వాడు లేచి వెళ్ళిపోయాడు.
    
    వాడ్ని కదిలించడానికి ఆ డోస్ చాలనుకున్నాను.
    
    మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు.
    
    సాయంకాలం నాలుగు గంటలకు కాబోలు వచ్చాడు. మాధవి కూడా ఉదయం నుంచీ ఇంట్లో లేదు పొలం వెళ్ళింది.
    
    నా విషయమై సంప్రదించడానికి ఆమె కూడా లేకపోవడంతో వాడికి ఏమీ తోచక పిచ్చిపట్టిన వాడిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు.
    
    నేను వంటపనిలో మునిగిపోయాను.
    
    చీకట్లు పడ్డాయి. అమావాస్య రోజులు కాబోలు చీకటి దట్టంగా వుంది. వండిన పదార్దాలన్నీ దొడ్లోంచి ఇంట్లోకి తీసుకొచ్చాను.
    
    ఎక్కడా అలికిడి లేదు.
        
    మాధవి భర్త బయట తిన్నెమీద కూర్చుని దగ్గుతున్నాడు. అంటే మాధవి కూడా వచ్చిందన్న మాట.
    
    అయితే ఎక్కడికెళ్ళారు వీళ్ళిద్దరూ?
    
    ఇల్లంతా తిరిగాను గానీ ఎక్కడా కనపడలేదు.
    
    ఇక మిగిలింది డాబా.
    
    మెల్లగా మెట్లెక్కాను.
    
    సగం మెట్ల దగ్గరికి వెళ్ళానో లేదో మాటలు వినిపించాయి. బాగా వంగి మరో నాలుగు మెట్లెక్కాను.
    
    ఇప్పుడు స్పష్టంగా విన్పిస్తున్నాయి మాటలు.
    
    "ఉదయం ఇంటికెళ్ళిపోతానంది. అది అంత తొందరగా బరి తెగిస్తుందని అనుకోలేదు. నాకయితే కాళ్ళూ, చేతులూ ఆడలేదనుకో" వాడు అంటున్నాడు.
    
    "మన విషయం పసిగట్టి వుంటుంది. పుట్టింటికి తరిమెయ్ - పీడా వదులుతుంది. నీకిష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్ళి చేసిన మీ అన్నయ్యకు బుద్ది వస్తుంది" మాధవి కసిగా అంది.
    
    "నాకూ అది ఇష్టమనుకో కానీ వూరు వూరంతా ఏమనుకుంటుంది? పరువు పోతుంది? అదీగాక ప్రస్తుతం కాలాలు కూడా మారిపోయాయి. దాని తండ్రి పోలీసు రిపోర్ట్ ఇస్తే నేను తగులుకుపోతాను"
    
    మాధవి ఆలోచనలో పడ్డట్టు మౌనం.
    
    ఏం చేయాలో నాకు తోచడం లేదు.
    
    "నీకు పెళ్ళి చేయాలని మీ అన్నయ్య అంటే ఎందుకు వద్దన్నానో ఇప్పుడయినా అర్ధమైందా?"
    
    "జరిగిపోయిందాని గురించి ఇప్పుడు వగచి ఏం లాభం? జరగాల్సిందాన్ని గురించి ఆలోచిద్దాం"
    
    ఇలా చాలాసేపు చర్చించుకున్న తర్వాత చివరికి వాడు అన్నాడు "శోభనం గొడవ ఏదో కానిచ్చేస్తాను. దాని కడుపులో ఓ కాయ కాస్తే ఇక పుట్టింటికి వెళతానని అనదు. పిల్లాడు పుట్టాక అది ఎక్కడికి వెళుతుంది? కుక్కలా కాపలా వుంటుంది."
    
    "నాక్కావలసింది కూడా అదే"
    
    మాధవి ఒప్పుకోలేదు అది అభిమానమో, ఈర్ష్యో ఫస్ట్ నైట్ జరిగాక తనను చులకన చేస్తాడేమోనన్న భయమో తెలియదు. ససేమిరా వీలు కాదంది.
    
    మరో అరగంటకు వాడు కన్విన్స్ చేయగలిగాడు. అతి కష్టం మీద ఒప్పుకుంది. "నేను సరే నన్నాను గదా అని దాంతో తైతెక్కలాడుతూ వున్నావంటే ఊరుకోను. ఏదో కలిశావంటే కలిశానన్న స్థాయిలోనే వుండాలి" అంటూ షరతులు పెట్టింది.
    
    వాడు తల వూపాడు.
    
    నేను మెట్లు దిగి కిందకు వచ్చేశాను.
    
