ప్రత్యేకంగా కనపడండిలా

 


నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే దుస్తులతో పాటు యాక్ససరీస్ మీదా కూడా శ్రద్ధ పెట్టాల్సిందే. అతి మామూలుగా డ్రస్ వేసుకున్నా నప్పే యాక్ససరీస్ ఉపయోగిస్తే ఎంతో అందగా కనిపిస్తారు. మరి ఆ యాక్ససరీస్ని ఎంచుకునే సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటో చూద్దాం.

* హేండ్ బ్యాగులని మన శరీరాకృతిని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి. కాస్త ఎత్తు తక్కువ ఉండేవారు పెద్ద బ్యాగుల జోలికి వెళ్లద్దు. అలాగే సన్నగా ఉన్నవారికి వెడల్పాటి బ్యాగులు కన్నాగుడ్రంగా ఉండే బ్యాగులే బాగా నప్పుతాయి.

* మెడలో ధరించే నగల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎత్తు తక్కువ ఉన్నప్పుడు, లేదా లావుగా  ఉన్నప్పుడు మెడకు దగ్గరగా ఉండే నెక్లెసులు, చోకర్లు అంతగా నప్పవు. సన్నగా, పొడవుగా ఉండే చైన్స్ అయితే బాగుంటాయి. అదే మెడ సన్నగా, పొడుగ్గా ఉన్నవారు మెడకి దగ్గరగా ఉండే గొలుసులు వేసుకుంటే బావుంటుంది.

* చెప్పులు ఎప్పుడూ మనం వేసుకున్న డ్రస్ ని డామినేట్ చేయకూడదు. వీలయితే మ్యాచింగ్ వేసుకోవచ్చు. లేదంటే బ్రౌన్, బ్లాక్ వంటి సాధారణ రంగుల్లో ఉంటే బాగుంటుంది.

* ఆకర్షణీయమైన డ్రస్ వేసుకున్నప్పుడు చెవులకు కొంచం పెద్ద హేంగింగ్స్ పెట్టుకొని, మెడలో మాత్రం సింపుల్ చైన్ వేసుకుంటే బావుంటుంది. అదే డ్రస్ సింపుల్ గా ఉన్నప్పుడు గొలుసు కొంచం గ్రాండ్ గా ఉంటే బావుంటుంది.

* చేతికి బంగారం గాజులు, మెడలో ముత్యాలు, ఇలా వైవిధ్యంగా కాకుండా అన్నీ ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి.


యాక్ససరీస్ లో మీదైన ఓ శైలిని ఏర్పరచుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రత్యేకంగా ఒకే రకమైన బ్యాగులు, నగలు, వంటివి మీదంటూ ఓ ముద్ర వేసేలా చేస్తాయి. మరి మీ స్టైల్ స్టేట్ మెంట్... ఎలా ఉండాలో నిర్ణయించుకోండి.

-రమ