గర్భధారణ సమయంలో ఎంతో ముఖ్యమైన విటమిన్ ఇదే..!

గర్భధారణ సమయంలో గర్భవతుల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్ లలో బయోటిన్ ఒకటి. విటమిన్ బి 7 అని కూడా పిలువబడే బయోటిన్ నీటిలో కరిగే బి-కాంప్లెక్స్ విటమిన్. ఇది గర్భధారణ సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పిండం అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, శక్తి ఉత్పత్తిని పెంచుతుంది, జీవక్రియకు సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్ళ కు సహాయపడుతుంది. అయితే గర్భధారణ సమయంలో బయోటిన్ లోపం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ప్రినేటల్ డైట్లో చేర్చడం వల్ల తల్లి, పిండం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అసలు బయోటిన్ గర్భవతులకు ఎందుకంత ముఖ్యం? బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు ఏవి? తెలుసకుంటే..
గర్భం దాల్చినప్పుడు శరీరానికి పోషకాల అవసరం పెరుగుతుంది. బయోటిన్ కూడా ఇందులో ఒక భాగం. ఇది పిండం అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. సెల్యులార్ పెరుగుదలకు అవసరమైన ఎంజైమ్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ బయోటిన్ ఉంటే పిల్లలకు పుట్టుకతో లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం గర్భవతులకు చాలా ముఖ్యం.
గుడ్డు పచ్చసొన..
గుడ్డు పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. కేవలం ఒక ఉడికించిన గుడ్డు పచ్చసొన మంచి మొత్తంలో బయోటిన్ ను అందిస్తుంది. గర్భధారణ సమయంలో సాల్మొనెల్లా ప్రమాదాన్ని నివారించడానికి గుడ్లు పూర్తిగా ఉడికించి తినాలి.
గింజలు, విత్తనాలు..
బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగలో బయోటిన్ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ కూడా ఉంటాయి. చిరుతిండిగా చిన్న గుప్పెడు విత్తనాలు తీసుకుంటే బయోటిన్ అందుతుంది.
చిలకడదుంపలు..
విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చిలకడదుంపలలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్-ఎ కంటెంట్ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది పిండం కంటి ఆరోగ్యానికి, చర్మ అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తుంది.
అరటిపండ్లు..
అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, బయోటిన్ మితంగా ఉంటుంది. అరటిపండు మంచి శక్తిని ఇస్తుంది. మొదటి త్రైమాసికంలో అనారోగ్యం లేదా వికారంతో ఇబ్బంది పడేటప్పుడు ఇవి బాగా సహాయపడతాయి.
పాలకూర..
పాలకూరలో గర్భధారణకు అవసరమైన ఐరన్, ఫోలేట్, పుష్కలంగా ఉంటాయి. తే
తృణధాన్యాలు..
గోధుమలు, వోట్స్, బ్రౌన్ రైస్ లలో ఫైబర్, ఐరన్, బి-కాంప్లెక్స్ విటమిన్లతో పాటు మితమైన స్థాయి బయోటిన్ కలిగి ఉంటుంది.
పాల ఉత్పత్తులు..
పాలు, పెరుగు, జున్నులలో కాల్షియం, ప్రోటీన్ మాత్రమే కాకుండా బయోటిన్ కూడా ఉంటుంది. ఇవి గర్భవతులకు మంచివి.
*రూపశ్రీ.



.webp)