి జీవితాలంటే తెలీని ఖరీదయిన కవచం మధ్య జరిగే కాస్ట్ లీ పెళ్ళిలో... శ్యామ్ బెనెగల్, శశికపూర్ ళ అరిస్టోక్రాటిక్ సినేరియో... కలియుగ్... ఒక కోణంలో రేఖలా... మరోకోణంలో మాన్రోలా ఇంకో కోణంలో కలల ప్రపంచాన్ని శాసించే బోడెరెక్ లా కనిపిస్తోంది నాయకి. మిసమిసలాడే యౌవనం... శృంగార ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నట్టు కనిపిస్తున్న వైటల్ స్టాటిస్టిక్స్, ముగ్ధత్వం, అమాయకత్వం, వివేకం, నవయవ్వన ప్రభావానికి, వెట్ డ్రీమ్స్ కీ లొంగిపోయిన యువకులు వెళ్ళవలసివున్నా వెళ్ళలేక ఆమెకేసి దొంగచూపులు చూస్తూ ఆగిపోతున్నారు.

 

    అందంగా వుండడం వేరు, తెల్లగా వుండడం వేరు. బట్ షీ ఈజ్ ఏ యూనివర్సల్ ఒవెరా. ఆమె చూపులు ప్రశాంతంగా వున్నా, వాటిలో కాంక్ష వ్యక్తం కాకపోయినా కొందర్ని చూస్తే ఆర్గాన్స్ ఆవేశపడతాయి. పెళ్ళి బట్టల్లో సరిగ్గా అలాగే వుంది నాయకి.

 

    అక్కడున్న యువకుల పరిస్థితే కాదు - సాక్షాత్తు పెళ్ళికొడుకయిన సామంత్ పరిస్థితి కూడా అలాగే వుంది. అటు వాళ్ళు ఇటూ, ఇటువాళ్ళు అటూ మారిపోయిన ప్రాసెస్ లో సామంత్ కి ఆనుకొనేట్లుగా వచ్చింది నాయకి.

 

    సరీగా అప్పుడే ప్రక్కకి చూసిన సామంత్ కళ్ళలో కనకారావు బృందం పడింది.

 

    వాళ్ళలా చూస్తుండగానే నాయకి భుజాన్ని మృదువుగా తన అరచేతిలో ఇముడ్చుకొని ఆమెను మొత్తంగా తనకేసి లాక్కుని ఆమె చెవిలో ఏదో చెప్పాడు.

 

    ఆమె సిగ్గుపడి తన అరచేతుల్లో మొఖం దాచుకోబోతుండగ మెరుపు వేగంతో ఆమె మోము మీదకు వంగాడు. ఆ తరువాత ఆమె పెదవులు మరింత తడిచేరి కందిపోయాయి.

 

    "వాడు కావాలనే మనల్ని ఉడికించేందుకు నాయకిని ముద్దెట్టుకున్నాడు" అన్నాడు ఉక్రోషంగా కనకారావు.

 

    "డోంట్ బి షై... ఐ... సే... యూ ఆర్ లక్కీ" అంది సరీగ్గా ఆ దృశ్యాన్ని అనుకోకుండా అప్పుడే చూసిన మల్హోత్రా.