గుమ్మడి గింజలు జుట్టుకు, చర్మానికి మేలు చేస్తాయా..నిజాలివి..!
గుమ్మడి గింజలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలని అంటున్నారు. ఒకప్పుడు పండ్లు, కూరగాయలలోని ఈ విత్తనాలను తెలియకుండానే పడేసేవాళ్లం. కానీ ఇప్పుడు వీటిని విడిగా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. అయితే గుమ్మడికాయ గింజలను రోజూ తింటుంటే చర్మం, జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుందట. అయితే కేవలం తినడమే కాదు.. గుమ్మడి గింజలను కింద చెప్పుకున్న పద్దతిలో వాడితే మ్యాజిక్ జరగడం ఖాయం అంటున్నారు. అసలు గుమ్మడి విత్తనాలలోని పోషకాలు ఏంటి? ఇవి చర్మానికి, జుట్టుకు ఎలా మేలు చేస్తాయి? తెలుసుకుంటే..
గుమ్మడి గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలలో ఐరన్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా మెరిచేలా చేస్తాయి. గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకోవడమే కాకుండా గుమ్మడి గింజల నూనెతో తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. ఇది జుట్టు మూలాలను బలంగా మారుస్తుంది.
గుమ్మడి గింజలలో విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. అలాగే పొడి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. గుమ్మడి గింజలను రోజూ ఆహారంలో తీసుకోవడమే కాకుండా గుమ్మడి గింజలను పెరుగుతో కలిపి పేస్ట్ లా మిక్సీ వేయాలి. దీన్ని స్క్రబ్ గా ఉపయోగించాలి చర్మం చాలా అందంగా, మృదువుగా మారుతుంది.
గుమ్మడి గింజలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి మొటిమలను, మొటిమల వల్ల కలిగే నొప్పిని, మొటిమల తగ్గించడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకోవడం మాత్రమే కాకుండా ఓట్ మీల్ తో కలిపి పేస్ట్ లా చేసి ఫేస్ మాస్క్ గా వేసుకోవాలి. ఇది మంచి ఫలితం ఇస్తుంది.
ముఖం మీద ముడతలు, గీతలు తగ్గాలంటే గుమ్మడి గింజలతో మ్యాజిక్ చేయాల్సిందే. గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గించడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలు, తేనె కలిపి బాగా మిక్సీ వేయాలి. దీన్ని పేస్ మాస్క్ వేసుకోవాలి. మంచి ఫలితాలు ఇస్తుంది.
ముఖం మీద వాపు, వేడి కారణంగా ముఖం మీద వేడి గుల్లలు రావడం, చర్మం మంటగా ఉండటం, చర్మం చికాకులు ఇలాంటి సమస్యలు ఉంటే గుమ్మడి గింజల నూనెతో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖ చర్మం వేడి నుండి వాపులు, చర్మం సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది.
*రూపశ్రీ
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
