Home » Fashion » ఒకే కుర్తీతో 5 డిఫరెంట్ లుక్స్.. ఇదిగో ఇలా ట్రై చేయండి!

ఒకే కుర్తీతో 5 డిఫరెంట్ లుక్స్.. ఇదిగో ఇలా ట్రై చేయండి!

ఒకే కుర్తీతో 5 డిఫరెంట్ లుక్స్.. ఇదిగో ఇలా ట్రై చేయండి!

ఇది వేసవి కాలం. చాలా మంది అమ్మాయిలు సౌకర్యవంతమైన, వేడి నుండి ఉపశమనం కలిగించే దుస్తులను ఇష్టపడతారు. అందువల్ల వేసవిలో కుర్తీలు ట్రెండీగా మారిపోతాయి. ప్రతి అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఒక సింపుల్ కుర్తీ ఉంటుంది, కానీ తరచుగా అదే కుర్తీని పదేపదే ధరించడం విసుగు తెప్పిస్తుంది. కానీ ఆ ఒక్క సాధారణ కుర్తీతోనే  ఐదు డిఫరెంట్ లుక్స్ ను,  స్టైల్స్‌ను క్రియేట్ చేయవచ్చు.  చాలామంది అమ్మాయిలు అందంగా కనబడాలంటే దుస్తులు చాలా ఉండాలి అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. ఫ్యాషన్ ను ఫాలో అయితే.. ఒక కుర్తీ తోనే డిఫరెంట్ లుక్స్ ను క్రియేట్ చేయవచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.  కేవలం సింపుల్ టిప్స్ తోనే ఇది సాద్యమవుతుంది.  సాధారణ కుర్తీని స్టైల్ చేయడానికి ఐదు అధిరిపోయే చిట్కాలు తెలుసుకుంటే..

కుర్తీ, జీన్స్..

మోకాళ్ల వరకు ఉండే కుర్తీ ఉంటే, దానిని స్కిన్నీ లేదా స్ట్రెయిట్ జీన్స్‌తో జత చేయాలి. స్నీకర్లు లేదా ఫ్లాట్స్ ఈ లుక్‌ను పూర్తి చేస్తాయి. ఇది క్యాజువల్ చిక్ లుక్‌ను అందిస్తుంది. ఈ అవుట్‌ఫిట్ కాలేజీకి ,  నార్మల్ ఔటింగ్  ప్రయాణాలకు చాలా బాగుంటుంది.

కుర్తీ, ప్లాజో..

స్టైల్‌తో పాటు సౌకర్యం కోసం, మీ కుర్తీని ప్లాజోలతో జత చేయవచ్చు.  వేసవిలో వదులుగా ఉండే ప్లాజోలతో కూడిన కుర్తీ చాలా కంఫర్ట్ గా కనిపిస్తుంది.  పైగా  ట్రెండీగా కూడా ఉంటుంది. ఈ ఔట్ ఫిట్ లో జ్యువెలరీ తక్కువగా ఉండాలి.

కుర్తీ, స్కర్ట్..

ఫ్యూజన్ లుక్ కోసం  సింపుల్ కుర్తీని , స్కర్ట్‌తో జత చేయవచ్చు. బోహో జ్యువెలరీ ఇలాంటి కుర్తీ , స్కర్ట్‌ను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. ఇది పండుగలకు , ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి చాలా మంచి లుక్ ఇస్తుంది.

కుర్తీ, షరారా..

సాంప్రదాయంగా కనిపించడం కోసం, పొట్టి కుర్తీ , షరారా ధరించవచ్చు. దానికి దుపట్టాను జోడించాలి. ఈ శైలి వేడుకలకు , పెళ్లిళ్లకు చాలా బాగుంటుంది.

కుర్తీ, ధోతి ప్యాంట్..

ఇండో-వెస్ట్రన్ శైలి కోసం, కుర్తీని ధోతీ ప్యాంట్లతో జత చేసి ధరించవచ్చు. స్టేట్‌మెంట్ చెవిపోగులతో ఈ లుక్ ను పూర్తి చేస్తే అధిరిపోతుంది. ఇది చాలా స్పెషల్ గా ,  న్యూ లుక్ ను ఇస్తుంది.

మెరుపు చిట్కాలు..

బెల్ట్ జత చేయడం  ద్వారా కుర్తీకి కొత్త లుక్  ఇవ్వవచ్చు.

లేయరింగ్ కోసం ఒక జాకెట్ లేదా ష్రగ్ జోడించవచ్చు.

ధరించే పాద రక్షలు కూడా లుక్ ను పూర్తీగా మార్చేస్తాయి. కాబట్టి పాద రక్షలు ఎంచుకోవడంలో కూడా జాగ్రత్త తీసుకుంటే సూపర్ గా ఉంటుంది.

                                  *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img