Home » Beauty » ఈ ఇంటి చిట్కాలు వాడితే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి!

ఈ ఇంటి చిట్కాలు వాడితే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి!

ఈ ఇంటి  చిట్కాలు వాడితే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి..!

 ముఖ సౌందర్యాన్ని మరింత అందంగా మార్చేవి పెదవులు.  అయితే చాలామందికి పెదవులు నల్లగా ఉండటం గమనిస్తూ ఉంటాం. పెదవులు నల్లగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి.  ఫిన్ తీసుకోవడం, ధూమపానం, డీహైడ్రేషన్, ఎండకు గురికావడం, రసాయనాలతో కూడిన లిప్ స్టిక్ లు అన్నీ పెదవులు

నల్లబడటానికి కారణమవుతాయి. చాలామంది పెదవులు నల్లధనం పోవాలని,  పెదవులు గులాబీ రంగులోకి మారాలని ఖరీదైన  లిప్ బామ్ లు వాడుతుంటారు. కానీ ఈ ఖరీదైన లిప్ బామ్ లతో  పోలిస్తే, ఇంటి చిట్కాలు చాలా సేఫ్ అని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  పెదవులను సహజంగా గులాబీ రంగులోకి మార్చే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే..


పెదవులను గులాబీ రంగులోకి మార్చే ఇంటి చిట్కాలు..


తేనె, నిమ్మకాయ..

తేనె పెదవులను తేమగా ఉంచుతుంది,హైడ్రేట్ చేస్తుంది, అయితే నిమ్మకాయలోని సహజ బ్లీచింగ్ లక్షణాలు పెదవుల నల్లదనాన్ని తగ్గిస్తాయి. ఒక టీస్పూన్ తేనెను కొన్ని చుక్కల నిమ్మరసంతో కలిపి  పెదవులకు అప్లై చేసి, 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.


గులాబీ రేకులు..

గులాబీ రేకులు  పెదవులకు సహజమైన గులాబీ రంగును తెస్తాయి. దీని కోసం, గులాబీ రేకులను పాలలో కాసేపు నానబెట్టి, పేస్ట్ లా చేసి,  పెదవులకు అప్లై చేయాలి. మారు 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కడిగేయాలి.


చక్కెర,ఆలివ్ ఆయిల్ స్క్రైబ్..

 డెడ్ స్కిన్ తరచుగా పెదాలను నిస్తేజంగా, ల్లగా కనిపించేలా చేస్తుంది. దీన్ని వదిలించుకోవడానికి, అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను ఒక టీస్పూన్ చక్కెరతో కలిపి స్క్రబ్ తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని  పెదవులపై రెండు నుండి మూడు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి


బీట్‌రూట్ రసం..

బీట్ రూట్  దుంపలలో ఉండే సహజ ఎరుపు వర్ణద్రవ్యం  పెదాలను ప్రకాశవంతం చేయడానికి ఒక సులభమైన,ప్రభావవంతమైన మార్గం. పడుకునే ముందు బీట్‌రూట్ రసాన్ని పెదవులకు అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే కడిగేయాలి.

కలబంద జెల్..

కలబంద జెల్ హైడ్రేట్ చేయడంలో,  చర్మాన్ని ట్రీట్ చేయడంలో చాలా ఎఫెక్టీవ్. తాజా కలబంద జెల్‌ను  పెదవులకు అప్లై చేసి దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచాలి.

కొబ్బరి నూనె..

కొబ్బరి నూనె పెదవులకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది . పడుకునే ముందు పెదవులకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. కొబ్బరి నూనె పొడిబారకుండా చేస్తుంది,పెదవులను సహజంగా మృదువుగా, గులాబీ రంగులో ఉంచుతుంది. దీనిని పగటిపూట నాచురల్  లిప్ బామ్ గా కూడా ఉపయోగించవచ్చు.


పసుపు, పాలు ..

పసుపు చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది, అయితే పాలు పెదవులకు పోషణనిస్తాయి. చిటికెడు పసుపును కొద్దిగా పాలతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దానిని  పెదవులపై 5 నిమిషాలు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి.  తర్వాత శుభ్రం చేసుకోవాలి.

                             *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img