Home » Baby Care » పిల్లలు అల్లరి చేస్తే అరవకండి.. ఇలా చేస్తే వాళ్లలో ఎంత మార్పు వస్తుందంటే..!

పిల్లలు అల్లరి చేస్తే అరవకండి.. ఇలా చేస్తే వాళ్లలో ఎంత మార్పు వస్తుందంటే..!

పిల్లలు అల్లరి చేస్తే అరవకండి.. ఇలా చేస్తే వాళ్లలో ఎంత మార్పు వస్తుందంటే..!

జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది.  మనం చిన్నగా ఉన్నప్పుడు ఇంకా వివాహం కానప్పుడు.. తల్లిదండ్రులు మనల్ని అరుస్తుంటే.. నేను పెద్దయ్యాక నా పిల్లలను ఇలా అరవను.. వారిని అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను అని ఎన్నెన్నో మనసులో ప్రేమ్ చేసుకుంటాము.  కానీ తల్లిదండ్రులు అయ్యాక పిల్లను తిట్టడం,  కొట్టడం వంటివి చాలా జరుగుతూ ఉంటాయి.  అరవకుండా, తిట్టకుండా,  కొట్టకుండా పిల్లలను పెంచడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే.. అసలు పిల్లలను ఎందుకు అరుస్తారు? గొంతు పెంచకుండా, దెబ్బ వేయకుండా పిల్లలను దారిలో పెట్టే మార్గం లేదా.. దీని గురించి పిల్లల పెంపకం గురించి నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుంటే..

జీవితంలో మొదటి ఏడు సంవత్సరాలలో నివసించే వాతావరణం ఆధారంగా ప్రతి వ్యక్తి మెదళ్ళు "ప్రోగ్రామ్" చేయబడతాయి. ఈ ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కరి  నిర్ణయాలలో 95 శాతం ఆలోచించకుండానే అలా జరిగిపోతుంది.మనం పిల్లలుగా ఉన్నప్పుడు చాలాసార్లు తిట్టించుకుని, కొట్టించుకుని ఉంటే..  మన మెదళ్లు కూడా ఇదిగో ఈ పరిస్థితిని డీల్ చేయడానికి ఇదే సరైన మార్గం అని బావిస్తాయి.  ఒత్తిడి సమయాల్లో దీన్నే రిపీట్ చేస్తూ ఉంటాము. ఒత్తిడి పెరిగినప్పుడు, ఆలోచించడానికి,  అర్థం చేసుకోవడానికి సహాయపడే మెదడు భాగం వెనక్కి తగ్గుతుంది. ప్రశాంతంగా స్పందించే బదులు,  భయం, భయాందోళన,  తొందరపాటుతో రియాక్ట్ అవుతాము.

పిల్లల పైన అరిస్తే ఇవి జరుగుతాయి..

పిల్లల ప్రవర్తనను దెబ్బతీస్తుంది. తల్లిదండ్రులు అరుస్తుంటే  వారి దూకుడు ఇంకా పెరుగుతుంది. పిల్లలు ఏదైనా నేర్చుకోవడం,  వారిని వారు సేవ్ చేసుకోవడం వంటివి తగ్గిపోతాయి.

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య  బంధాన్ని బలహీనపరుస్తుంది,  మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది

పిల్లల మీద అరిచేటప్పుడు కేకలు వేయడం, అవమానించినట్టు మాట్లాడటం,  కఠినమైన భాషను ఉపయోగిస్తే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది.

టార్గెట్..

చాలామంది ఏ పని మొదలు పెట్టినా దాన్ని సాధించడానికి కొన్ని రోజుల టైం తో టార్గెట్ పెట్టుకుంటారు. ఒక టైమ్ సెట్ చేసుకుని దాన్ని సాధించడానికి ఈ మార్గం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. కానీ దీన్ని  పిల్లల విషయంలో  అప్లై చేసినప్పుడు అది వారి జీవితాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. వారికి టార్గెట్ పెట్టి ఒత్తిడి చేయకూడదు. చదవడం, రాయడం,  ఏదైనా నేర్చుకోవడం వంటి వాటికి టార్గెట్ లు పెట్టి వారిని ఒత్తిడిలోకి నెట్టకూడదు.

21రోజులు ఇలా చేస్తే..

21రోజులు పిల్లల మీద అరవడం మానేస్తే చాలా ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి.

7వ రోజు నాటికి ఆలోచనా మెదడు మళ్ళీ చురుగ్గా మారుతుంది.

14వ రోజు నాటికి తల్లిదండ్రుల మీద పిల్లల న్మకం మళ్లీ  బలపడటం ప్రారంభమవుతుంది.

21వ రోజు నాటికి పిల్లల ప్రవర్తన మారడం ప్రారంభమవుతుంది.

దీనిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది భయంతో కాదు బలమైన అటాచ్మెంట్  ద్వారా జరుగుతుంది.

                          *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img