సోనమ్ కపూర్ ఫిట్నెస్ రహస్యం
ఈ మధ్య కాలంలో ముప్పై అయిదు కేజీల బరువు తగ్గిన సోనమ్ కపూర్, తన ఫిట్నెస్
రహస్యం ఏమిటో మనం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం !
ముందుగా నేను మా అమ్మకి థాంక్స్ చెప్పుకుంటూ, తన సహాయంతో వారానికి ఆరు రోజులు వర్కౌట్ చేసి మరీ నేను ఈ బరువు తగ్గాను.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫ్రూట్స్, ఓట్ మీల్ మాత్రమే తీసుకుంటాను. ఆ తరువాత వర్కవుట్ స్టార్ట్ చేస్తాను. దాని ముందు ఖచ్చితంగా ప్రొటీన్ షేక్ విత్ జ్యూస్ , బ్రౌన్ బ్రెడ్ విత్ గుడ్డు తెల్లసొన మరిచిపోకుండా తీసుకుంటాను.
ఇక మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూరలు, పప్పుతో ఒక రాగిరొట్టె, చికెన్ లేదా ఫిష్ ముక్కలు, ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాను.
అలాగే సాయంత్రం స్నాక్స్ తినాల్సి వస్తే ఉడకబెట్టిన గుడ్డులోని వైట్ లేదా చికెన్ ముక్కలు, ఫైబర్ వీలైనంత ఎక్కువ మోతాదులో తీసుకుంటాను. రాత్రి పూట డిన్నర్ చేసేటప్పుడు ఏదైనా సూప్, ఫిష్ లేదా చికెన్ పీసెస్, ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాను.
ఒక తినడం వల్లే ఫిట్నెస్ వస్తుందనుకోవద్దు. తినడంతోపాటు యోగ కూడా చేయాలి. నా ఫిట్నెస్ ముఖ్య కారణం యోగా అని కూడా చెప్తాను. భరత్‌ఠాకూర్ దగ్గర పవర్‌యోగా నేర్చుకున్నాను. ఆ యోగా నేను బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడింది. బాడీ ఎప్పుడు డీహైవూడేట్ అవ్వకుండా చూసుకోవడం ప్రధానం. అందుకోసం ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి.