ట్రెండీ బాగ్స్ కాదు …..ఫ్రెండ్లీ బాగ్స్ 

 

కాలేజ్, ఆఫీస్, షాపింగ్ ఇలా ఎటు వెళ్లినా సరే మనవెంట బ్యాగ్ ఉండాల్సిందే. అలాంటిది మనకు సూటయ్యే బ్యాగ్ ఏది..? ప్రజెంట్ ఏ ట్రెండ్ బ్యాగ్స్ చక్కర్లుకొడుతున్నాయో తెలుసుకోండి..


హ్యాండ్‌‌బ్యాగ్స్ చూడడానికి అందంగానే కాదు.. మనకి సౌకర్యవంతంగా కూడా ఉండాలి. ఇంకా మనకు ఈ మధ్య సందర్భాన్ని బట్టి వేసుకునే హ్యాండ్ బాగ్స్ అన్ని ఒకచోట కంబోపాక్స్ లో దొరుకుతున్నాయి ఆన్ లైన్  షాపింగ్ లో ఇలా అయితే, అన్నీ బ్యాగ్స్ అందరికీ సూట్ కావు.. మన శరీరాకృతిని బట్టీ బ్యాగ్స్‌ని ఎంచుకోవడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తాం. ఎత్తు తక్కువగా ఉండేవారికి పొడవు బ్యాగ్స్ అంటే స్లింగ్ బ్యాగ్ తరహావి బాగుంటాయి.. సన్నగా, పొడవుగా ఉన్నవారికి పొట్టి బ్యాగులు బాగుంటాయి. మార్కెట్లోకి ఇప్పుడు స్టైలీష్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. అందులో మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు.. ఫ్లోరల్, డిజిటల్ బ్యాగ్స్ ప్రజెంట్ ట్రెండ్ ఆఫీస్ కి , కిడ్స్ కి లంచ్ పెట్టడానికి కూడా ఇప్పుడు చాల మంది ఈ జూట్ బాగ్స్ వాడుతున్నారు స్లింగ్ బ్యాగ్స్ కూడా మరింత ఫ్యాషన్‌గా మారాయి.. ఇక వేసవి సెలవులకి టూర్ కి వెళ్లే వాళ్ళకోసం ఈ ట్రావెల్ బాగ్స్ చాల బాగుంటాయి. బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్ అయితే ఎప్పుడూ ట్రెండీనే కాబట్టి మీకు అనువైన బ్యాగ్స్ ఎంచుకోండి.. ఫ్యాషన్ ఐకాన్‌గా నిలవండి..