Home » Beauty » ప్రూట్ ఫేషియల్.. వేసవికి భలే బ్యూటీ ఛాయిస్ ఇది!

ప్రూట్ ఫేషియల్.. వేసవికి భలే బ్యూటీ ఛాయిస్ ఇది!

ప్రూట్ ఫేషియల్.. వేసవికి భలే బ్యూటీ ఛాయిస్ ఇది!

వేసవి కాలం రాగానే చర్మం కూడా చాలా డల్ గా మారిపోతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటం కోసం చాలా రకాల బ్యూటీ టిప్స్ ట్రై చేస్తుంటారు. చాలా మంది బ్యూటీ పార్లర్ మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే.. సాధారణ రోజుల్లో పాలో అయ్యే బ్యూటీ టిప్స్ వేసవికి అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే వేసవి కాలం ప్రభావాన్ని సాధారణ రోజుల కంటే ఎక్కువగా చూపిస్తుంది.  వేసవి ఎండ, దుమ్ము, ధూళి,  జిడ్డు.. మొదలైనవన్నీ చర్మాన్ని చాలా అధ్వానంగా మారుస్తాయి.  అయితే ఇవన్నీ చక్కగా తొలగించడమే కాకుండా చర్మాన్ని తాజాగా ఉంటే సూపర్ బ్యూటీ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే అది ప్రూట్ ఫేషియల్ మాత్రమే.. వేసవి కాలంలో చర్మానికి సూపర్ చాయిస్ గా నిలిచే ప్రూట్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి? ఫ్రూట్ ఫేషియల్ వల్ల చర్మానికి కలిగే లాబాలేంటి? తెలుసుకుంటే..

ఫ్రూట్ ఫేషియల్..

చర్మాన్ని సహజంగా శుభ్రం చేసి, చర్మానికి పోషణ ఇవ్వడంలో ప్రూట్స్ బాగా పని చేస్తాయి. ఇవి తినడానికే కాదు.. చర్మం మీద నేరుగా అప్లై చేయడానికి కూడా మంచి ఛాయిస్.  చాలా మంది అమ్మాయిలు ప్రూట్ ఫేషియల్  ఇష్టపడుతున్నారు. అవి  చర్మానికి పోషణనిచ్చి, లోపలి నుండి తేమను అందించి, చర్మాన్ని  కాంతివంతంగా , ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫేషియల్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్రూట్స్ గురించి,  వాటితో ఫేషియల్ ఎలా చేసుకోవాలంటే..

బొప్పాయి ఫేషియల్

వేసవిలో  తీవ్రమైన ఎండ, చెమట , దుమ్ము వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే బొప్పాయి ఫేషియల్‌ను ప్రయత్నించవచ్చు. బొప్పాయి ఫ్రూట్ ఫేషియల్ చనిపోయిన చర్మాన్ని తొలగించి,  చర్మాన్ని మృదువుగా , కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. బాగా పండిన బొప్పాయిని తీసుకుని గుజ్జుగా చేసి.. ఆ గుజ్జును ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.  పది నిమిషాలు అలా మసాజ్ చేసుకున్నాక కొద్ది సేపు అలాగే వదిలేయాలి.  ముఖం ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి.
 

బనానా ఫేషియల్..

బనానా ఫేషియల్  చర్మానికి అద్భుతంగా మేలు చేస్తుంది. ఒక గిన్నెలో బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, తేనె, పాలు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.  ఆ తరువాత కొద్దిసేపు అలాగే వదిలేసి.. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో  అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.

స్ట్రాబెర్రీ ఫేషియల్ ..

స్ట్రాబెర్రీ ఫేషియల్ చర్మానికి సూపర్ గ్లామర్ ను ఇస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  స్ట్రాబెర్రీని తీసుకుని బాగా గుజ్జులాగా చేసుకోవాలి.  ఆ తరువాత ఈ గుజ్జును ముఖానికి అప్లై చేసి దాంతో ముఖానికి మసాజ్ చేసుకోవాలి.  కొద్దిసేపు అలాగే వదిలేసి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  దీన్ని వేసుకోవడం చాలా సులభం, ఫలితాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, జిడ్డు చర్మం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

                                *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img