సర్వైకల్ క్యాన్సర్..  మహిళలకు ప్రాణాంతక జబ్బు ఇది..!

మహిళల ఆరోగ్యానికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య రక్కసిలా కోరలు చాపుకుని పొంచి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి , మోడల్.. పూనమ్ పాండే మహిళల ప్రాణాలను అధికంగా బలితీసుకుంటున్న సర్వేకల్ క్యాన్సర్ తో మృతిచెందింది. అప్పటికే ఈ క్యాన్సర్ గురించి పలు అవగాహనా వార్తలు, చర్యలు తీసుకుంటుంటగా.. పూనమ్ పాండే మృతి ఈ సమస్య మీద గట్టిగా చర్చించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది.  32ఏళ్ల వయసుకే  పూనమ్ పాండే మరణానికి కారణం అయిన సర్వైకల్ క్యాన్సర్  ఎలా వస్తుంది? దీనికి చికిత్స లేదా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

మహిళలలో యోని, గర్భాశయాన్ని కలిపే భాగాన్ని సర్వైకల్ అని పిలుస్తారు. ఈ సర్వైకల్  ప్రాంతంలో క్యాన్సర్ కణాలు పెరిగి అవి క్రమంగా గర్బాశయంలోకి వ్యాపించి వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్బాశయ క్యాన్సర్ అని అంటారు.  నిజానికి సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి.  హ్యూమన్ పాపిల్లోమావైరస్ ఈ వ్యాధికి కారణమవుతుంది.  కానీ ఈవైరస్ వచ్చినప్పుడు చాలా వరకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దీన్ని అధిగమిస్తుంది. ఈ  హ్యూమన్ పాపిల్లోమావైరస్  కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే గర్భాశయ క్యాన్సర్ కు కారణం అవుతాయి.

ఈ వైరస్ ఎలా సంక్రమిస్తుందంటే..

చాలావరకు ఈ వైరస్ శారీరక సంభోగం వల్లే వస్తుంది. అక్రమ సంబంధాలు కలిగి ఉండటం. ఎక్కువ మందితో రిలేషన్ మెయింటైన్ చేయడం వంటివి ఈ వైరస్ కు ఎక్కువ కారణాలు.  యోని ప్రాంతంలో ఇన్పెక్షన్లు రావడం వంటివి కూడా ఈ వైరస్ రావడానికి ప్రధాన కారణం అవుతాయి.

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు..

కటి నొప్పి
మూత్రంలో రక్తం
లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం
పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువ
పీరియడ్స్ ముగిసిన తర్వాత కూడా రక్తస్రావం కావడం
వింత వాసనతో కూడిన బ్లడ్ లేదా యోని నుండి ద్రవాలు రావడం
అలసట
ఆకలి నష్టం
వెన్నునొప్పి
కాళ్ళలో వాపు


గర్భాశయ క్యాన్సర్ నాలుగు దశలలో ఉంటుంది. దీనికి చికిత్స క్యాన్సర్ దశను బట్టి జరుగుతుంది. కీమెథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్లెటెడ్ థెరపీ, శస్త్రచికిత్స, ఇమ్యునోథెరపీ మొదలైన పద్దతులలో దీనికి చికిత్స చేస్తారు.

                                               *నిశ్శబ్ద.