పండుగల సమయంలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ 5 రకాల దుస్తులు సిద్దం చేసుకుంటే సరి..!
.webp)
పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ అమ్మాయిలు అయినా.. కాస్త పెద్ద వయసు వారైనా సరే.. తాము సాధారణ రోజుల కంటే స్పెషల్ గా కనిపించాలని అనుకుంటారు. ఇంట్లో అయినా లేదా ఆఫీసులు లేదా కాలేజీలు.. ఇలా ఎక్కడైనా సరే.. ప్రత్యేకంగా, స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటారు. సాంప్రదాయ లుక్స్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. కానీ ప్రతి సారి ఒకే విదంగా కాకుండా సంప్రదాయంలో కూడా మరికాస్త భిన్నంగా ఉండాలని కోరుకునే వారు ఉంటారు. అలాంటి వారు తప్పనిసరిగా ఈ కింద చెప్పుకునే దుస్తులను ట్రై చేయవచ్చు. ఎలాగో నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. నవరాత్రులతో పాటు మళ్లీ దీపావళి హడావిడి కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకే రకమైన సూట్, చీర లేదా లెహంగా ధరించే బదులు, ఈసారి కొన్ని కొత్త ట్రెండ్‌లను ఫాలో అవ్వడం ద్వారా లుక్‌ను పూర్తిగా రాయల్‌గా, ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. ఎలాగంటే..
చీరల్లో విభిన్నత..
చీర కట్టుకోవడం బోరింగ్ గా లేకపోతే, దానిని రెగ్యులర్ బ్లౌజ్ కు బదులుగా క్రాప్ టాప్ లేదా కార్సెట్ స్టైల్ బ్లౌజ్ తో జత చేయవచ్చు. ఈ స్టైల్ ఈ రోజుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకమైన దుస్తులు రాత్రి వేడుకలకు, ముఖ్యంగా దీపావళి, డిన్నర్ పార్టీలకు అనుకూలంగా ఉంటాయి.
ధోతీ స్టైల్ చీర..
ఇది చాలా అందంగా కనిపిస్తుంది. చీరను ప్రత్యేకమైన స్టైల్ లో ధరించడం కోసం చూస్తున్నట్లయితే, ఇలాంటి ధోతీ-శైలి చీర మంచి ఎంపిక అవుతుంది. దీన్ని బెల్ట్ లేదా జాకెట్‌తో జత చేయడం వల్ల లుక్ మరింత పెరుగుతుంది. నవమి నుండి దీపావళి పార్టీలు, కుటుంబ ఫంక్షన్ల వరకు దేనికైనా ధోతీ-శైలి చీరను ధరించవచ్చు. హై హీల్స్, స్టేట్‌మెంట్ చెవిపోగులతో దీన్ని ధరించవచ్చు.
ఫ్యూజన్ లెహెంగా
లెహంగా ధరించడంలో ఏదైనా విసుగు ఉంటే.. దాన్ని సాంప్రదాయకమైన దానికి బదులుగా లాంగ్ ష్రగ్ లేదా ఇండో-వెస్ట్రన్ జాకెట్‌తో జత చేస్తే సూపర్ ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన రాయల్ లుక్‌ను సృష్టిస్తుంది. ఈ రకమైన ఫ్యూజన్ లెహంగాను దుర్గా పూజ లేదా రాత్రి పూజకు ధరించవచ్చు. జాకెట్ లేదా ష్రగ్ కోసం కాంట్రాస్టింగ్ రంగును ఎంచుకుని, దానికి సరిపోయే జ్యువెలరీ ధరిస్తే మరింత అధిరిపోతుంది.
షరారా..
షరారా సూట్లు సర్వసాధారణం. కానీ వాటిని నెట్ లేదా సిల్క్ కేప్‌తో జత చేయడం వల్ల లుక్ ట్రెండీగా ఉంటుంది. కుర్తా ధరించడానికి బదులుగా దానిని క్రాప్ టాప్‌తో జత చేయాలి. ఈ ఇండో-వెస్ట్రన్ లుక్ యూత్ చేసుకునే సెలబ్రేషన్స్ లో అద్భుతంగా కనిపిస్తుంది.
బ్లేజర్ తో ధోతీ..
ఈ లుక్ బాస్ లేడీ వైబ్ ని ఇస్తుంది. కాబట్టి ఈ స్టైల్ దుస్తులను కూడా ఎంచుకోవచ్చు. దీని కోసం, స్కర్ట్ లేదా రెడీమేడ్ ధోతీని బ్లేజర్ తో జత చేయాలి. ఈ దుస్తులు ఆఫీసు పూజలు, ఇంటి పూజలకు అద్భుతంగా కనిపిస్తాయి. స్టిలెట్టోస్, వెండి ఆభరణాలతో లుక్ ఇంకా బాగుంటుంది.
*రూపశ్రీ.


.webp)
