అమ్మతో అనుబంధం

అమ్మతో పిల్లలకి ఉండే అనుబంధం చెప్పనలవి కాదు. అమ్మంటే ప్రేమ, అమ్మ దగ్గర చనువు, అమ్మ మీద విసుగు, అమ్మ ఏదన్న నచ్చని విషయం చెబ్తే కోపమ్.... ఎందుకు? మనం ఏం చేసినా అమ్మ ఏమీ అనదనే ధీమానా? ఒక వేళ ఏమైనా అన్నా మళ్ళీ దగ్గరికి తీసుకుని లాలిస్తుందనే భరొసావా ? Do we take her for granted ? Not realizing, that one day she will leave you and everything and replaces herself with you to go through her path ??

చిన్నప్పుడు, అమ్మ ఒక్క నిమిషం కనిపించక పోతే, ఏడ్చేశాను  . అమ్మ కోసం ఇల్లంతా, ప్రతి మూల మూలన, వంటింట్లో, స్టోర్ రూం లో, డాబా మీద వెతుక్కున్నాను .  చివరికి అమ్మ హాల్లో బొంత మీద పడుక్కుంటే చూసి, అమ్మ పక్కలో చేరి అమ్మ గుండెల్లో తల పెట్టుకుని నిశ్చింతగా పడుక్కున్నాను.  అలాంటిది, అమ్మని వదిలి, చదువు పేరు చెప్పి అమ్మకి దూరంగా ఎక్కడో విజయనగరంలో బాబయ్యగారింట్లో, ఒక సంవత్సరం పాటు ఉండాల్సి వచ్చింది. మా నాన్న గారికి, ప్రతీ మూడేళ్లకీ transfers అవుతూ ఉండేది. మా చదువులు పాడవుతాయని విజయనగరంలో మా బాబయ్య గారింట్లో చదివించారు. అన్న అంతకు ముందు సంవత్సరమే వెళ్ళాడు. నాన్న నన్ను కూడా అన్నతో పాటు పంపుతానంటే అమ్మ గోల చేస్తుందని, అమ్మని వదిలి, నిమిషం కూడా ఉండలేని నేను బెంగ పెట్టు కుంటానేమోనని  నన్ను ఆ మరుసటి ఏడు పంపారు.

నాలుగో తరగతి నుంఛి  సెకండ్ ఫార్మ్ కి ఎంట్రన్స్ రాయడానికి విజయనగరం వెళ్ళాను. అక్కడే ఒక ఏడాది చదివాను. అమ్మ గుర్తుకువచ్చి గుబులు గుబులుగా ఉన్నా, కొత్త స్కూలు, కొత్త్తగా English నేర్చుకోవడం higher level maths , science, geography ---వీటన్నితో బిజీ ఐపోయాను. బాబయ్యగారి అమ్మాయి సుందరి తో చాల close ఐపోయాను. కాని ఎంత మంది ఉన్నా అమ్మ అమ్మే. Final Exams అయ్యాక, పిల్లందరం కలిసి, ముద్దుబిడ్డ సినిమా కి వెళ్ళాం. అందులో పాట , "చూడాలని ఉంది, అమ్మా చూడాలని ఉంది," అనే పాటని casual గా పాడుకుంటూ, ఎదురుగా ఉన్న అమ్మా నాన్నల ఫోటో చూడగానే ఏడుపోచ్చేసింది. ఏడుస్తూ కూర్చున్నాను. ఆ రాత్రి భోజనం కూడా చెయ్యకుండా పడుక్కున్నాను. దాంతో నాన్నమ్మ, బాబయ్య, పిన్ని అందరు ఏకగ్రీవంగా , ఎవరి పిల్లలు వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరుంటే మంచిది అని decide ఐపోయారు. అమ్మ దగ్గరకి వచ్చాకా, మళ్ళీ ప్రతీ చిన్న చిన్న విషయాలకి, arguments , కోపాలు, అలకలు మామూలే., రోజులు, సంవత్సరాలు, గడిచిపోయాయి. మా కోపతాపాల మధ్య, అలకలు, సాధింపులు, tantrums లన్నీఎంతో సహనంతో భరించి , అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసి, పెళ్ళిళ్ళు చేసి, మంచి భర్తని, జీవితాన్ని, ఇచ్చింది.

అన్న America వెళ్లి  సెటిల్ అయ్యాక, మమ్మల్ని sponsor  చేస్తే మేం కూడా America వెళ్లాం. పిల్లలు, పెద్దవాళ్ళయి, నన్ను ఎదిరించి మాట్లాడడం, arguments , అలకలు, కోపాలు . అమ్మా! నువ్వు మాతో పడ్డ బాధ ఇప్పుడర్థమవుతోందమ్మా! ఎన్ని మంచి సూక్తులు చెప్పేది ? ఎన్ని బుద్ధులు గరిపింది.? ఈ మధ్య అమ్మ బాగా జ్ఞాపకానికి వస్తోంది . ఎప్పుడో చిన్నప్పుడు , బాలానందం కార్యక్రమం లో  నేర్చుకున్న పాట మనసులో మెదిలింది .

