పాయసం

 

 

కావల్సిన పదార్ధాలు  :

బియ్యం              - 1కప్పు 
పాలు                  - 4కప్పులు 
పచ్చి శెనగపప్పు    - అర కప్పు 
సగ్గుబియ్యం          - 2 టేబుల్ స్పూన్లు  
బెల్లం                     - పావు కేజీ 
జీడిపప్పు                - 100గ్రాములు 
కిస్మిస్                   - 50గ్రాములు 
యాలకుల పొడి      - 1 టేబుల్ స్పూన్ 
నెయ్యి                    - 25గ్రాములు 

తయారు చేసే విధానం 

ముందుగా బియ్యాన్ని, పచ్చి శెనగపప్పును నీటితో శుభ్రంగా కడిగి నీళ్లలో ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత నీటిని శుభ్రంగా వంచి, సగ్గుబియ్యం, పాలు కలిపిన బియ్యాని కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక్క ఐదు నిమిషాలు తర్వాత పాలలో ఉడికిన అన్నానికి బెల్లం తురుము కలిపి తిరిగి స్టవ్ మీద పెట్టాలి. నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్, యాలకుల పొడిని వేయాలి. పాయసం చిక్కబడిన తర్వాత కొంచెం నెయ్యిని వేసి దింపాలి. ఘుమఘుమలాడే పాయసం రెడీ.