బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా మొదలవుతుంది

 

శరీరంలో ఏ భాగం లో అయినా అసాధారణ కణాలు ఒకే చోట గుమిగూడి గడ్డగా తాయారు కావడం ద్వారా క్యాన్సర్ ప్రారంభ మౌతుంది.కొంత కాలం గడిచేసరికి ఈ అసాధారణ కాణాలు రూపాన్ని మార్చుకుంటూ అసంఖ్యా కంగా వృద్ధి చెంది ఆ భాగాన క్యాన్సర్లు పరిమితం కావడం లేక రక్త ప్రవాహం ద్వారా,లింఫ్,వ్యవస్థ ద్వారా ఇతర భాగాలకు వ్యాప్తి చెందితే క్యాన్సర్ గా మారుతుంది.వక్షోజాలాలో బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు కూడా ఇలాగే ఏర్పడతాయి. సాధారణంగా వక్షోజాలలో ఏర్పడే చాలా భాగం గడ్డలు ప్రామాడం లేనివి బినైన్ వి అయి ఉంటాయి. అంటే ఇవి ప్రామాదం లేనివి అయి ఉంటాయి.కాని ఇలాంటి గడ్డలలో కొన్ని తరువాత తరువాత ఆ స్త్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ ని కలిగించే అవకాసం ఉంది.

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు...

బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాధమిక దశలో ఉన్నప్పుడు సాధారణంగా నొప్పి అంటూ ఉండదు.లక్షణాలలో  మొదటిది వక్షం లోపల గడ్డ ఏర్పడడం.సాధారణం గా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. వక్షం లో గాని చంకలో గాని గడ్డ లేక వాపు ఉండడం.నిపుల్ లోపలికి వంపు తిరిగి ఉండడం. లేదా నిపుల్ సజులో మార్పు. నిపుల్ చర్మం మందం కావడం లేదా సొట్ట బడడం. వక్షోజపు చర్మం బత్తాయి తోలు మీద ఉన్నట్లు గుంటలు గుంటలు గా గరుకుగా ఉండడం. బ్రెస్ట్ బరువెక్కడం. నిపుల్ నుంచి రక్తం తో కూడుకున్న డిశ్చార్జ్ కావడం.

క్యాన్సర్ నిర్ధారణ...

బ్రెస్ట్ క్యాన్సర్నే కాదు ఏ క్యాన్సర్ నైనా గాని ప్రాధమిక దశలో గుర్తిస్తే ప్రాణా పాయం నుంచి తప్పించడం కుదురు తుంది. 2౦ నుంచి 49 సంవత్సరాల వయస్సుగల ప్రతి స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించి రెండేళ్ళ కొకసారి 5౦ ఏళ్ళు దాటిన తరువాత యాడాది కి ఒక సారి పరీక్ష చేయించుకోవడం అవసరమని నిపుణులు బోధించారు. శారీరకంగా పరీక్షించే సమయం లో డాక్టర్లు స్త్రీలను రెండు చేతులు పైకి ఎత్తమని పక్కకి వదిలి పెట్టమనడం. పిరుదల మీద కొట్టుకోమని చెప్పి వివిధ కోణాలలో ఆమె వక్షోజాల సైజ్ ,షెపులు నిశితంగా పరిశీలిస్తారు. అలాగే వక్షోజాల పై చర్మం గురుకుగా అయిందా,గుంటలు పడిందా వంటి అసాదారణ చిహ్నాల కోసం చూస్తారు. నిపుల్స్ మీ నొక్కి ఏమైనా ద్రవం కారుతున్నదేమో చూస్తారు. అలాగే వక్షోజాలను వెల్ల నొక్కడం ద్వారా లోపల గడ్డలు తగులు తున్నా యేమో పరిశీలిస్తారు.ఒక వేళ గడ్డ తగిలితే దాని సైజు,షేపు,అటుఇటూ కడుతున్దాలేదా అని మరీ పరిశీలిస్తారు. వక్షోజం లోని గడ్డలలో అపకారం లేని హానికరం కాని,హానికారక మైన గడ్డలు క్యాన్సర్ గడ్డలకు తేడాలు ఉంటాయి. హాని కలిగించని సాధారణ గడ్డలు మృదువుగా మెత్తగా గుండ్రంగా ఉంటాయి.తేలికగా అటూ ఇటూ కదిలేట్లు ఉంటాయి. క్యాన్సర్ గడ్డలు గట్టిగా ఉండి.గుండ్రంగా కాకుండా వంకర టింకర గా ఉండి అటు ఇటూ కదల కుండా ఉన్న చోటే  పట్టుకునే ఉంటాయి. అయితే క్యాన్సర్ గడ్డ అవునా కాదా అన్నది నిర్ధారించుకోడానికి చేసే నిర్ధారణ పరీక్షలు....

