మహిళలకు రైల్వే వరాలు
ఈసారి రైల్వే బడ్జెట్‌లో మహిళల మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. రైలు ప్రయాణంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలు సక్రమంగా అమలైతే రైలు ప్రయాణం మహిళలకు మరింత సౌకర్యవంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
* టోల్ ఫ్రీ నంబర్ 182 నుండి ఎటువంటి భద్రత సహాయకర చర్యల కోసమైనాకాల్ చేయవచ్చు.
* ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులు ఫ్లాట్ ఫాం మీద ఉండేలా చూస్తారు. లేడీస్ కంపార్ట్‌మెంట్‌లలో ప్రత్యేక సీసీ కెమెరాల ఏర్పాటు.
* ట్రావెలింగ్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆల్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ 138 నుండి రిపోర్టు చేయవచ్చు.
* రైల్వే స్టేషన్లలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం 4.72 కోట్లు కేటాయింపు.
* రైల్వే డిపార్ట్‌మెంటుకు సంబంధించిన కంప్లయింట్స్ ఇవ్వడానికి మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ అప్లికేషన్ అందుబాటులోకి వస్తే రైళ్ళలో ప్రయాణించే మహిళలకు మరింత సౌకర్యవంతంగా వుంటుంది.
