చలి కాలాల్లో పిల్లల చర్మ సమస్య గురించి షాకింగ్ నిజాలు..!


వర్షాకాలం, చలి కాలంలో చిన్న పిల్లల్లో చర్మ సమస్యలు..  ముఖ్యంగా దురదలు, ర్యాషెస్, చర్మంపై ఎర్రటి మచ్చలు చాలా సాధారణం. కానీ ఇవి ఎందుకు వస్తాయి, ఎప్పుడు ఇంటి చిట్కాలు సరిపోతాయి, ఎప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లాలి అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు. దీని వల్ల కొన్నిసార్లు పిల్లల సమస్య పెరగడం లేదా సమస్య పెద్దగా లేకున్నా వైద్యుల వద్దకు వెళ్ళడం వల్ల వైద్య ఖర్చు ఎక్కువగా రావడం వంటివి కూడా జరుగుతాయి. అటు పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా, అతిగా వైద్య ఖర్చుకు ఉండకూడదు అన్నా.. చలికాలంలో పిల్లలకు వచ్చే చర్మ సమస్యల గురించి,వాటిని ఇంట్లోనే తగ్గించుకోవడం గురించి తెలుసుకోవాలి.. 

వర్షం–చలి కాలంలో పిల్లల్లో దురదలు, ర్యాషెస్ ఎందుకు వస్తాయి?
చలి వాతావరణం & పొడి చర్మం..


చల్లటి గాలి కారణంగా చర్మంలో తేమ తగ్గిపోతుంది. ఇది dry skin dermatitis లేదా winter rash అనే స్థితిని కలిగిస్తుంది.

తడి బట్టలు లేదా చర్మంపై తేమ ఎక్కువగా ఉండడం..


వర్షపు నీరు, చెమట లేదా తడి బట్టలు ఎక్కువసేపు ఉండడం వల్ల fungal infection లేదా హీట్ ర్యాష్ వస్తుంది.

సబ్బులు లేదా డిటర్జెంట్ల ప్రభావం..


ఎక్కువ సుగంధ ద్రవ్యాలు ఉన్న సబ్బులు, డిటర్జెంట్లు చిన్నారుల చర్మానికి హానికరం.

బ్యాక్టీరియా/ఫంగల్ ఇన్ఫెక్షన్లు


వర్షాకాలంలో  సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి, ప్రత్యేకంగా చెమట ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన గోళ్ల మధ్య, మడమల దగ్గర, కాళ్ళ కింద, మెడ చుట్టూ.


ఇంట్లోనే సులువుగా చేసుకొదగ్గ సేఫ్ చిట్కాలు
చర్మం తడిగా కాకుండా ఉంచడం
పిల్లల బట్టలు పూర్తిగా పొడిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. తడిగా ఉంటే వెంటనే మార్చాలి.

నేచురల్ ఆయిల్ మాయిశ్చరైజర్..
రోజూ స్నానం తర్వాత కొబ్బరి నూనె లేదా బాదం నూనెను పలుచగా రాసి మసాజ్ చేయాలి. ఇది చర్మాన్ని తేమతో ఉంచి దురదను తగ్గిస్తుంది.

 స్నానానికి సహజ చిట్కాలు
స్నానానికి చాలా వేడి నీరు కాకుండా  సాధారణ గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది. 

సబ్బు బదులు వారానికి 2-3సార్లు  సెనగపిండి + పాలు + తేనె మిశ్రమంతో శుభ్రం చేయవచ్చు.

ఓట్స్ బాత్..
ఒక కప్పు ఓట్స్ పొడి చేసుకుని స్నానానికి నీటిలో కలిపితే దురద, ర్యాషెస్ తగ్గుతాయి.
బట్టల జాగ్రత్తలు
సున్నితమైన నూలు బట్టలు వేయడం మంచిది.  కొత్త బట్టలు మొదటిసారి వేసే ముందు ఒకసారి వాష్ చేసి తర్వాత వేయడం  మంచిది.

పిల్లకు తగినంత నీరు తాగించాలు..
చలి కాలంలో పిల్లలు నీరు తక్కువ తాగుతారు, దాంతో చర్మం ఇంకా పొడిగా మారుతుంది.


 వైద్యుడి వద్దకు ఎప్పుడు వెళ్ళాలి?
ర్యాష్ ఎర్రగా పాకిపోవడం లేదా పుస్ రావడం. బుడగలు, చర్మం ఊడిపోవడం.
పిల్లకు జ్వరం రావడం లేదా అసహనం, నిద్రలేమి.

దురద చాలా ఎక్కువగా ఉండి రాత్రి నిద్రపట్టకపోవడం.

కళ్ళ చుట్టూ లేదా జననేంద్రియాల దగ్గర ర్యాషెస్ రావడం.

చర్మం పగలడం, రక్తం కారడం, లేదా తీవ్రమైన పొడిబారడం. వంటి సమస్యలు ఉంటే ఇంటి చిట్కాలు సరిపోవు. డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. .

ఈ జాగ్రత్తలు కూడా..


పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఏ నూనె లేదా చిట్కా వాడే ముందు ఒక చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి.

సుగంధ ద్రవ్యాలు, రంగులు ఉన్న ఉత్పత్తులను దూరంగా ఉంచాలి.

చల్లటి కాలంలో రోజుకు ఒకసారి మాత్రమే స్నానం చేయించాలి. .

                  *రూపశ్రీ.