"అమ్మ మాట ఎంతో అనడమూ మా అమ్మ మనసు మంచి గంధము.
అమ్మ ముద్దు చల్లన, అమ్మ సుద్దు తెల్లన
అమ్మ ముద్దు సుద్దులే ఆది గురువులు,
అమ్మ మాట సాహిత్యం అమ్మ లాలి సంగీథమ్. "

పాట పూర్తిగా గుర్తు లేదు . Friends లో ఎవరికైనా తెలుసేమో కనుక్కొవాలి. చిన్నక్క, బావ, వాళ్ళబ్బాయి కూడా US migrate అయిపోయారు. అమ్మకూడా వాళ్ళతో US వచ్చేసింది . చిన్న చెల్లెలి భర్త పిల్లలు మాత్రం India లొనే ఉండి  పోయారు.

రోజూ  office నుంచి  అన్న ఇంటికి వెళ్లి, అమ్మని చూసి వచ్చేదాన్ని. weekends కి అమ్మని మా ఇంటికి తీసుకువచ్ఛేదాన్ని.  చిన్నప్పుడంతా  అమ్మని సతాయించాను. ఇప్పుడన్నా, అమ్మని, ప్రేమగా చూసుకోవాలి. చిన్నతనంలో miss ఐనదంతా ఇప్పడు పొందాలి. site seeing కి ఎక్కడికి వెళ్ళినా, friends ఇళ్ళకి వెళ్ళినా, గుడికి, స్వామి చిన్మయానంద గారి ప్రవచనాలకి, ఇలా నేనెక్కడికి వెళ్ళినా  అమ్మని కూడా తీసుకువెళ్ళేదాన్ని. రెండు వారాలనుంచి ఆఫీసు లో పని ఎక్కువవడంతో అమ్మని చూడడానికి వెళ్ళడానికి వీలుపడ లేదు. ఆ రోజు office కి వెళ్తూ ఉంటే అమ్మ ఫోన్ చేసింది. "ఎలాగున్నావ్? ఆఫీసు లో పని ఎక్కువగా ఉన్నట్టుంది. ఛాల రోజులైందే  నిన్ను చూసి . ఒక్కసారి కనిపించి వెళ్ళవే. పోనీ, లోపలికి రావద్దులె. ఆ cul-de-sac లో నీ ఎర్ర car అలా ఓ సారి తిప్పుకుని వెళ్ళు. నీ కారు చూస్తే నిన్ను చూసినట్లే ఉంటుంది నాకు " అంది.  అలాగెలేమ్మా, ఈ రోజు overtime ఉంది office లో. early గా పని పూర్తయితే office నుంచి డైరెక్ట్ గా వస్తాను, లేకపోతే రేపు, ఆఫీసుకి వెళ్ళే ముందు వచ్ఛి వెళ్తాను." అని చెప్పాను.

ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్ఛే సరికి, 9, అయిపోయిన్ది. అమ్మకి phone చేసి ఇంక ఇవేళ రాలేనమ్మా అని చెబుదామనుకునే లోగా అమ్మే phone చేసింది ."ఏంటి వస్తున్నావా ?" అని. "Sorry అమ్మా ! ఇంక ఇవేళ రాలేనమ్మా, tired  గా  ఉంది . రేపోస్తాను", అన్నాను. ఏమనుకుందో ఏమో, ఎం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది.

నేను అన్నది, నిజం చేస్తూ ఆ మర్నాడు పొద్దున్నేఅమ్మని చూడడానికి వెళ్ళాల్సి వచ్చింది .  వదిన ఫోన్ చే శారు , "లక్ష్మి! అమ్మ అదోలా ఉన్నారు, మీరు వెంటనే బైలుదేరి రండి, నేను  Ambulance కి Phone చెయ్యాలి, మీరు, మీ అక్కకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి.", అని చెప్పేసి నేనేదైనా అడిగే లోపలే ఫోన్ పెట్టేశారు .

