Home » Beauty » వేసవిలో ముఖానికి ఐస్ ఫేషియల్ చేయడం మంచిదేనా!

వేసవిలో ముఖానికి ఐస్ ఫేషియల్ చేయడం మంచిదేనా!

వేసవిలో ముఖానికి ఐస్ ఫేషియల్ చేయడం మంచిదేనా!

వేసవిలో తీవ్రమైన ఎండ, చెమట , జిడ్డు కారణంగా చర్మం డల్ గా, అలసటగా కనిపిస్తుంది. తక్షణ ఉపశమనం కోసం చాలా మంది తమ ముఖానికి ఐస్ అప్లై చేస్తారు, దీనినే ఐస్ ఫేషియల్ అని కూడా అంటారు. అయితే ఈ పద్ధతి నిజంగా ప్రయోజనకరమా, లేక చర్మానికి హాని చేస్తుందా అనే విషయం ఎవరికీ తెలియదు.  కేవలం సోషల్ మీడియాలో ఎవరైనా దీన్ని ఫాలో అయితే చాలు.. దాన్ని చూసి అందరూ ఫాలో అవ్వడం మొదలు పెడతారు. అసలు వేసవిలో ముఖానికి ఐస్ ఫేషియల్ చేయడం మంచిదేనా? తెలుసుకుంటే..

ముఖానికి ఐస్ ఫేషియల్ వల్ల కలిగే ప్రయోజనాలు..

టెంపరరీ కూలింగ్,  తాజాదనం..

వేసవి ఎండలో  ముఖంపై ఐస్ రుద్దడం వల్ల  చర్మం తక్షణమే చల్లబడి, తాజాగా అనిపిస్తుంది. ఇది చెమటను తగ్గించడానికి, దద్దుర్ల నుండి ఉపశమనం పొందడానికి,   తాజాగా ఉన్న అనుభూతిని కలిగించడానికి సహాయపడుతుంది.

చర్మ రంధ్రాలు..

మంచు చర్మంపై తెరిచి ఉన్న రంధ్రాలను సంకోచింపజేసి, చర్మాన్ని నునుపుగా కనిపించేలా చేయడమే కాకుండా,  చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.

వాపు..

ఉదయం పూట  కళ్ల కింద వాపు లేదా ఉబ్బరంగా ఉన్నప్పుడు ఐస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఐస్ అప్లై చేయడం వల్ల ఉబ్బరం తగ్గి,  ముఖం కాంతివంతంగా మారుతుంది.

మెరుపు..

ఐస్ ఫేషియల్ ముఖంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.

జిడ్డు..

 ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఐస్ ఫేషియల్  ప్రయోజనకరంగా ఉంటుంది.  ముఖం అధికంగా జిడ్డును ఉత్పత్తి చేస్తుంటే, ఐస్ ఫేషియల్ చేయించుకోవడం మంచి ఆలోచన. ఇది జిడ్డు , చెమటను నియంత్రిస్తుంది.

ఐస్ ఫేషియల్ వల్ల కలిగే నష్టాలు..

స్కిన్ డ్యామేజ్..

మంచును నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల చికాకు లేదా ఎరుపుదనం కలగవచ్చు. అలా చేయడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరగవచ్చు.

రియాక్షన్..

సున్నితమైన చర్మం ఉన్నవారు ముఖానికి మంచును అప్లై చేయడం వల్ల అలెర్జీ రియాక్షన్స్ లేదా చికాకు కలగవచ్చు.

ఎక్కువ వాడితే..

ప్రతిరోజూ ఐస్ ఫేషియల్ చేయడం హానికరం కావచ్చు. పదేపదే ఐస్ పెట్టడం వల్ల  చర్మం పొడిబారిపోతుంది.

ఐస్ ఫేషియల్ చేసుకునే సరైన పద్దతి..

ఐస్ ను ఒక గుడ్డలో చుట్టి చర్మంపై పెట్టాలి. మంచును ఐస్ ను ఒకటి లేదా రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచకూడదు.

ముఖం కడుక్కున్న ప్రతిసారీ లేదా వేడిగా అనిపించినప్పుడల్లా ఐస్ ఫేషియల్ చేసుకోవడానికి బదులుగా,  రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించడం మంచిది.

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు మొదట ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా ఐస్ ఫేషియల్ చేసుకోవడం మంచిది కాదు.

                             *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img