ట్రెండీ లెహంగాలు..

 

 

ఈ రోజుల్లో ఫ్యాషన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకో కొత్త ఫ్యాషన్ మార్కెట్లోకి వస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్యాషన్ కు సంబంధించి అమ్మాయిలు ఎంత ముందుంటారో.. అంత కన్ఫ్యూజన్ గా కూడా ఉంటారు. ఫంక్షన్స్ కి కాని, పార్టీలకి కానీ ఏం వేసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి లెహెంగాలు మంచి ఉదాహరణ. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఈ లెహెంగాలు హవా నడుస్తుందనేది మాత్రం నిజం. అటు సంప్రదాయ బద్దంగానూ.. ఆధునికంగానూ రెండింటి కాంబినేషన్స్ లో ఇప్పుడు లెహెంగాలు వస్తున్నాయి.

ఎలాంటి వేడుకైనా సరే ఈ లెహంగాలు వేసుకుంటే అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. కేవలం డిజైను, రంగును బట్టే కాకుండా సందర్భానికి తగినట్లుగా సెలెక్ట్ చేసుకోవాలి.. అప్పుడే ట్రెండీగా కనిపిస్తారూ.. నిండుదనం వస్తుంది. ఆధునికతను జోడించాలంటే మాత్రం క్రాప్‌ తరహా లెహెంగాలకు ఓటెయ్యాల్సిందే. ఇవి కూడా ఒకే రకం కాకుండా అసిమిట్రికల్‌, బాక్స్‌ ప్లీటెడ్‌(వెడల్పాటి కుచ్చులు ఉన్న), హైవెయిస్టెడ్‌ రకాల్ని ఎంచుకోవాలి. అంతేకాదు బ్లవుజుపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యమే. ఇక క్రాప్‌తో పాటు పెప్లమ్‌, కేప్‌ తరహా లెహెంగాలూ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి కోల్డ్‌ షోల్డర్‌, ఆఫ్‌ షోల్డర్‌, ఇన్నర్‌ కేప్‌, అవుటర్‌ కేప్‌ వంటి డిజైన్లలో ఇవి ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ లెహంగాలపై మీరు కూడా ఓ లుక్కేయండి...