నేను బట్టలు మార్చుకుని మా వారితో, పిల్లల్ని తీసుకుని అన్నా వాళ్ళింటికి వచ్ఛేయమని చెప్పి, అక్కకి ఫోన్ చేసి చెప్పి, కార్ తీసుకుని బయలు దేరాను. అన్నఇల్లు  మా ఇంటికి సరిగ్గా 5 నిమిషాల దూరం.  కార్ పార్క్ చేసి, అమ్మ గది లోకి వెళ్లేసరికి అన్న అమ్మ pulse చూస్తున్నాడు. నన్ను చూడగానే, "అమ్మ ఇప్పుడే వెళ్లిపోయిన్దే", అన్నాడు . నమ్మలేకపోయాను. రాత్రే కదా మాట్లాడింది ? ఇంతలోకి ఏమైంది ? కడుపులోంచి దుఖ్ఖ్హమ్   తన్నుకొచ్చింది . "ఎంత పొరపాటు చేసాను. అమ్మ కి ఎందుకు నన్నంతలాగా  చూడాలనిపించింది? తన ఆఖరి క్షణాలు, తనకి అనుభవమైన్దా? నాకెందుకు అమ్మని ఇంక చూడలేనేమో అనే భావన రాలేదు? అమ్మలకి ఉండే intuition పిల్లలకి ఉండదా? ఆగలేదు కన్నీళ్ళు. ఒక్కసారి అమ్మ మంచం మీద కూర్చుని, " సారీ అమ్మా !. నువ్వు చివరిగా అడిగిన చిన్న కోరికని కూడా తీర్చ లేకపోయాను.", అని భోరున ఏద్చేసాను. "అమ్మా, చిన్నప్పుడొక సారి నాకిష్టమైన బెండకాయ పులుసునీళ్ళ కూర చెయ్యలేదని అలిగాను గుర్తుందా?  . ఇప్పుడు  నువ్వు రమ్మన్నప్పుడు రాలేదని కోపం వచ్చిందా అమ్మా?"  ఏదో చెప్పనలవి గాని బాధ ఆవరించింది . ఆవేదన అంచులు దాటింది .  నెమ్మదిగా, అన్న నా భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాడు.

డెబ్భై ఏళ్ళ వయసులో కూడా  అమ్మ తెల్లవారగట్ల 3 గంటల కి లేచి స్నానం చేసి, పూజ చేసుకుని, అన్నకి ఇడ్లీలు పెట్టి గుండెల్లో నెప్పిగా ఉందని ఒదిన తో చెప్పిందిట. వదిన తో ఆయాసంగా ఉందని, ఊపిరి పీలుస్తూ ఉంటె గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పిందిట."ఇదే మరణ బాధేమోనే , ఇదే  ఐతే  భరించొచ్ఛు" అందిట.  అన్న Doctor. తను వచ్చే సరికి ఆయాసం ఎక్కువయిందిట . మాట్లాడుతూ, మాట్లాడుతూ అన్న చేతుల్లో అమ్మ ప్రాణం పోయింది.

ఎన్నో కష్టాలు పడి ఎంతో ప్రేమతో , సహనంతో ఎనమండుగురు పిల్లల్ని కనీ పెంచిన తల్లి, కన్న కొడుకు చేతుల్లో అనాయాస మరణం పొందింది . ఒక మనిషికి ఉండవలసిన రెండు అదృష్టాలలో, మొదటిది -- అనుకూల దాంపత్యం పొందిందో లేదో తెలీదు కాని , రెండో అదృష్టం మాత్రం పొందింది. మనుషులు ఉండగా వాళ్ళ విలువలు తెలియవు. మన దాకా వస్తేనే గాని మనకి అమ్మ పడిన  కష్టం ఏమిటో తెలీదు. అమ్మతో మనసారా ఎప్పుడూ 10 నిమిషాలు స్థిమితంగా కూర్చుని మాట్లాడలేదు . అమ్మ ఎప్పుడూ మడి, తడి అంటూ, వంటింట్లో వంటలు వండుతూ పూజలు చేస్తూఉండేది , విజయవాడ జంక్షన్ అవడం తో వచ్చే పోయే బంధువులతో ఎప్పుడూ ఊపిరి సలిపేది కాదు అమ్మకి. మేం పిల్లమంతా మా friends, మా ఆటలు, చదువులు తప్ప అమ్మతో close గా మసలలేదన్పిస్తుంది  మా అమ్మ తన పిల్లలకి home work చెయ్యడానికి హెల్ప్ చేయకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన బట్టలు, పుస్తకాలు కొనివ్వలేక పోయి ఉండవచ్చు. కానీ, తన సంతానానికి, తన సత్వ గుణాన్ని సమానంగా పంచి పెట్టింది. ఈనాడు, మాలో ఏమన్నా మంచీ, మానవతా ఉన్నాయంటే, అవి మా అమ్మ, మాకిచ్చిన ఆస్తి.

అమ్మ ఇచ్చిన సంపద "మానవత, మంచి తనం ", అవి చాలు మాకు కల కాలం.

-- లక్ష్మి కర్రా