    రాత్రి భోజనాలయ్యాక ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా స్నానం చేశాను. లైట్ గా ఒళ్ళంతా పౌడర్ రాసుకున్నాను. మల్లెపూలు కాస్త ఎక్కువగానే తలలో తురుముకున్నాను. నీలం కాటన్ చీరమీద అదే రంగు జాకెట్టు వేసుకున్నాను.
    
    వాళ్ళ మాటలు నేను విన్నానన్న డౌట్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అందంగా తయారయ్యాను. తొమ్మిదిగంటలకి గదిలోకి వెళ్ళాను చాప పరుచుకుని పడుకున్నాను.
    
    వాడు మరో అరగంటలో లోపలికి వచ్చాడు.
    
    మంచం మీద కూర్చుని ఏమీ తోచక అసహనంగా అటూ ఇటూ కదులుతున్నాడు.
    
    "తలనొప్పా?" అనడిగాను నవ్వుతూ.
    
    "లేదు, లేదు" అలా అడిగేసరికి కంగారు పడ్డాడు.
    
    మాధవితో పోటీపడి గెలవాలి. ఆమెని వీడినుండి దూరం చేసి నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి. ఇదంతా అసహ్యంగా వున్నా తప్పదు. మరి విజ్రుంభించాలి.
    
    అందుకే సహజమైన సిగ్గుని వదిలేశాను. జాణతనాన్ని నేర్చుకున్నాను.
    
    అలా కూర్చునే చేతులు రెండూ పైకెత్తి ఒళ్ళు విరుచుకున్నాను. అప్పుడు పైట కిందకు లాక్కుపోయి నా స్తనాలు వాడి కళ్ళల్లో డైనమెట్లయి పేలాయి. మందారాల పొడితో చేసినట్లుండే బొడ్డు కనిపించీ, కనిపించకుండా ఊరించింది.
    
    నేను పైట సర్దుకునే ప్రయత్నమేమీ చేయలేదు.
    
    నిజానికి నాలో అద్భుతంగా వుండే పార్టు కూడా అదే. పెళ్ళికాక ముందు నేను వీధిలో నడుస్తుంటే యువకులు ఆబగా అక్కడ చూడడం నాకు తెలుసు. అవి తుఫాను హెచ్చరిక కేంద్రాల్లా భయపెడతాయి. భయాన్ని కూడా నవరసాల్లో ఒకటిగా ఎందుకు చేర్చాలో ఆలాంటప్పుడే అర్ధమవుతుందనుకుంటా.
    
    "అబ్బా! ఏదో పురుగు పడిందండీ" అంటూ కంగారుగా పైకి లేచి చేర కుచ్చిళ్ళను పెరికి దులుపుకున్నాను. అతనిలో కోరిక రాజుకోవడానికి చీర మదతలతో విసురుతున్నట్లే వుంది.
    
    "పోయిందండీ" అంటూ కూర్చున్నారు. అయితే చీర కుచ్చిళ్ళను తిరిగి దోపుకోలేదు. వాటిని అలా ఒళ్ళో వేసుకున్నానంతే. పైన ఏ ఆచ్చాదనా లేకపోవడంతో ఇరవై ఏళ్ళ యవ్వనాన్ని పూలపొట్లంలా కట్టినట్లున్న నా ఎద అతనిలో వాంఛను రేకెత్తిస్తోంది.
    
    "ఈ జాకెట్ కు ఐదు హుక్ లున్నాయి. వీటిని ఒకేసారి తెంపగలరా? పందెం కడదామా? మీరు తెంపలేరని నేను బెట్ కడతాను. పందెం ఏమిటో తెలుసా? ఈ రాత్రికి ఇక జాకెట్టు తొడుక్కోను"
    
    ఇలాంటి ఛాలెంజ్ లకి మగవాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడని తెలుసు తన పశుబలాన్ని నిరూపించుకునే ఛాన్స్ వదులుకోడు.
    
    "ట్రై చేయండి చూద్దాం" ముందుకు జరిగాను.
    
    ఇప్పుడు మరింత దగ్గరగా నా ఎద.
    
    పూర్ణకుంభాల్లా అవి.
    
    వాడు జాకెట్టు మొదట్లో చేయి చొప్పించి బలంగా లాగాడు.
    
    యవ్వనాన్ని బంధించిన సంకెళ్ళు తెగినట్లు అని వూడిపోయాయి.
    
    "భలే బలం మీకు"
    
    ఆ కాంప్లిమెంట్ కు వాడి ముఖం విప్పారింది.
    
    "పందెం ప్రకారం ఇక జాకెట్టు వేసుకోను" అంటూ జాకెట్ ను విప్పేశాను. పాలమీగడలాంటి బ్రా బుద్దిగా నా ఒంటిని అంటిపెట్టుకుని వుంది.