Home » Beauty » నెయ్యి లేదా కొబ్బరి నూనె చిన్న పిల్లల బాడీ మసాజ్ కు ఏది మంచిది!

నెయ్యి లేదా కొబ్బరి నూనె చిన్న పిల్లల బాడీ మసాజ్ కు ఏది మంచిది!

నెయ్యి లేదా కొబ్బరి నూనె చిన్న పిల్లల బాడీ మసాజ్ కు ఏది మంచిది!


చిన్న పిల్లలకు శరీరం  మసాజ్ చేయడం వారి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో మసాజ్ వారి చర్మానికి మాత్రమే కాకుండా వారి శరీరానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతుంది. భారతదేశంలో చిన్నపిల్లల నుండి పెద్ద వారి వరకు శరీరానికి నూనె లేదా వేరే పదార్థంతో మసాజ్ చేయడం  అనేది పురాతన సంప్రదాయం. ఇది పిల్లలకు పోషణను, అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే  చిన్న పిల్లల శరీరం మసాజ్ కోసం సరైన నూనెను ఎంచుకోవడం వల్ల  ఎముకలు, కండరాలు,  మొత్తం ఆరోగ్యం సురక్షితంగా ఉండటంలో సహాయపడుతుంది.

సాధారణంగా చాలామంది కొబ్బరి నూనె లేదా నెయ్యిని బేబీ మసాజ్ కోసం ఉపయోగిస్తుంటారు. కానీ ఈ రెండింటిలో ఏది మంచిది? ఆయుర్వేదం దేన్ని సిఫారసు చేస్తుంది? తెలుసుకుంటే..


నెయ్యితో మసాజ్..


లాభాలు..

నెయ్యిని మసాజ్ కోసం  వాడటాన్ని ఆయుర్వేదం చాలా ప్రయోజనకరమైనదిగా చెబుతుంది.

నెయ్యిలో సహజ కొవ్వులు,  విటమిన్లు A, D, E,  K ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి పోషించడంలో సహాయపడతాయి. చిన్న పిల్లలకు పొడి చర్మం ఎక్కువ ఉంటుంది.  ఇందుకోసం నెయ్యి  చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

శీతాకాలంలో నెయ్యితో మసాజ్ చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. ఇది చల్లని వాతావరణంలో ప్రయోజనకరంగా ఉంటుంది.  ఆయుర్వేదం ప్రకారం, పిల్లల శరీరాన్ని నెయ్యితో మసాజ్ చేయడం వల్ల ఎముకలు,  కండరాలు బలపడతాయి. పిల్లల శరీరాన్ని నెయ్యితో మసాజ్ చేయడం చర్మం  సహజ మెరుపు పెరుగుతుంది, పొడిబారడం తగ్గుతుంది.

నష్టాలు..

చిన్నపిల్లల శరీరాలను మసాజ్ చేయడానికి నెయ్యిని ఉపయోగించడం మంచిదే అయినప్పటికీ.. దీంతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

వేసవిలో పిల్లల శరీరాన్ని మసాజ్ చేయడానికి నెయ్యిని ఉపయోగించడం భారంగా పరిగణించబడుతుంది.
కొంతమంది పిల్లలకు జిడ్డు చర్మం లేదా అలెర్జీ స్కిన్ కూడా ఉండవచ్చు.  ఇలాంటి వారికి  నెయ్యితో మసాజ్ చేయడం వల్ల ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.   నెయ్యి స్వచ్ఛమైనది కాకపోతే, ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది.

కొబ్బరి నూనెను మసాజ్ కోసం వాడితే..

కొబ్బరి నూనె చిన్న పిల్లల శరీరాన్ని మసాజ్ చేయడానికి ప్రయోజనకరంగా,  సురక్షితంగా పరిగణించబడుతుంది.

కొబ్బరి నూనె తేలికగా ఉంటుంది.   చర్మంలోకి సులభంగా శోషించబడుతుంది. అందువల్ల దీన్ని మసాజ్ కోసం వాడటం సులభం. ఇది  పిల్లలకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించదు.

కొబ్బరి నూనె చల్లదనాన్ని  కూలింగ్ ఇస్తుందని, చర్మాన్ని కూల్ చేస్తుందని చెబుతారు. ఇది వేడి వాతావరణంలో పిల్లల చర్మానికి మరింత అనుకూలంగా ఉంటుంది.

కొబ్బరి నూనె సహజ యాంటీ బాక్టీరియల్,  యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ నుండి చర్మాన్ని రక్షించడంలో  సహాయం చేస్తుంది.

పిల్లలకు సున్నితమైన చర్మం లేదా అలెర్జీలు ఉంటే, కొబ్బరి నూనె చాలా మంచి ఎంపిక.

నష్టాలు..

కొబ్బరి నూనె పిల్లల చర్మానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఇది కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది.

కొబ్బరి నూనె చర్మానికి కూలింగ్ ఇస్తుంది. కాబట్టి శీతాకాలంలో  పిల్లల శరీరానికి సరైన వెచ్చదనాన్ని ఇవ్వదు.

చాలా చల్లని వాతావరణంలో చర్మానికి సరైన తేమ లభించదు.

ఏది మంచిదంటే..

నెయ్యి,  కొబ్బరి నూనె రెండూ పిల్లల శరీర మసాజ్‌కు సురక్షితమైనవి,  ప్రయోజనకరమైనవిగా పరిగణించబడతాయి. అయితే చలి కాలంలో పిల్లల చర్మానికి నెయ్యి బాగుంటుంది. ఎందుకంటే ఇది చర్మాన్ని లోతుగా పోషిస్తుంది,  వెచ్చగా ఉంచుతుంది.

కొబ్బరి నూనె వేసవిలో పిల్లల చర్మానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తేలికగా ఉంటుంది,  శరీరాన్ని చల్లబరుస్తుంది.

                                    *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img