Home » Beauty » జుట్టు ఎంతో ఆరోగ్యంగా మార్చే హెల్తీ షాంపూ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!

జుట్టు ఎంతో ఆరోగ్యంగా మార్చే హెల్తీ షాంపూ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!

జుట్టు ఎంతో ఆరోగ్యంగా మార్చే హెల్తీ షాంపూ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!

వారంలో కనీసం రెండు నుండి మూడు సార్లు షాంపూతో తలస్నానం చేయడం చాలామంది అలవాటు. మార్కెట్లో లభించే రసాయనాలతో నిండిన షాంపూలు జుట్టుకు హానికరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.  జుట్టు అందంగా,  ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వారు  ఇంట్లోనే ఆరోగ్యకరమైన షాంపూలను తయారు చేసుకోవచ్చు. రసాయనాలు లేని షాంపూను ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే..


షాంపూ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..


1 టీస్పూన్ మెంతులు,

1 టీస్పూన్ బియ్యం,

1 కప్పు శిఖాకాయ్,

1/3 కప్పు ఎండు ఉసిరికాయలు,

1 టీస్పూన్ అవిసె గింజలు,

1/2 కప్పు కుంకుడు కాయలు

4 గ్లాసుల నీరు.

షాంపూ తయారీ విధానం..

ముందుగా ఒక బాణలిలో మెంతులు, బియ్యం, షికాయ వేయాలి.తరువాత ఎండు ఉసిరికాయ, అవిసె గింజలు, కుంకుడు కాయ, నీళ్ళు కలపాలి. ఆ బాణలిని స్టవ్ మీద పెట్టాలి.ఈ మిశ్రమాన్ని మరగనివ్వాలి. నీళ్ళు గోరువెచ్చగా అయినప్పుడు, కుంకుడు కాయ  గింజలను తీసి పారవేయాలి. ఈ మిశ్రమాన్ని 7 నుండి 8 నిమిషాల పాటు ఉడకబెట్టాలి.


అన్ని పదార్థాలు బాగా మరిగిన తర్వాత, వాటిని వడకట్టాలి. తర్వాత  షాంపూ సిద్ధమైనట్టే.  ఈ షాంపూను వారం పొడవునా ఉపయోగించవచ్చు.  వారానికి రెండుసార్లు ఈ షాంపూతో  జుట్టును కడగవచ్చు. రసాయనాలు లేని ఈ షాంపూను ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా,  మెరుస్తూ ఉంటుంది.

హెయిర్ ఫాల్ కు బెస్ట్..

జుట్టు రాలడంతో బాధపడుతుంటే ఇంట్లో తయారుచేసిన షాంపూని ప్రయత్నించవచ్చు. ఇంట్లో తయారుచేసిన షాంపూని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. సహజమైన షాంపూలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అనేక పోషకాలు ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా  ఇంట్లో తయారుచేసిన షాంపూని ఉపయోగించవచ్చు.

                                  *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img