స్టైలిష్ ఇండియన్ డ్రెసెస్

ఫాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త కొత్త డిజైన్లు, వింత వింత ఫాషన్లు వస్తున్నాయి. వాటిల్లో బోల్డంత రమ్యత్వం, కావలసినంత దివ్యత్వం. ఎన్నో వెరైటీస్, ఎన్నెన్నో కలర్ కాంబినేషన్స్! గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ ఇండియన్ కల్చర్ ను చాటుతూనే ఫాషన్ ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నాయి.

ఈ విస్తారమైన ఫాషన్ కాన్వాస్ మీద ఇండియన్ వేర్ తనదైన ముద్ర వేసుకుంది. గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ మరింత స్టైలిష్ గా రూపొందుతున్నాయి. ఇది అతిశయోక్తి కాదు. వెయ్యి రకాల వెస్ట్రన్ వేర్ పక్కన ఇండియన్ డ్రెస్ స్పష్టంగా తెలిసిపోతుంది. స్ట్రైకింగ్ గా నిలబడుతుంది. అందంగా కనిపిస్తుంది. ఆకర్షణీయంగా మురిపిస్తుంది.

గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ వేర్ ఎలిగేంట్ గా ఉంటాయని మనవాళ్ళే కాకుండా ఫారినర్లూ అంటున్నారు. గ్లామరస్ డ్రెస్ కు డెఫినిషన్ చెప్తాయి. స్టయిలిష్ గా ఉంటూనే డీసెంట్ గా ఉంటాయి. గ్రేట్ లుక్ తో గ్రేస్పుల్ గా ఉంటాయి. సర్ ప్రైజింగా, షాకింగా, ప్రెటీగా ఉంటాయి. రిచ్ గా, రాయల్ గా కనిపిస్తూ మనసులు దోచుకుంటాయి.

గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ చూపులకు అందంగా ఉండటమే కాదు, సుఖంగా ఉంటాయి. సౌఖ్యం కలిగిస్తాయి. డ్రెస్ స్టయిలిష్ గా ఉన్నప్పటికీ కంఫర్టబుల్ గా లేకపోతే ధరించడం ఇబ్బందే కదా! డిజైన్లో నవ్యత కనిపిస్తుంది. వింత శోభతో మెరుస్తాయి.

ఇలా అందమైన, అద్వితీయమైన ఫాషన్ వేర్ రూపొందించడంలో ఫాషన్ డిజైనర్ల పనితనం, క్రాఫ్టు అర్ధమౌతాయి. మన కల్చర్ ను ప్రతిఫలిస్తూనే, వైడ్ కాన్వాస్ పై ఒక ప్రత్యేక ముద్ర వేయడం అంటే మాటలు కాదు కదా!