మామోగ్రామ్...

వివిధకోణాలలో వక్షోజం లోపలి తక్కువ పవర్ గల ఎక్స్ రే కిరణాలు పంపి అక్కడి కనజాల చిత్రాలను తీయడం మామోగ్రామ్ మామూలు  పరీక్షలో చేతికి తగలని గడ్డలు.మామో గ్రామ్ లో కనిపిస్తాయి.అలాగే సూక్షంగా కాల్షియం డిపాజిట్లు ఉన్నా తెలుస్తాయి. ఈ కాల్షియం డిపాజిట్లను మైక్రో కల్సిఫికేషన్స్ అంటారు.ఇవి అవి తరువాత తరువాత క్యాన్సర్ కు దారి తీసే అవకాసం ఉంది లేదా క్యాన్సర్ కు సంబందించినవి అయి ఉండవచ్చు.

అల్త్ర్రా సౌండ్...

వక్షోజాల లోపలి గడ్డ గట్టిగా ఉందా లేదా ద్రవం తో కూడుకుని ఉన్న సిస్టా లేక ఈ రెండిటి కలయికతో కూడుకుని ఉందా అన్న విషయం తెలుస్తుంది. సిస్ట్ అయితే సాధారణ క్యాన్సర్  ఉండదు.సాలిడ్ గా ఉన్న గడ్డలు మాత్రం క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాసం ఉంది.

ఎం ఆర్ ఐ...

ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా వచ్చే చిత్రాలలో సాధారణ కణాల కంటే భిన్నంగా ఉండే రోగ పూరిత కణాలు తెలుస్తాయి.

బయాప్సి...

శరీరంలో ఉన్న కణజాలపు ముక్కను బయటికి తీసి పరీక్షించడం బాయప్సి అంటారు.క్యాన్సర్ అవునా కాదా అన్నది ఖచ్చితంగా నిర్ధారించడానికి ఉన్న ఒకే ఒక సాధనం బ యాప్సి లోపల అసాధారణ మైన కణజాలం ఉన్నట్లుగా పైన పేర్కొన్న టేస్ట్లలో ద్వారా తేలినప్పుడు బయాప్సి చేయాల్సిన అవసరం వస్తుంది.అసాధారణ కణజాలం ఉన్నట్లు తేలిన ప్రదేశం నుంచి కాణ జాలాని లేదా,ద్రవాన్ని,గాని బయటికి తీయించి.అది ఏ రకంసైన క్యాన్సర్ అన్నది తెలుసుకోడానికి ల్యబోరేట రీలో పరీక్ష చేస్తారు.బయాప్సి లో నీడిల్ బయాప్సి, కోర్ బయాప్సి ,స్కిన్ బయాప్సి,సర్జికల్ బయాప్సి లో వక్షోజం లోపలి గడ్డలో కొంత భాగాన్ని బయటకి తీసి లేక గడ్డ మొత్తాన్ని బయటికి తీయడం లాంటివి ఉంటాయి.

బ్రెస్ట్ క్యాన్సర్ కు చికిత్స...

మిగతా అన్ని క్యంసర్ల లాగానే బ్రెస్ట్ క్యాన్సర్ కు మూడు ముఖ్యమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. శాస్త్ర చికిత్స,రేడియేషన్,తెరఫి,కీమో తెరఫి  బ్రెస్ట్ ,క్యాన్సర్ దశను బట్టి హార్మోన్ సున్నితంగా ఉంటాయి కాబట్టి.రోగి ఇతర అవయవాల పనితీరు ఉంది అన్న అంశాల పనితీరును బట్టి చికిత్సను నిర్ణ యిస్తారు.
క్యాన్సర్ దసలు వివిధ దశల్లో చికిత్సలు మీకు అందిస్తాం.