Home » Beauty » డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ ఇలా చేస్తోండి!

డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ ఇలా చేస్తోండి!

డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్.. ఇలా చేస్తోండి!


నేటి బిజీ జీవితాల్లో అందం మీద సెల్ఫ్ కేర్ మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యంగా  మారింది. అందులోనూ చాలామంది ముఖ చర్మ రక్షణ గురించి,  హెయిర్ కేర్ గురించి ఆలోచించినంత పాదాల గురించి ఆలోచించరు.  పాదాల సంరక్షణను బ్యూటీ పరిబాషలో పెడిక్యూర్ అని అంటారు.    పెడిక్యూర్ కోసం చాలామంది బ్యూటీ సెలూన్ కు వెళ్లాల్సిందే అనుకుంటారు.  పైగా దీనికోసం చాలా ఖర్చు కూడా అవుతుంది.  కానీ దీన్ని ఇంట్లో చేయడం చాలా సులభం, అలాగే డబ్బు కూడా ఆదా చేసుకున్నట్టే.. ఇంట్లో చేసుకునే పెడిక్యూర్ పాదాలను మృదువుగా ఉంచడమే కాకుండా చాలా అందంగా కనిపించేలా చేస్తుంది.  ఇంతకీ ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడానికి ఏమేమి కావాలి? దీన్నెలా చేసుకోవాలి? తెలుసుకుంటే..

ఇంట్లోనే పెడిక్యూర్..

ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేయాలో తెలుసుకుంటే ఇది ఎంత సులభమో కూడా అర్థమవుతుంది. పైగా ఇంట్లో చేసుకోవడానికి సౌకర్యంగా కూడా ఉంటుంది.

ముందుగా పాదాలను బాగా కడిగి గోరువెచ్చని నీటిలో 10–15 నిమిషాలు నానబెట్టాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది,  చనిపోయిన చర్మాన్ని తొలగించడం సులభం చేస్తుంది. నానబెట్టిన తర్వాత  పాదాలను ఆరబెట్టి, గోళ్లను కత్తిరించి  వాటిని మంచి షేప్ చేసుకోవాలి.

తరువాత మడమలు,  గోళ్ల నుండి గట్టిగా ఉన్న చర్మాన్ని సున్నితంగా తొలగించడానికి నెయిల్ ఫైల్ లేదా పెడిక్యూర్ రగ్గర్‌ని ఉపయోగించాలి.  గోళ్లపై పాత నెయిల్ పాలిష్ ఉంటే, దానిని నెయిల్ పాలిష్  రిమూవర్‌తో తొలగించాలి.


తరువాత పాదాలు,  మడమలకు తేలికపాటి స్క్రబ్‌ను అప్లై చేసి, చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి పూర్తిగా మసాజ్ చేయాలి. స్క్రబ్ చేసిన తర్వాత  చర్మాన్ని తేమగా,  మృదువుగా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ లోషన్ లేదా పెడిక్యూర్ క్రీమ్‌తో  పాదాలను మసాజ్ చేయాలి. ఆ తర్వాత కావాలంటే నెయిల్ పాలిష్ ను అప్లై చేసి బాగా ఆరేవరకు అలాగే ఉండాలి.

చివరగా పాదాలను తాజాగా ఉంచుకోవడానికి తేలికపాటి టాల్క్ పౌడర్ లేదా ఫుట్ స్ప్రేని ఉపయోగించాలి. పైన చెప్పుకున్న విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వడం  వల్ల  పాదాలు శుభ్రంగా, మృదువుగా,  ఆరోగ్యంగా ఉంటాయి, ఇంట్లోనే సెలూన్ లాంటి పెడిక్యూర్‌ రిజెల్ట్ చూడొచ్చు.

                                    *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img