Home » Beauty » షాంపూలో ఇది కలిపి వాడితే జుట్టు పొడవు పెరగడం ఎవరూ ఆపలేరు..!

షాంపూలో ఇది కలిపి వాడితే జుట్టు పొడవు పెరగడం ఎవరూ ఆపలేరు..!

షాంపూలో ఇది కలిపి వాడితే జుట్టు పొడవు పెరగడం ఎవరూ ఆపలేరు..!


కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆహారం,  గాలి,  నీరు,  కలుషితం కావడం, పంటలు  పండించడంలో కూడా రసాయనాలు ఎక్కువ ఉపయోగించడం,  ఇన్స్టంట్ ఫుడ్ లు,  ప్యాక్డ్ ఫుడ్ లు.. ఇలా ఒకటి అని కాదు.. మనిషి శరీరం మీద చాలా ప్రభావాలు చూపిస్తాయి.  ఇవన్నీ మనిషి లైఫ్ స్పామ్ ను మెల్లిగా తగ్గిస్తున్నాయి.  అలాగే శరీర పనితీరు, శరీరంలో అవయవాలు,  చర్మం,  జుట్టు, గోళ్లు మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగానే నేటికాలంలో చాలామందికి చిన్నతనంలో జుట్టు బాగా పొడవుగా ఉన్నా,  పెద్దయ్యే కొద్ది పొడవుగా ఉన్న జుట్టు కాస్తా పిలకలాగా మారిపోతోంది.  అయితే అమ్మాయిలు మాత్రం తమ జుట్టు విషయంలో భగీరథ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో రకాల నూనెలు, షాంపూలు, హెయిర్ ప్యాక్ లు ఉపయోగిస్తుంటారు.  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ  కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.  ముఖ్యంగా షాంపూలో కింద చెప్పుకునే చిట్కా ఫాలో  అయితే జుట్టు పెరుగుదలను ఎవరూ ఆపలేరు. అదేంటో తెలుసుకుంటే..

ప్రోటీన్ లిక్విడ్..

జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగడానికి షాంపులోకి ప్రోటీన్ లిక్విడ్ కలిపి వాడాలి. ఈ ప్రోటీన్ లిక్విడ్ చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే..

ప్రోటీన్ లిక్విడ్ కావలసిన పదార్థాలు..

బియ్యం..1 టేబుల్ స్పూన్

అవిసె గింజలు.. 1 టేబుల్ స్పూన్

కరివేపాకు.. 10-15 ఆకులు

లవంగాలు.. 5

తయారీ విధానం..

ఒక పాత్రలో నీరు తీసుకోవాలి.  ఇందులో బియ్యం, అవిసె గింజలు,  కరివేపాకు, లవంగాలు వేసి ఉడికించాలి. అవిసె గింజలు కాస్త జెల్ లాగా మారుతున్నట్టు అనిపించినప్పుడు స్టౌ ఆఫ్ చేసి వడగట్టాలి.  ఈ లిక్విడ్ చల్లారిన తర్వాత ఉపయోగించాలి.


ఉపయోగించే విధానం..

పైన తయారు చేసుకున్న లిక్విడ్ ను నచ్చిన షాంపులో కలిపి వాడాలి.  దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడాలి.  ఇది జుట్టుకు చాలా మంచి పోషణ ఇస్తుంది.

ప్రయోజనాలు..

ఈ ప్రోటీన్ లిక్విడ్ లో అవిసె గింజలు ఉంటాయి.  దీని జెల్ జుట్టును సిల్కీగా మారుస్తుంది.
బియ్యం జుట్టుకు పోషణ ఇస్తుంది. నేటి కాలంలో  జుట్టు, చర్మ సంరక్షణలో రైస్ వాటర్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.
కరివేపాకు జుట్టుకు బలాన్ని,  జుట్టు నల్లగా, పొడవుగా పెరగడంలో సహాయం చేస్తుంది.
లవంగాలలో ఉండే రసాయన గుణాలు జుట్టును,  కుదుళ్లను బలంగా మారుస్తాయి.  

పైన పేర్కొన్న పదార్థాలు తల చర్మంలో ఉన్న సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అయితే తీసుకునే ఆహారం,  లైఫ్ స్టైల్,  అలవాట్లు బాగుంటేనే ఇలాంటి చిట్కాలు పనిచేస్తాయి.  లైఫ్ బాగలేకున్నా,  ఆహారం సరిగా తీసుకోకపోయినా, లైఫ్ స్టైల్ బాగాలేకున్నా.. అంటే అర్థరాత్రి వరకు మేలుకోవడం,  ఉదయం  ఎప్పుడో లేవడం, వ్యాయామం చేయకపోవడం,  ఎక్కువసేపు  కూర్చుని ఉండటం వంటివి లైప్ స్టైల్ సరిగా లేకపోవడాన్ని సూచిస్తాయి. అవన్ని సరిచేసుకోవడం చాలా ముఖ్యం..

                                  *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img