ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నవరాత్రులు తెలియజేస్తాయి!
దేవీ నవరాత్రుల వెనుక కేవలం అమ్మవారి ఆరాధన మాత్రమే కాదు.. అమ్మవారి నవదుర్గ రూపాలతో ఆడపిల్లల జీవితానికి చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా అమ్మవారి తొమ్మిది రూపాలు ఆడపిల్లల జీవితాన్ని వ్యక్తం చేస్తాయి.
శైలపుత్రి..
ఆడపిల్ల మొదటి రూపం. ఆడపిల్ల పుట్టినప్పుడు శైలపుత్రి అంటారు. ఈ దశలో తల్లిదండ్రులు ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకుంటారు.
బ్రహ్మచారిణి..
ఆడపిల్ల జీవితంలో రెండవ దశను ఈ రూపం సూచిస్తుంది. ఈ దశ ఆడపిల్ల బాల్యం నుండి యుక్తవయస్సుకు మారడాన్ని సూచిస్తుంది.
చంద్రఘంట..
వివాహం వయసుకు వచ్చిన ఆడపిల్లను చంద్రఘంట దేవి తో పోలుస్తారు. వివాహం తర్వాత ఈ రూపాన్ని తీసుకుంటుంది.
కూష్మాండ..
ఆడపిల్లలు వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత తన కుటుంబంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతను పెంచుతూ వెలుగును పంచుతుంది.
స్కందమాత..
వివాహం అనంతరం ఒక ఆడపిల్ల స్వయంగా తల్లి అయినప్పుడు ఆమెను స్కందమాతకు ప్రతిరూపంగా పూజిస్తారు.
కాత్యాయని..
ఆడపిల్ల కుటుంబాన్ని రక్షించడానికి, ప్రతికూలత నుండి విముక్తి చేయడానికి శ్రమించడం కాత్యాయని అమ్మ రూపంలో స్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది.
కాళరాత్రి..
మహిళల జీవితంలో ఇబ్బందులు, ప్రతికూల శక్తులను దైర్యంగా ఎదుర్కోవడం, వాటిని నాశనం చేయడంలో కాళరాత్రి రూపాన్ని దర్శించవచ్చు.
మహాగౌరి..
జీవితం చివరి దశలో స్వచ్ఛత, త్యాగానికి ప్రతీకగా మహాగౌరి గోచరిస్తుంది.
సిద్ధిదాత్రి..
ఆడపిల్ల జీవితాన్ని సంతోషంగా గడిపి చివరకు ముక్తిని పొందే రూపం సిద్ధిదాత్రి.