Home » Baby Care » ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే బోలెడంత సంతోషం అంటారు అంతా.. సంతోషం ఉండే విషయం నిజమే అయినా.. ఆ సంతోషం కంటే ఎక్కువగా పిల్లల తల్లిదండ్రులకు పిల్లల గురించి భాద్యతే ఎక్కువగా అనుభవంలోకి వస్తుంది. ముఖ్యంగా మొదటిసారి  తల్లిదండ్రులైన వారికి తమ పిల్లలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలంటే  వారిని సరిగ్గా ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొద్దిపాటి జాగ్రత్త,  సరైన అవగాహన ఉంటే  పిల్లలు అటు ఆరోగ్య పరంగానూ, ఇటు ఎదుగుదల పరంగానూ బాగా పెరుగుతారు.  ఇంట్లో చిన్న పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

పరిశుభ్రత..

చిన్న పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, కాబట్టి వారి చుట్టూ పరిశుభ్రత ఉండాలి. పిల్లలను ఎత్తుకునే ముందు, వారిని ముట్టుకునే ముందు చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం.  అలాగే  బట్టలు,  పరుపులను శుభ్రంగా ఉంచాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

పోషణ..

నవజాత శిశువుకు తల్లిపాలు చాలా అవసరం. ప్రతి 2-3 గంటలకు పాలు ఇస్తుండాలి. వైద్యుడిని సంప్రదించకుండా కొత్తగా ఏమీ ఇవ్వకూడదు. శిశువు ఎదుగుదలకు సరైన పోషణ చాలా అవసరం.

నిద్ర..

చిన్న పిల్లలు రోజుకు 14-16 గంటలు నిద్రపోతారు. ప్రశాంతమైన, సౌకర్యవంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.   పెద్ద శబ్దాలు, తీవ్రమైన కాంతి పిల్లలను చేరకుండా చూడాలి.  మంచి నిద్ర మీ పిల్లల మానసిక, శారీరక వికాసానికి సహాయపడుతుంది.

జాగ్రత్తలు..

విద్యుత్ సాకెట్లను మూసి ఉంచాలి. చిన్న వస్తువులను పిల్లలకు అందకుండా ఉంచాలి. ఫర్నిచర్ మూలలను మూసి ఉంచాలి. ఇది ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.

వైద్య పరీక్షలు..

క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.  పిల్లల ఎదుగుదలను గమనిస్తూ ఉండాలి. ఏవైనా సమస్యలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది బిడ్డ ఆరోగ్యానికి చాలా కీలకం.

ప్రేమ, శ్రద్ద..

 పిల్లలతో సమయం గడపాలి. వారితో మాట్లాడాలి ఆడుకోవాలి. వారికి భద్రతా భావాన్ని కలిగించాలి. పిల్లల మానసిక వికాసానికి భావోద్వేగ అనుబంధం చాలా అవసరం.

సీజనల్ ప్రొటెక్షన్..

సీజన్ ను బట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో, బిడ్డకు తగినంత నీరు అందేలా చూసుకోవాలి,  శీతాకాలంలో వెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  సీజన్ కు తగ్గట్టు  దుస్తులు వేయడం చాలా ముఖ్యం.

                                *రూపశ్రీ.
 

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img