Home » Beauty » వందలు పోసి సన్ స్క్రీన్ కొనక్కర్లేదు.. ఇంట్లోనే ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు!

వందలు పోసి సన్ స్క్రీన్ కొనక్కర్లేదు.. ఇంట్లోనే ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు!

వందలు పోసి సన్ స్క్రీన్ కొనక్కర్లేదు.. ఇంట్లోనే ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు!


వేసవి కాలంలో అందరికీ ఎదురయ్యే అతిపెద్ద సమస్య తీవ్రమైన ఎండ కారణంగా చర్మం నల్లబటడం.  దీన్నే సన్ టాన్ అని అంటారు. సన్ టాన్ రాకుండా ఉండటం కోసం ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ ను వాడాలని చెబుతారు. మార్కెట్లో లభించే సన్‌స్క్రీన్‌లు  అప్పటికప్పుడు స్కిన్ ను ప్రొటెక్ట్ చేసినప్పటికీ  వాటిలో ఉండే రసాయనాలు కొన్నిసార్లు  చర్మానికి హాని కలిగించవచ్చు. ఈ కారణంగా చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రసాయనాలు ఎక్కువ లేకుండా తయారు చేసిన సన్ స్క్రీన్లను వేలాది రూపాయలు పోసి కొనుగోలు చేస్తుంటారు. అయితే సన్ స్క్రీన్ ను ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇందులో వాడే పదార్థాలన్నీ చాలా నేచురల్ కావడంతో ఇవి ఎండ నుండి ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు చర్మానికి చాలా మేలు కూడా చేస్తాయి. ఇంతకీ.. ఇంట్లోనే సన్ స్క్రీన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? ఇంట్లోనే సన్ స్క్రీన్ ఎలా తయారు చేసుకోవాలి? తెలుసుకుంటే..

కలబంద,  కొబ్బరి నూనె..

కలబంద జెల్,  కొబ్బరి నూనె రెండూ కలిపిన  మిశ్రమం సన్ స్క్రీన్ లాంటి ప్రభావం చూపిస్తుందట.  ఈ మిశ్రమాన్ని ముఖానికి  పూసుకుంటే.. చర్మానికి. ఎండ నుండి ఉపశమనం కలిగించి, తేమను అందించి, తేలికపాటి ఎండదెబ్బ నుండి కాపాడుతుంది.

దోసకాయ, రోజ్ వాటర్..

దోసకాయ రసం , రోజ్ వాటర్ కలిపి ఒక స్ప్రే తయారు చేసుకోవాలి. దానిని ముఖానికి,  గొంతు,  మెడ ప్రాంతానికి కూడా అప్లై చేసుకోవాలి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది,  టానింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

గంధం,  పసుపు..

చందనం పొడిని పసుపు, రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇది చర్మానికి ఉపశమనం కలిగించి, ఎండదెబ్బ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

హనీ, మిల్క్ సన్ స్క్రీన్..

పాలు, తేనె కలిపితే సన్ స్క్రీన్ లాంటి క్రీమ్ రెఢీ అవుతుంది.  దీన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మాన్ని పోషించి, టానింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

నిమ్మ, కలబంద..

కలబంద జెల్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి పట్టించాలి. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది , చర్మం మీద  ఎండ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

                         *రూపశ్రీ..

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img