లిప్ స్టిక్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....!

 

అందమైన ఆడపిల్ల అధరాలను ‘సుమధుర మధు కలశాలు’గా వర్ణించిన కవిపుంగవులెందురో! కేవలం అమ్మాయిల అధరాలపైనే వేల కవితలు పుట్టుకొచ్చాయంటే నమ్ముతారా? అతిశయోక్తి అనుకుంటారు కానీ... పిచ్చివాళ్లను పండితుల్ని చేసేశక్తి.. పండితులను పిచ్చివాళ్లుగా మార్చే యుక్తి అమ్మాయిల పెదవులకే ఉందండీ. ఆడవారి అందంలో అధరాల పాత్ర నిజంగా అమోఘం. 

అలాంటి అందాల అధరాలను అలా వదిలేస్తే ఎలా? ఆ అధరాల అందాన్ని మరింత ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేయాలా.. వద్దా? అందుకే... రకరకాల లిప్ స్టిక్ లు మార్కెట్లో ఉన్నాయ్. అయితే... వాటిని ఎలా ఉపయోగించాలి? ఎవరు.. ఎలాంటి రంగు లిప్ స్టిక్ లను ఎంచుకోవాలి? సున్నితమైన పెదాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా చక్కని సమాధానాలను అందిస్తోంది ‘తెలుగు వన్’. చూసి తెలుసుకోండి. తెలుసుకొని పిచ్చెక్కించేయండి!