కాంట్రా సెప్టివ్ పిల్స్‌తో అమ్మాయిలు జాగ్రత్త

అమ్మాయిలూ..  మీరు ఎక్కువగా గర్భ నిరోధక  మాత్రలు వాడుతున్నారా? అయితే  మీ మెదడు  కుంచించుకు పోతుందని  వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు  అతిగా వాడితే మీ బ్రెయిన్  కుంచించుకు పోవడమే కాదు, సెక్స్ పై  మోజు తగ్గుతుందని ఒక పరిశోధనలో వెల్లడించారు. ఒక నూతన పరిశోధన ఆధారంగా గర్భ నిరోధక మాత్రలు వాడడంవల్ల బ్రెయిన్ లో ఒక భాగం కుంచించుకు పోయి కామవాంఛ తగ్గుతుందని నిపుణులు తేల్చారు. స్త్రీలు వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడకం ద్వారా హైపోథాలమస్ చిన్నదిగా మారుతుందని, హార్మోన్లను స్పందించకుండా చేస్తుందని పరిశోధకులు  వెల్లడించారు. హైపోథాలమస్ బలహీనపడి స్త్రీలలో కామవాంఛను తగ్గిస్తుంది, హృదయ స్పందన నిద్రావస్థకు చేరుతుందని, దీనివల్ల కోరికలు నశిస్తాయని పేర్కొన్నారు. 


ఉత్తర అమెరికాకు చెందినా రేడియోలాజికల్  సొసైటీ 50మంది మహిళలపై జరిపిన పరిశోధనలో ఈఫలితాలు వెలువడ్డాయి. 50 మందిలో 21మంది మహిళలు పిల్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది. 50 మంది మహిళలపై జరిగిన బ్రెయిన్ స్కాన్ లో హైపోథాలమస్‌ల సైజ్ ను పరిశీలించారు. ఈసందర్బంగా డాక్టర్లు విస్తుపోయే అంశాలు గమనించినట్లు చెప్పారు. అంతే కాకుండా వారి మెదడు పరిమాణంలో చాలా వ్యత్యాసాలు కనిపించడం గుర్తించినట్లు తెలిపారు. పిల్ తీసుకున్నవారిలో తీసుకోనివారి మాధ్య వ్యత్యాసాలను వైద్యులు గమనించినట్లు కూడా తెలిపారు. న్యూయార్క్ లోని  ఆల్బర్ట్ అయిన్ స్టీన్ కాలేజీకి చెందిన రేడియాలజీ ప్రొఫెసర్ తమ పరిశోధనలో మెదడులో అనూహ్య మార్పులు గమనించినట్లు పేర్కొన్నారు. ఓరల్ కాంట్రా సెప్టివ్ పిల్స్ వాడకం వల్ల అనర్ధాలు ఉంటాయి అనే అంశంపై పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఈపిల్స్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అన్న అంశాన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. మొదటిసారి పిల్స్ వాడిన వారిలో సెక్స్ హార్మోన్స్ పై ప్రభావాన్నిచూపడం గమనించినట్లు తెలిపారు. ఈ మాత్ర మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఎవరి పట్ల  ప్రేమలో పడ్డారో వారి పట్ల సెక్స్ చేయకుండా నియంత్రిస్తుందని ప్రొఫెసర్ మిచెల్ లిఫ్టన్ పేర్కొన్నారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సదాహ్ హిల్ కేవలం సెక్స్ పైనే ప్రభావం చూపదని ఆకలి, ఒత్తిడి మనలోఉండే ఉద్వేగాలను నియంత్రిస్తుంది అని మూడ్స్ ఎలా ఉంచుకోవాలో కూడా నిర్దేశిస్తుందని తెలిపారు.

పిల్ వాడకం వల్ల తక్కువ సామర్ధ్యం ఉన్నవారినే  స్ట్గ్రీలు ఇష్ట పడతారని తెలుస్తోంది. హార్మోన్ మార్పులు శరీరానికి అందడంవల్ల ప్రొజె స్టురియన్ హార్మోన్ అంటే సహాజంగా వచ్చే నెలసరి వచ్చినవారిలో ప్రొజెస్టర్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందని మిలియన్ల మంది స్త్రీలు సరైన కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడక పోవడంవల్లే సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమని వైద్య నిపుణులు హెచ్చరించారు. కాంట్రా సెప్టివ్ పిల్స్ వల్ల తలనొప్పి, బరువు తగ్గడం, నెలసరి సరిగ్గా లేకపోవడం, తెల్ల బట్ట అధికంగా అవ్వడం, వక్షోజాలు గట్టిగా  ఉండడం వంటి మార్పు గమనించవచ్చని, రుతు స్రావం మధ్యలో చుక్కలు పడడం వంటిసమస్యలు, వెన్నునొప్పి, గుండె నొప్పి వచ్చే అవకావం ఉందని నిపుణులు హెచ్చరించారు.