Home » Beauty » 3వేల రూపాయల హెయిర్ స్పా.. ఇంట్లోనే 10రూపాయల ఖర్చుతో ఇలా చేసుకోవచ్చు..!

3వేల రూపాయల హెయిర్ స్పా.. ఇంట్లోనే 10రూపాయల ఖర్చుతో ఇలా చేసుకోవచ్చు..!

3వేల రూపాయల హెయిర్ స్పా.. ఇంట్లోనే 10రూపాయల ఖర్చుతో  ఇలా చేసుకోవచ్చు..!


జుట్టును సిల్కీగా, మృదువుగా,  బలంగా మార్చుకోవడానికి చాలామంది మహిళలు హెయిర్ స్పా మీద ఆసక్తి చూపిస్తారు.   దీని కోసం పార్లర్ కు వెళుతుంటారు. ఈ స్పాల కోసం 3వేల రూపాయల వరకు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. అయితే ఎంత డబ్బు ఉన్నా సరే.. జుట్టు కోసం ఏకంగా 3వేల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.. ముఖ్యంగా మధ్యతరగతి,  దిగువ తరగతి అమ్మాయిలకు 3వేల రూపాయలంటే చాలా ఎక్కువ మొత్తం. కానీ 3వేల రూపాయల స్పా ట్రీట్మెంట్ వల్ల లభించే ఫలితాన్ని కేవలం 10రూపాయలతో పొందవచ్చు అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు.   జుట్టును బలోపేతం చేయడానికి,  సహజంగా సిల్కీగా,  మృదువుగా ఉండటానికి ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో.. ఇది జుట్టుకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుంటే..

మసాజ్..

హెయిర్ స్పా లో మొదట  జుట్టును మసాజ్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఈ నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్లలోకి లోతుగా చొచ్చుకుపోతుంది,  ప్రోటీన్ నష్టాన్ని నివారిస్తుంది. ఇది జుట్టును బలంగా,  లోపలి నుండి స్ట్రైయిట్ గా  చేస్తుంది. ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది,  మూలాల నుండి బలపరుస్తుంది.

ఆవిరి..

మసాజ్ చేసిన గంట తర్వాత  జుట్టుకు ఆవిరి పట్టాలి. ఇది జుట్టు కుదుళ్లను తెరుస్తుంది,  పొడి జుట్టు వంటి సమస్యలను నివారిస్తుంది .  జుట్టు చాలా చిట్లినట్లు,  వికృతంగా ఉంటే అలాంటి జుట్టుకు ఖచ్చితంగా ఆవిరి పట్టాలి.

మాస్క్..

ఆవిరి పట్టిన తర్వాత ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్ వేసుకోవాలి.  జుట్టుకు అరటిపండు మాస్క్ వేయాలి. అరటిపండును మెత్తగా చేసి, దానికి రోజ్ వాటర్, కలబంద, విటమిన్ E క్యాప్సూల్ జోడించాలి. దీన్ని  జుట్టు మొత్తం పొడవునా అప్లై చేసి 40 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి.

ప్రయోజనాలు..

పైన చెప్పుకున్న విధంగా మూడు స్టెప్స్ లో హెయిర్ స్పాను ఇంట్లోనే చేసుకోవచ్చు.  కొబ్బరినూనె ఇంట్లో సహజంగా ఉంటుంది.  నీటి ఆవిరి పట్టుకోవడం కూడా సులువే.. ఇక అరటిపండు అందరికీ అందుబాటులో, తక్కువ ధరలో దొరుకుతుంది. ఈ మూడు స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల  హెయిర్ స్పా పూర్తీ అవుతుంది.  

ఈ స్పా చేసుకోవడం వల్ల  జుట్టు సహజంగా కండిషన్ అవుతుంది. జుట్టు బలంగా మారుతుంది,  చుండ్రు తగ్గడంలో సహాయపడుతుంది.  జుట్టు చివర్లు చిట్లడం తగ్గుతుంది.  అలాగే జుట్టుకు సహజ మెరుపు వస్తుంది.

                         *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img