బాబోయ్.. తెల్ల జుట్టును నల్లగా మార్చడం ఇంత సులువా!

 


తెల్లజుట్టు ఇప్పట్లో చాలా మందికి సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలామంది ఈ సమస్యకు బాధితులు అవుతున్నారు.  అయితే తెల్లజుట్టును వదిలించుకోవడం అంత సులువు ఏమీ కాదు.. దీని బాధ భరించలేక కొందరు హెయిర్ డైతో సరిపెట్టేస్తుంటారు. కానీ తెల్లజుట్టును కవర్ చేసే ఈ  హెయిర్ డై వల్ల జుట్టు మరింత తెల్లగా మారుతుంది. రంగు వెలిసిపోయినప్పుడు అది చాలా దారణంగా కనిపిస్తుంది.  పైగా ఇందులోని రసాయనాల వల్ల మెదడు లోపలి నరాలు చాలా బలహీనం అవుతాయి. చిన్నతనంలోనే మతిమరుపు సమస్యలు వస్తాయి.  అయితే ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా నేచురల్ గా తెల్ల జుట్టును మాయం చేసే చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి.   అలాంటి చిట్కా ఒకటి ఇప్పుడు చెప్పుకుంటే..

ఆయుర్వేదంలో చాలా మంది మహర్షులు, ఋషులు చాలా రకాల వైద్య విధానాలను,  మొండి రోగాలను కూడా పోగొట్టే చికిత్సలను తెలియజేశారు.  వీరిలో బాలరాజ మహర్షి ఒకరు.  తెల్లజుట్టును నల్లగా మార్చడానికి బాలరాజ మహర్షి చెప్పిన సింపుల్ చిట్కా ఉంది.  దీనికి ఖర్చు కూడా తక్కువ. కానీ ఫలితం మాత్రం ఉహించనంత అద్భుతంగా ఉంటుంది.  

చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా తెల్లజుట్టును తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారడానికి బాలరాజ మహర్షి చెప్పిన నూనె చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు.   ఈ నూనె తయారీ కోసం కావలసిన పదార్థాలు..

ఆవాల నూనె.. ఒక కప్పు..

గోరింటాకు.. ఒక కప్పు..

తయారీ విధానం..

ఒక మందంగా ఉన్న కడాయి తీసుకుని దాన్ని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. ఇందులో కప్పు ఆవాల నూనె పోయాలి. కప్పు గోరింటాకును కచ్చాపచ్చాగ దంచుకోవాలి.  కచ్చాపచ్చాగ దంచుకున్న గోరింటాకును ఆవాలనూనెలో వేయాలి. దీన్ని సన్న మంట మీద బాగా ఉడికించాలి.  నూనెలో గోరింటాకు బాగా ఉడికి ఆకులు నల్లగా మారిపోయిన తరువాత  స్టౌ ఆఫ్ చేయాలి.  ఆ తరువాత దీన్ని వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

ఈ నూనెను వారంలో రెండు సార్లు తలకు పెడుతుంటే చాలా గొప్ప మార్పులు ఉంటాయి.  తలకు పెట్టుకుని వీలును బట్టి గంట సేపు.. వీలున్నవారు రెండు గంటల సేపు తలకు ఉంచుకుని కెమికల్స్ లేని షాంపూ లేదా షీకాయతో స్నానం చేయాలి.  లేదంటే రాత్రి సమయంలో ఈ నూనెను తలకు పెట్టుకుని మరుసటి రోజు ఉదయాన్నే తల స్నానం కూడా చేయవచ్చు.  ఈ నూనెను వాడుతూ  నువ్వులు, పల్లీలు, బెల్లం, పాలు, గుడ్లు, గుమ్మడి విత్తనాలు మొదలైనవి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. వీటిని ఆహారం నుండి మిస్ చేసుకోకుండా ఉంటే ఎంత వయసు పెరిగినా జుట్టు తెల్లబడటం అనే సమస్య చాలా వరకు ఉండదు.

                                           *రూపశ్రీ.